అందరికీ ట్రాజెడీ

By Staff

Andaru Dongale
చిత్రం: అందరూ దొంగలే
నటీనటులు: రాజేంద్రప్రసాద్‌, ప్రభుదేవా, నాగబాబు, అంకిత,
కిరణ్‌ రాథోడ్‌, బ్మ్రనందం, కోవైసరళ, కృష్ణభగవాన్‌, తదితరులు
సంగీతం: చక్రి
నిర్మాత: హర్షారెడ్డి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: 'నిధి' ప్రసాద్‌

గతంలో రెండు ఫ్లాప్‌ చిత్రాలు రూపొందించిన నిధి ప్రసాద్‌కు 'అందరూ దొంగలే' మూడో ప్రయత్నం. రాజేంద్రప్రసాద్‌, ప్రభుదేవాలాంటి మంచి కాస్టింగ్‌తో భారీగా తీసిన ఈ చిత్రం పేరుకు 'కామెడీ' కానీ చూసేవారికి, తీసిన నిర్మాతకి ట్రాజెడీ. తలాతోకాలేని డైరక్షన్‌ అంటే ఏమిటో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. కథ ఒక హాలీవుడ్‌ చిత్రం నుంచి తీసుకొని తెలుగులో 'కిడ్నాప్‌' డ్రామాకు జోడించి 'మనీ' సంపాదించాలని ప్రయత్నమే ఈ సినిమా. దర్శకుడు శివనాగేశ్వరరావు టైప్‌లో సినిమా తీసినా బాగుండేది. కానీ మనకి ఎక్కడా నవ్వు రాదు కదా థియేటర్‌ నుంచి ఎప్పుడు పారిపోదామా అనే రీతిలో ఉంది. దర్శకుడు నిధి ప్రసాద్‌ టోటల్‌గా ఫెయిలయ్యాడు.

కేకే (నాగబాబు) అనే వయసుమల్లిన ధనవంతుడికి సెక్సీ సెక్రెటరీ నవీన (కిరణ్‌ రాథోడ్‌)కి కోరిక కలుగుతంది. నవీనకు కూడా ఇతన్ని బుట్టలో వేసుకొని ధనవంతురాలవ్వాలనుకొంటుంది. కేకే కూతరు ఉషా(అంకిత)కి తండ్రి-సెక్రటరీల రోమాంటిక్‌ ట్రిప్‌ గురించి తెలిసి, తనే కిడ్నాప్‌ అయినట్లు డ్రామా ఆడుతుంది. ఓ పార్క్‌లో ఉన్న కారు వద్దకి వచ్చి పదిలక్షలు ఇవ్వమని చెపుతుంది.

కేకే పదిలక్షల సూట్‌కేసుతో వస్తుండగా ఏడుగురు దొంగల ముఠాలోని బుజ్జి(ప్రభుదేవా) అనే ఒకడు ఆ సూట్‌కేసును కొట్టేస్తాడు. కారులోనే పారిపోతాడు. ఇక సినిమా అంతా ఈ చేజింగ్‌లు, దొంగతనాల మధ్య హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమాయాణాలతో పాటలతో విసుగెత్తించేలా సాగుతుంది.

ఓ ఎన్నారై యువకుడు హర్షారెడ్డి ఎంతో ఉత్సాహంతో భారీగా నిర్మించిన ఈ సినిమాకు నిధి ప్రసాద్‌ దర్శకత్వంతో 'గోవిందా' అనేలా చేశాడు. ప్రభుదేవా, రాజేంద్రప్రసాద్‌, నాగబాబు, ఇంకా ఇతర తారాగణం అంతా కామెడీ బాగా చేసే నటులే కానీ, అసలు కామెడీకితగ్గ సీన్లు లేనప్పుడు వారి ప్రతిభ గురించి చెప్పదేముంటుంది. కిరణ్‌ రాథోడ్‌, అంకితలు వీలైనంతగా 'ఒళ్ళు దాచుకోకుండా' నటించేశారు. చక్రి సంగీతం సినిమాకంటే దారుణంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X