Andhra King Taluka First Review: ఆంధ్రా కింగ్ తాలుకా మూవీ ఫస్ట్ రివ్యూ
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై పాపులర్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలుకా. ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు పీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, యువ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
రొమాంటిక్ లవ్ స్టోరి, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు సిద్దార్థ నూని సినిమాటోగ్రఫిని, వివేక్- మెర్విన్ మ్యూజిక్ ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు.ఈ చిత్రం నవంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని వీక్షించిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వెల్లడించిన అభిప్రాయాలు, ఫీడ్ బ్యాక్, అలాగే జారీ చేసిన సర్టిఫికెట్, రన్ టైమ్ వివరాల్లోకి వెళితే..

ఆంధ్రా కింగ్ సినిమా కథ విషయానికి వస్తే.. తెలుగు సినిమా పరిశ్రమలో ఆంధ్రా కింగ్ అని ముద్దుగా పిలుచుకొనే సినీ హీరో సూర్య కుమార్ (ఊపేంద్ర)ను సాగర్ అనే యువకుడు పిచ్చిగా ఆరాధిస్తాడు. పాలిటెక్నిక్ చదివే సాగర్ తన అభిమాన నటుడి కోసం ఏం చేశాడు? తాను అభిమానించిన హీరో ప్రభావంతో సాగర్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది. మహాలక్ష్మీ (భాగ్యశ్రీ)తో సాగర్ ప్రేమ వ్యవహారం ఎలా సాగింది అనేది బ్రాడ్ స్టోరి. ఈ సినిమాలో సినీ హీరోలకు, అభిమానులకు మధ్య ఉండే భావోద్వేగాలు హైలెట్‌గా ఉంటాయని ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ పదే పదే ప్రస్తావించింది.
ఈ సినిమాను ఇటీవల సెన్సార్ అధికారులు వీక్షించిన తర్వాత స్వల్ప మార్పులు, సూచలనతో క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని పాత్రల మధ్య ఎమోషన్స్ ప్రాపర్‌గా వర్యవుట్ చేశాడు దర్శకుడు. రామ్ పోతినేని, ఉపేంద్ర మధ్య ఉండే సన్నివేశాలు హైలెట్ ఉంటాయి. అలాగే హీరో, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే మధ్య లవ్ ట్రాక్ కొత్తగా ఉంది అనే అభిప్రాయాన్ని సెన్సార్ ప్రతినిధులు వెల్లడించారనే విషయం బయటకు వచ్చింది.
ఆంధ్రా కింగ్ తాలుకా సినిమా కంటెంట్‌పై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాపై పెద్దగా అభ్యంతరాలు లేకుండానే క్లీన్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రానికి యూఏ (UA13+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. 13 ఏళ్లకుపైబడిన యువతీ , యువకులు ఈ సినిమాను చూసేందుకు అనుమతించారు. 13 ఏళ్లకు లోబడి ఉండే పిల్లలు మాత్రం తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూసేందుకు అనుమితి ఇస్తూ సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఫ్యాన్ వార్స్, ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో సాగే ఈ సినిమా నిడివిని ఏ మాత్రం శృతి మించకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ సినిమాను నిడివి 166 నిమిషాలు అంటే సుమారుగా 2 గంటల 46 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా రన్ విషయంలో ఎలాంటి ల్యాగ్, సాగదీత లేకుండా చర్యలు తీసుకొన్నారనే విషయాన్ని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
రామ్ పోతినేని నటించిన చిత్రాలు ఇటీవల కాలంలో పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. అలాంటి సమయంలో తప్పనిసరిగా భారీ హిట్ కొట్టాల్సిన టార్గెట్ ఆయన ఆంధ్రా కింగ్ తాలుకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా రామ్‌కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ అప్ డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











