Andhra King Taluka Twitter Review: ఆంధ్రా కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. వివేక్- మెర్విన్‌లు సంగీత దర్శకత్వం వహించారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. దాంతో ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. టీజర్, ట్రైలర్లుతో పాటు ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నార్త్ అమెరికాతో పాటు పలు ప్రాంతాలలో ప్రీమియర్లు నవంబర్ 26వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

ఆంధ్రా కింగ్ తాలూకా సూపర్‌హిట్. రాపో కుమ్మేశాడు. రామ్, భాగ్యశ్రీల ఆన్‌స్క్రీన్ కెమెస్ట్రీ పీక్స్‌లో. దర్శకుడు మహేశ్‌ది గ్రేట్ జాబ్. ప్రతి హీరో డై హార్డ్ ఫ్యాన్ కనెక్ట్ అవుతాడు. వెళ్లి సినిమా చూడండి అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
ఆంధ్రా కింగ్ తాలూకా మొత్తంగా రామ్ పోతినేని వన్ మ్యాన్ షో. ఎనర్జిటిక్ స్టార్ రామ్, భాగ్యశ్రీ బోర్సేల కెమెస్ట్రీ సూపర్. వండర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్. రామ్ పోతినేని, ఉపేంద్రల చివరి 30 నిమిషాల ఎమోషనల్ సీక్వెన్స్ కోసం సినిమా చూడొచ్చు. ఎప్పటిలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా సినిమాను నిర్మించింది. మెర్విన్ సోలోమన్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్. సంగీతం ప్రతీ ఫ్రేమ్‌ను రిఫ్రెష్‌గా మారుస్తుంది. దర్శకుడు మహేశ్ 24 క్రాఫ్ట్స్ శ్రమను స్క్రీన్‌పై అద్భుతంగా వాడుకున్నాడు. అతనికి మరో బ్లాక్‌బస్టర్ హిట్ అని ఓ అభిమాని రివ్యూ ఇచ్చాడు.
ఆంధ్రా కింగ్ తాలూకా రామ్ పోతినేని నుంచి వచ్చిన డీసెంట్ ఫిల్మ్. సెకండ్ హాఫ్‌లో రామ్ పోతినేని నటించిన ఎమోషనల్ సీన్స్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, ఆయన క్యారెక్టర్ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది. భాగ్యశ్రీ భోర్సేతో రామ్ కెమెస్ట్రీ తెరపై ఫ్రెష్‌గా, అందంగా ఉంది. వివేక్ - మెర్విన్‌ల సంగీతం ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. వరదలు ముంచేత్తే సీన్‌ని బాగా తీశారు. ఉపేంద్ర క్యారెక్టర్, నటన డెప్త్‌గా ఉంది. దర్శకుడు మహేశ్ బాబు బెస్ట్ ఇచ్చాడు.
ఆంధ్రా కింగ్ తాలూకా.. ఎమోషనల్, ఎంగేజింగ్‌గా ఉంటుంది. రామ్ పోతినేని అద్భుతంగా నటించారు. మహేశ్ రాసిన డైలాగులు, రచనా విధానం బాగుంది. పాటలు, సెకండాఫ్ సూపర్. క్లైమాక్స్‌ను అద్భుతంగా దించారు. రామ్ పోతినేని ప్రభావం మనపై ఖచ్చితంగా పడుతుంది అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
తెలుగు సినిమాకు యూనిక్ స్టోరీ దొరికింది. ఫస్ట్ టైం ఫ్యాన్ కల్చర్‌కి సరైన నివాళి దక్కింది. ఆంధ్రా కింగ్ తాలూకా కొత్తపుంతలు తొక్కింది అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
ఆంధ్రా కింగ్ తాలూకా రివ్యూ: ఫస్టాఫ్ ఉప్పితో స్టార్ట్ అయి.. వింటేజ్ రామ్ పోతినేని సాంగ్, డ్యాన్స్. ఉపేంద్రకు ఫ్యాన్ ఎలా అయ్యాడు, బిగ్‌బాస్ ఇంట్రో, లవ్ ట్రాక్ బాగా సెట్ చేశారు. రిఫ్రెషింగ్ స్టోరీ. ఇంటర్వెల్ బ్లాక్, బీజీఎం సూపర్. ఓవరాల్‌గా ఫస్టాఫ్ గుడ్. సెకండాఫ్ విషయానికి వస్తే.. బాగా బ్యాలెన్స్ చేశారు. చిన్ని గుండెల్లో సాంగ్, విజువల్స్ బాగున్నాయి. ఇది కంప్లీట్‌గా ఒక అభిమాని కథ. మంచి క్లైమ్యాక్స్‌తో ముగించారు. మొత్తం మీద రామ్ పోతినేని లుక్స్, ఇంటర్వెల్‌లో ఆయన పర్ఫార్మెన్స్ సూపర్. భాగ్యశ్రీ చాలా బాగా చేసింది. ఫ్రెష్ కాన్సెప్ట్, రెండు సాంగ్స్, బీజీఎం, ఫ్యాన్, ఎమోషన్, లవ్ బాగా బ్యాలెన్స్ చేశారు. మొత్తంగా వీకెండ్‌లో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











