twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆరంభ శూరుడు 'అంధ్రుడు'

    By Staff
    |

    Andhrudu
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: ఆంధ్రుడు
    విడుదల తేదీ: 19-8-2005
    నటీనటులు: గోపీచంద్‌, గౌరీ పండిట్‌, షాయాజీ షిండే,
    కె విశ్వనాధ్‌, సలీం, సునీల్‌, లక్ష్మీపతి, రవిబాబు, ధర్మవరపు సుబ్రమణ్యం
    సంగీతం: కళ్యాణ్‌ మాలిక్‌
    మాటలు: రమేష్‌, గోపీ
    ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌
    దర్శకుడు: పరుచూరి మురళి
    నిర్మాత: ఎంఎల్‌ కుమార్‌ చౌదరి

    తొలి చిత్రంతో యాక్షన్‌ హీరోగా ప్రూవ్‌ చేసుకున్న మలిప్రయత్నంగా దర్శకుడు పరుచూరి మురళితో చేసిన ప్రయత్నం 'అంధ్రుడు' సీన్లు వారిగా విడివిడిగా చూడడానికి బాగున్నా కథ ఎటు వెళ్తుందో అర్ధం కాని కథనం , ప్ర«ధాన పాత్రల చిత్రరణ సరిగా లేకపోవడంతో చిత్రం దిగజారిపోయింది. ఫస్టాఫ్‌ ప్రేక్షకుల సహనానికి పరీక్ష కాగా సెకండాఫ్‌ ఫర్వాలేదు.

    కీర్తి క్రియేషన్స్‌ గత చిత్రాలు (ఇడియట్‌, ధన 51)లో లాగానే ఈ సినిమాలోనూ పోలీసు కమిషనర్‌ కూతుర్ని హీరో ప్రేమిస్తాడు. ఎలాగంటే హైదరాబాద్‌ సిటీకి పవన్‌ మల్హోత్రా కమిషనర్‌గా వస్తాడు. ఆయన కూతురు అర్చన (గౌరీ పండిట్‌). ఆమెకి సంగీతం అంటే మక్కువ. సంగీతం మాస్టారు విశ్వనాధ శాస్త్రి వద్దకు పాఠాలు నేర్చుకోడానికి వెళ్తుంది. అక్కడ ఆయన కొడుకు సురేంద్ర (గోపీచంద్‌) పరిచయమవుతాడు. అతను నిజాయితీ, ఆవేశం గల ఒక సస్పెండెడ్‌ ఎస్సై. సినిమా ఫక్కీలో ఇద్దరూ ప్రేమలో పడతారు. దానికి స్నేహం అని పేరు పెట్టుకుంటారు. ఈ విషయం గమనించిన పెద్దలు పెళ్ళి చేద్దామని నిశ్చితార్ధం ఏర్పాటు చేస్తారు. ఈలోపు హీరోయిన్‌ బావ మున్నా బీహార్‌ నుంచి ఫోన్‌ చేస్తాడు. అతని తండ్రి షాయాజీ షిండే అక్కడ ఎంపీ. చాలాకాలంగా పవన్‌ మల్హోత్రా కుటుంబానికి అతని చెల్లెలు కుటుంబానికి సంబంధాలు ఉండవు. పుష్కరాలకు షాయాజీ షిండే కుటుంబం ఆంధ్రాకు వస్తుంది. షిండే కొడుకు మున్నా మామ కూతురిని ప్రేమిస్తాడు. తన కొడుకు ప్రేమలో పడ్డాడు కాబట్టి ఆ కుటుంబాన్ని కలుపుకోవాలని చూస్తారు. హీరోయిన్‌ కూడా కుటుంబం సెంటిమెంట్‌తో సురేంద్రతో ప్రేమను త్యాగం చేసి బావతో పెళ్ళికి ఒప్పుకుని బీహార్‌కు వెళ్తుంది. ఆ పరిస్ధితిలో సురేంద్ర బీహార్‌ వెళ్ళి ఆమె ప్రేమను తిరిగి ఎలా పొందగలిగాడనేది మిగితా కథ.

    భయంకరమైన బీహార్‌ నేపధ్యం గల కథ కాబట్టి ప్రేక్షకులు థియేటర్లకు ఆకర్షితులవుతారు. కానీ సినిమా బీహార్‌ సన్నివేశాలేవీ పండలేదు. అలాగే కథకు సంబంధం లేకపోయినా సునీల్‌, లక్ష్మిపతిల కామెడీ ట్రాక్‌ చాలా బాగుంది. టేకింగ్‌ పరంగా సన్నివేశాలు చక్కగా ఉన్నా స్క్రీన్‌ప్లే లోపంతో బిగి సడలిపోయి ప్రేక్షకులు విసుగు చెందుతారు. ముఖ్యంగా హీరో లక్ష్యం ఏమిటో అర్ధం కాదు. బలహీన పాత్ర చిత్రణ అసహనాన్ని కలిగిస్తుంది. ఇంటర్వల్‌ ముందు సరైన ముడి పడకపొవడం, తర్వాత ఆ ముడి విప్పే దిశగా కథ నడవక పోవడం ప్రధాన లోపం. సెంటిమెంట్‌, యాక్షన్‌ కలిపి కాక్‌టెయిల్‌గా చేద్దామనుకున్న ఈ చిత్రంలో అవి సరిగా బ్యాలెన్స్‌ కాలేదు. ఇంటర్వెల్‌ కు ముందు హీరోని ఛీకొట్టిన కె. విశ్వనాథ్‌, పవన్‌ మల్హోత్రా పాత్రలు తిరిగి ఎలా రియలైజ్‌ అయ్యారో చూపకపోవడంతో ఆ సీన్లు విచిత్రంగా ఉన్నాయి. ఫోటోగ్రఫీ, పాటలు ఫర్వాలేదు. ఎడిటింగ్‌ చాలా బాగుంది. ఏది ఏమైనా సినిమా విజయానికి ప్రాణంగా ఉండే ఇంటర్వెల్‌ తర్వాత సన్నివేశాల్లో స్పష్టం కాకపోవడంతో ఆంధ్రుడు ఆరంభశూరుడిగా మిగులుతాడు.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X