twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆండ్రాయిడ్ కట్టప్ప మూవీ రివ్యూ.. మనిషి Vs మరమనిషి భావోద్వేగ కథ

    |

    Rating:
    2.5/5
    Star Cast: సౌబిన్ సాహిర్, సూరజ్ వెంజరాముడు, కెండీ జైర్డో, సూరజ్ థైలక్కడు, మాల పార్వతి
    Director: రాతీష్ బాలకృష్ణన్ పొడువల్

    లాక్‌డౌన్ కాలంలో అన్ని సినిమా పరిశ్రమలు స్తంభించిపోతే.. కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలో భారీగా సందడి కనిపించింది. ట్రాన్స్, C U soon లాంటి చిత్రాలు ఓటీటీ ద్వారా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. తాజాగా మలయాళంలో మంచి ఆదరణను చూరగొన్న అండ్రాయిడ్ కుంజప్పన్ అనే చిత్రాన్ని అండ్రాయిడ్ కట్టప్పగా అనువదించి ఆహా యాప్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాలను తెలుసుకోవాల్సిందే...

    అండ్రాయిడ్ కటప్ప కథ

    అండ్రాయిడ్ కటప్ప కథ

    కమ్యుూనిస్టు భావాలు, అగ్ర కులం ఉండే చాంధస భావాలున్న భాస్కరరావు (సూరజ్ వెంజరామూడు) భార్య చనిపోవడంతో వృద్ధాప్యాన్ని ఒంటరిగా కొనసాగిస్తుంటాడు. తనకు తోడుగా సుబ్రమణ్యం (సౌబిన్ షాహిర్) అనే ఇంజినీరింగ్ చదివిన కొడుకు ఉంటాడు. తన కెరీర్ కోసం విదేశాలకు వెళ్లే క్రమంలో తండ్రి కోసం ఆయాను ఏర్పాటు చేసి రష్యాకు వెళ్లిపోతాడు. తండ్రి చాదస్తాన్ని తట్టుకోలేని ఆయాలు పనిమానేసి వెళ్లిపోతారు. ఈ క్రమంలో రష్యా నుంచి తండ్రి కోసం కట్టప్ప అనే రోబోను తీసుకొస్తారు.

    అండ్రాయిడ్ కటప్పలో ట్విస్టులు

    అండ్రాయిడ్ కటప్పలో ట్విస్టులు

    రోబో కట్టప్పతో భాస్కరరావు జీవన ప్రయాణం ఎలా సాగింది? భాస్కరరావు చాదస్తాన్ని రోబో భరించిందా? రోబో కట్టప్ప‌తో విడదీయలేని బంధం భాస్కరరావుకు ఎలా ఏర్పడింది? భాస్కరరావు నుంచి రోబో కట్టప్పను కుమారుడు సుబ్రమణ్యం ఎందుకు విడదీయాలని చూశాడు? రోబో‌ను విడిచిపెట్టలేని పరిస్థితి భాస్కరరావుకు ఎలా కలిగింది అనే ప్రశ్నలకు సమాధానమే అండ్రాయిడ్ కట్టప్ప వెర్షన్ 2.25 సినిమా కథ.

    అండ్రాయిడ్ కటప్ప అనాలిసిస్

    అండ్రాయిడ్ కటప్ప అనాలిసిస్

    సమాజంలో వృద్ధుల జీవితాలకు సంబంధించి చివరి అంకంలో ఎలాంటి బాధలు పడుతారు. భార్య, పిల్లలు దూరమైతే ఒంటరితనం ఎలా బాధిస్తుందనే అంశంపై ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి ఓ భావోద్వేగమైన పాయింట్‌కు మానవ సంబంధాలు, బంధాలను జోడించి దర్శకుడు రాతీష్ బాలకృష్ణన్ అద్భుతంగా తెరకెక్కించారు. మనుషులను ప్రేమించలేని ఓ వ్యక్తి.. ఎలాంటి ఎమోషన్స్‌లోని రోబోను ప్రాణం కంటే మిన్నగా ఎలా చూసుకోగలిగాడు అనేది ఈ సినిమాలో ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ చిత్ర ప్రథమార్థంలో భాస్కరరావు భావాలు, అలవాట్లు, ప్రవర్తన తీరు చికాకు పెట్టే విధంగా దర్శకుడు రూపొందించారు. అయితే ద్వితీయార్థంలో అలాంటి మనిషిలో కూడా గొప్పగా ప్రేమించే హృదయం ఉంటుంది అనే పాయింట్‌ టచ్ చేయడం కథ మరో లెవెల్‌కు వెళ్తుంది.

    అండ్రాయిడ్ కటప్ప‌లో బలమైన అంశాలు

    అండ్రాయిడ్ కటప్ప‌లో బలమైన అంశాలు


    ద్వితీయార్థంలో రోబో చుట్టు దర్శకుడు రాతీష్ బాలకృష్ణన్ కథను అల్లుకొన్న తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. ప్రథమార్థంలో నత్త నడకన సాగినట్టు కనిపించిన ఈ చిత్ర కథ.. సెకండాఫ్‌ వరకు వచ్చే సరికి ఎమోషనల్ పరంగా వేగం పెరుగుతుంది. కథలో లీనమయ్యే అంశాలు ఉండటంతో ప్రేక్షకుడిలో ఓ ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ మొదలవుతుంది. ఇక క్లైమాక్స్‌లోని సన్నివేశాలు ప్రేక్షకుడిని హృదయాన్ని తాకేలా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సినిమా ఆరంభంలో కట్టప్పకు పిండాలు పెట్టే సీన్‌, క్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాలు హృదయాన్ని టచ్ చేస్తాయి. తండ్రి కొడుకుల సంబంధాలు, భాస్కరరావు యవ్వనంలోని ప్రేమ కథ కూడా ఫీల్‌గుడ్‌గా సాగుతుంది.

    భాస్కరరావు పాత్రలో సూరజ్

    భాస్కరరావు పాత్రలో సూరజ్

    వృద్దుడు భాస్కరరావు పాత్రలో సూరజ్ వెంజరామూడు ఒదిగిపోయాడు. మాటల్లో చెప్పలేని ఓ భావోద్వేగ నటనను ప్రదర్శించడంలో సఫలమయ్యాడు. పలు వేరియేషన్ల ఉండే పాత్రను తన నటనతో చాలా సులభంగా పండించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక కుమారుడు పాత్రలో మలయాళ నటుడు సౌబిన్ నటించారు. రోబో టెక్నాలజీలో నిపుణుడైన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా నటించాడు. తండ్రి కోసం మదనపడే ఓ కొడుకుగా తన నటనతో ఆకట్టుకొన్నాడు. తండ్రి పాత్రతో ముడిపడి ఉన్న కొన్ని సీన్లలో అద్భుతంగా నటించారు.

     మిగితా పాత్రల్లో నటీనటులు

    మిగితా పాత్రల్లో నటీనటులు

    రోబో పాత్రగా సూరజ్ తెలక్కడు నటించాడు. రోబోను మరిపించే విధంగా ఆ పాత్రలో ఆకట్టుకొన్నాడు. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ రోబో పాత్రనే. ప్రేక్షకుడిని ఆసాంతం ఆకట్టుకోవడం ఖాయం. రష్యాలో సుబ్రమణ్యం ప్రేయసిగా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన నటి కెండీ జిర్డో నటించారు. ఈ చిత్రంలో కెండీ జిర్డో చైనా యువతి హిటోమి అనే పాత్రలో కనిపించారు. తండ్రి ఆంధ్రవాసి, తల్లి చైనా దేశస్థులు పుట్టిన యువతి పాత్రలో ఆకట్టుకొన్నారు. కథలో వెసులబాటు కోసం ఆ పాత్రతో తెలుగులో మాట్లాడించడం కూడా యాప్ట్‌గా అనిపిస్తుంది. మిగితా పాత్రలు కూడా ఆకట్టుకొనేలా ఉంటాయి.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. ఎమోషనల్‌ కథ, సినిమా బ్యాక్‌డ్రాప్‌కు తగినట్టుగా అత్యంత సహజమైన వాతావరణంలో సన్నివేశాలను సానూ వర్గీస్ తన కెమెరాల బంధించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి ఓ ప్రధాన ఆకర్షణ. బిజిబల్ అందించిన సంగీతం కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోసింది. రష్యాలో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి.

    Recommended Video

    బాహుబలి ఆదేశించాడు.. కట్టప్ప పాటించాడు..!
    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    అండ్రాయిడ్ కట్టప్ప సినిమా విషయానికి వస్తే.. ఎలాంటి హంగులు, ఆర్బాటాలు కనిపించకుండా.. కేవలం మానవ బంధాలు, సంబంధాలు ప్రతిబింబించే చిత్రమని చెప్పవచ్చు. ప్రేమించడానికి ప్రాణం ఉన్న మనిషి అవసరం లేదు.. హృదయానికి హత్తుకోవడానికి ప్రేమించే మర మనిషి అయినా పర్వాలేదనే ప్రధానమైన పాయింట్‌తో కథ సాగుతుంది. టెక్నాలజీ యుగంలో రోబోలతో జీవితం ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని ముందు చూపుతో దర్శకుడు చూపించాడు. తెలుగు నేటివిటి కొరత, పరిచయం లేని నటీనటుల విషయం కొంత ప్రతికూలంగా మారినా కథ వాటిని సరిద్దిద్దిందనే చెప్పవచ్చు. ఇక ఎమోషనల్, కుటుంబ కథా చిత్రాలను ఆదరించే వారికి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.

    English summary
    Android Kattappa Version 5.25 movie review and rating: Android Kattappa Version 5.25 movie is highly appreciated in malayalam language. This movie dubbed as Android Kattappa in Telugu which is directed by Ratheesh Balakrishnan. Suraj Venjaramoodu, Soubin Shahir, Kendy Zirdo, Sooraj Thelakkadu are the lead actors. This movie released on Aha on october 09th
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X