twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏంజెల్ మూవీ రివ్యూ: ఒకవైపు స్వర్గం.. మరో వైపు నరకం

    స్వర్గం నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య కథతో నవంబర్ 3న విడుదలైన ఏంజెల్ చిత్రం ఏ విధంగా మెప్పించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    By Rajababu
    |

    Rating:
    1.0/5
    Star Cast: నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సప్తగిరి, కబీర్, ప్రదీప్ రావత్
    Director: ‘బాహుబలి' పళని

    ఇటీవల కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకొంటున్న యువ తార హెబ్బా పటేల్, యువ హీరో నాగ అన్వేష్ నటించిన చిత్రం ఏంజెల్. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద డైరక్షన్ డిపార్ట్‌మెంట్‌లో శిక్షణ పొందిన పళని ఈ చిత్రానికి డైరక్టర్. గతంలో స్వర్గం నుంచి వచ్చిన దేవకన్య కథలకు ఏమాత్రం తీసిపోకుండా లేటెస్ట్‌గా వండిన స్టోరీతో ఏంజెల్ రూపొందింది. భారీ బడ్జెట్, కంప్యూటర్స్ గ్రాఫిక్స్ కోసం ఎక్కువగానే ప్రచారం జరిగింది. స్వర్గం నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య కథతో నవంబర్ 3న విడుదలైన ఏంజెల్ చిత్రం ఏ విధంగా మెప్పించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    Recommended Video

    పట్టించుకోవడమే మానేశా.. అందుకే దూరం..
    ఏంజెల్ కథ

    ఏంజెల్ కథ

    నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం జరుపుతున్న తవ్వకాల్లో ఓ అరుదైన పురాతన విగ్రహం దొరుకుతుంది. ఇంటర్నేషనల్ మాఫియాతో కుమ్మక్కైన స్థానిక కాంట్రాక్టర్లు భారీ రేటుకు అమ్ముతారు. దానిని తరలించే బాధ్యతను నానీ (నాగ అన్వేష్), గిరి (సప్తగిరి)కి అప్పగిస్తారు. హైదరాబాద్‌కు తరలిస్తున్న సమయంలో ఆ విగ్రహం కాస్త దేవకన్య నక్షత్ర (హెబ్బా పటేల్)గా మారుతుంది. గంధర్వలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాననే విషయం నానీకి నక్షత్ర వివరిస్తుంది. కానీ నానీకి నమ్మకం కుదురదు. కానీ అలా వారి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో విగ్రహాల అక్రమ రవాణా ముఠా విగ్రహం కోసం నానీ, గిరిలను నానా రకాలుగా హింస పెడుతుంటుంది.

    ముగింపు

    ముగింపు

    అయితే గోదావరి జిల్లాలో అచ్చు నందు అనే అమ్మాయి నక్షత్రను పోలీ ఉండటం కథలో ట్విస్ట్‌గా మారుతుంది. ఈ క్రమంలో విగ్రహాల అక్రమ రవాణా ముఠా విగ్రహం కోసం నానీ, గిరిలను నానా రకాలుగా హింస పెడుతుంటుంది. నందు, నక్షత్ర ఒకటేనా? దేవలోకం నుంచి మానవలోకానికి నక్షత్ర ఎందుకు వచ్చింది. నక్షత్ర ప్రేమను నానీ పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఏంజెల్.

    ఏంజెల్ తొలిభాగం

    ఏంజెల్ తొలిభాగం

    అమరావతిలో దొరికిన విగ్రహాన్ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా అది దేవకన్యగా మారడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ కథ సామాన్య ప్రేక్షకుడిని కూడా కన్విన్స్ చేసే విధంగా ఆరంభం కాకపోవడం ప్రధానమైన లోపంగా మారింది. తొలి భాగంలోనే అనేక ట్విస్టులతో కథ చాలా చికాకుగా ఉంటుంది. నక్షత్రను పోలిన నందు ఉండటం అనే పాయింట్ వద్ద ఇంటర్వెల్ టైటిల్ పడుతుంది.

    రెండో భాగం

    రెండో భాగం

    ఇక రెండో భాగంలో నందు ఫ్యాష్‌బాక్ కథకు రైతుల అంశం జోడించినా ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా లేకపోవడం మరో మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక చివర్లో దెయ్యం, గొలుసు ఎపిసోడ్‌లు నాసిరకంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఈ చిత్ర కథనంలో 80, 90 దశకాలలో వచ్చిన సినిమాల్లో కూడా కనిపించదు. ఏ సన్నివేశంలోనూ ఎక్కడా సహజత్వమే కనిపించదు. అంతా ఆర్టిఫిషియల్‌గానే ఉండి చికాకు పెడుతుంటాయి. వెరసి ఈ చిత్రం కనీస సినిమా ప్రమాణాలకు దగ్గరగా లేదనే అభిప్రాయం కలుగడం చాలా సహజమైన పాయింట్.

    దర్శకుడి పనితీరు

    దర్శకుడి పనితీరు

    దర్శకుడు రాజమౌళి కాంపౌండ్ నుంచి డైరెక్టర్ పళని వచ్చాడంటే ప్రేక్షకుడికి ఓ స్థాయి అంచనా ఉండటం సహజం. ఈ జనరేషన్‌కు ఎక్కడా సరితూగని కథను ఎంపిక చేసుకోవడం దారుణమైన విషయం. ఇంకా దర్శకుడు 90 దశకాల్లోనే ఉన్నాడనే భావన కలుగుతుంది. ఏంజెల్ విషయానికి వస్తే సోషియో ఫాంటసీ కథలో కనీస నటీనటుల ఎంపిక కూడా నాసిరకంగా ఉండటం మరో ప్రధానమైన లోపం. ఏ ఒక్క విభాగంలో కూడా దర్శకుడు పళని తన మార్కును ప్రదర్శించలేకపోయాడనే చెప్పవచ్చు.

    ఏంజెల్‌గా హెబ్బా పటేల్

    ఏంజెల్‌గా హెబ్బా పటేల్

    ఏంజెల్ అనే టైటిల్ అనగానే హీరోయిన్ ఓ స్థాయిలో ఉండాలనే కనీస ప్రయత్నం కూడా కనిపించదు. తెర మీద శ్రీదేవి లాంటి దేవకన్యను చూసిన ప్రేక్షకుడికి హెబ్బా పటేల్‌ ఎక్కడా సరితూగదు. దేవకన్యగా హెబ్బా పటేల్‌ను ఊహించుకోవడం చాలా కష్టమైన పనిగా మారిందని చెప్పవచ్చు.

    హీరోగా నాగ అన్వేష్

    హీరోగా నాగ అన్వేష్

    నానీగా పాత్రలో కనిపించిన నాగ అన్వేష్ తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. సినీ పరిశ్రమకు కొత్త వాడైనా మెరుగైన నటనతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సినిమాలో తప్పుపట్టడానికి ఏ మాత్రం అవకాశం లేదు.

    చెలరేగిన సప్తగిరి

    చెలరేగిన సప్తగిరి

    సప్తగిరి తనదైన హాస్యంతో చెలరేగిపోయాడు. కొన్నిసార్లు హద్దులు మీరి ఓవరాక్షన్ కూడా చేశాడు. ఈ సినిమాలో నాగ అన్వేష్ కంటే సప్తగిరియే హీరో అనిపించేంతగా ఇరుగదీశాడు. కానీ కొన్ని సన్నివేశాల్లో పండించిన హాస్యం అపహాస్యంగా మారింది. ఉన్నంతలో ఏంజెల్‌ సినిమాను నిలబెట్టేందుకు సర్వ విధాల కృషి చేశాడు.

    పేలవంగా విలనిజం

    పేలవంగా విలనిజం

    విగ్రహాల అక్రమ వ్యాపారిగా షియాజీ షిండే, రైతులను వడ్డీతో పీడించే వ్యాపారిగా ప్రదీప్ రావత్, దేవలోకం నుంచి ఏంజెల్‌ను తీసుకువెళ్లడానికి వచ్చిన గరుడగా కబీర్ పాత్రల్లో పరిణితి కూడిన నటన కనిపించదు. రోటిన్ స్టఫ్‌తో ప్రేక్షకులను విసిగించారు.

    నాసిరకంగా మ్యూజిక్‌

    నాసిరకంగా మ్యూజిక్‌

    ఏంజెల్ అనే టైటిల్ అంటే ఓ మంచి ఫీలింగ్ కలుగుతుంది. అందుకు తగినట్టుగా ఈ చిత్రంలో సంగీతం ఉంటుందనుకొంటే పొరపాటే. భీమ్స్ సిసిరోలియో పాటలు గానీ, రీరికార్డింగ్‌ గానీ ఎక్కడా కూడా ఆకట్టుకునే విధంగా లేవు.

    సాంకేతిక విభాగం

    సాంకేతిక విభాగం

    ఎడిటింగ్ విభాగంలో చోట కే ప్రసాద్ పర్వాలేదనిపిస్తారు. దేవలోకం, ఇతర సన్నివేశాల్లో కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ పనితీరు ఆకట్టుకునేలా ఉంది.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    సప్తగిరి కామెడీ

    మైనస్ పాయింట్స్
    హీరో, హీరోయిన్లు
    కథ, కథనం
    డైరెక్షన్

    నటీనటులు

    నటీనటులు

    నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సప్తగిరి, కబీర్, ప్రదీప్ రావత్, షియాజి షిండే, ప్రభాస్ శీను, తాగుబోతు రమేశ్ తదితరులు
    దర్శకత్వం : ‘బాహుబలి' పళని
    నిర్మాత : యోగీశ్వర్‌రెడ్డి
    సంగీతం : భీమ్స్ సిసిరోలియో
    విడుదల తేదీ : నవంబర్ 3, 2017

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఎలాంటి ప్రత్యేకతలు లేని సినిమా ఏంజెల్. కొత్త సీసాలో పాత సారా లాంటి ప్రయోగం. ప్రేక్షకుడికి ఎలాంటి కిక్కు, టేస్ట్ ఇవ్వని చేసిన వంటకం లాంటిది ఈ చిత్రం. స్వర్గంలోని దేవకన్య మోజులో పడితే రెండుగంటలపాటు నరకం చూడాల్సిందే.

    English summary
    Actor Hebba Patel's latest movie is Angel. Young hero Naga Anvesh acted in lead role. comedian Saptagiri is the backbone for the movie. This movie is released on November 3rd. In this occassion, Telugu Filmibeat brings the exclusive review for the readers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X