Anger Tales Review భావోద్వేగాల నేపథ్యంగా.. నిర్మాతగా సుహాస్ సక్సెస్ అయ్యాడా?
Rating: 2/5
నటీనటులు: వెంకటేష్ మహా, సుహాస్, బిందు మాధవి, రవీంద్ర విజయ్, తరుణ్ భాస్కర్, మడొన్నా సెబాస్టియన్, సుధ, ఫణీ ఆచార్య తదితరులు
రచన, దర్శకత్వం: ప్రభాల తిలక్
మ్యూజిక్: స్మరణ్ సాయి
నిర్మాతలు: శ్రీధర్ రెడ్డి, సుహాస్
వెబ్ సిరీస్ ఎపిసోడ్స్: 4
ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-03-09

ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ
అగ్ర నటుడి అభిమాని రంగా (వెంకటేష్ మహా) తన హీరో కోసం ఎంతవరకైనా వెళ్లే యువకుడు. తన అభిమాన హీరో సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ షో ప్రీమియర్ వేస్తాడు. అధిక ధరకు టికెట్లను అమ్ముతాడు. అయితే తన హీరోను వ్యతిరేకించే పచ్చబొట్టు శ్రీను (సుహాస్)తో వైరుధ్యం ఉంటుంది. రంగా ఏర్పాటు చేసిన షోకు సంబంధించిన 200 టికెట్లను కొనుగోలు చేస్తాడు. అయితే షో అనుకొన్న సమయం కంటే ఆలస్యంగా ప్రీమియర్‌ను ప్రదర్శిస్తారు. ఫ్లాఫ్ టాక్ రావడం వల్లే సినిమాను ఆలస్యంగా వేశారని పచ్చబొట్టు శ్రీను ఆరోపిస్తాడు. అయితే సినిమా హిట్.. హిట్ కాకపోతే నీవు ఏది చెప్పినా నేను అది చేస్తాను అంటూ రంగా సవాల్ విసురుతాడు. అయితే రంగా చేసిన తర్వాత ఏం జరిగింది? పచ్చబొట్టు శ్రీను మాట నిజమైందా? రంగాకు శ్రీను విధించిన శిక్ష ఏమిటి? అనేది ఈ ఎపిసోడ్‌కు ముగింపు.

రెండో ఎపిసోడ్ రివ్యూ:
పూజా రెడ్డి (మడొన్నా సెబాస్టియన్), శాఖహారి భర్త (తరుణ్ భాస్కర్)తో అసంతృప్తిగా ఉంటుంది. తనకు నాన్ వెజ్ తినడమనే కోరికను బలవంతంగా అణుచుకొని జీవిస్తుంటుంది. ఈ క్రమంలో పూజాకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దాంతో నాన్ వెజ్ తినాలని డాక్టర్ సలహా ఇస్తాడు. అయితే వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తినాలనే రూల్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉండటం వల్ల.. ఎగ్స్ తెచ్చుకొని భర్త, అత్తకు, గేటెడ్ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌కు తెలియకుండా దొంగచాటుగా తింటుంది. అయితే క్యాంపస్‌లో నిబంధనలకు విరుద్ధంగా నాన్ వెజ్ తింటున్నారనే విషయం బయటకు పొక్కడంతో పూజాను భర్త నిలదీస్తాడు. ఆ తర్వాత పూజా నాన్ వెజ్ తినడం విషయంపై ఎలా స్పందించింది? భర్తను పూజా ఎదురించిందా? గెటెడ్ కమ్యూనిటీలో పూజా విషయంలో ఏం జరిగిందనేది ఈ ఎపిసోడ్ ముగింపు.

మూడో ఎపిసోడ్ రివ్యూ
రాధా (బిందు మాధవి), భర్త (రవీంద్ర విజయ్)తో మధ్య తరగతి జీవితాన్ని కొనసాగిస్తుంటుంది. అయితే తన ఇరుగుపొరుగు అమ్మలక్కలతో వేధింపులకు గురవుతుంది. అమ్మలక్కలు మధ్యాహ్నం వేళ అరుగులపై మీటింగులు పెట్టుకొని అరవడం వల్ల నిద్రకు డిస్ట్రబ్ కలుగుతుంది. దాంతో ఇరుగుపొరుగు వారితో గొడవ పెట్టుకొంటుంది. అద్దె ఇళ్లు కావడంతో ఓనర్ ఖాళీ చేయమని వార్నింగ్ ఇస్తారు. దాంతో రాధ దంపతుల మధ్య విబేధాలు నెలకొంటాయి. అయితే భార్య ప్రవర్తన వల్ల భర్త ఎలాంటి సమస్యలకు గురయ్యాడు? రాధ తన సమస్యను ఎలా పరిష్కరించుకొన్నదనే ప్రశ్నలకు సమాధానం ఈ ఎపిసోడ్ ముగింపు.

నాలుగో ఎపిసోడ్ రివూ
పేదరికంతో బాధపడే తల్లి (సుధ) తన కొడుకు గిరిధర్ (ఫణీ ఆచార్య) వయసు మీద పడుతున్నప్పటీకి.. బట్టతల కారణంగా పెళ్లి కాకపోవడం ఓ సమస్యగా మారుతుంది. అయితే గిరిధర్‌కు ఉద్యోగ పరమైన సమస్యలు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో ఉండే సమస్యల కారణంగా ఉద్యోగాన్ని కూడా సరిగా చేయలేకపోతాడు. దాంతో తాను పనిచేసే కంపెనీలో ఉద్యోగం పోతుంది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వచ్చిన బట్టతల కారణంగా పెళ్లి కాకపోవడం, తన పెళ్లికాకపోవడానికి ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరి చేయడమే కారణమని సర్కారుపై కేసు నమోదు చేస్తాడు.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ గురించి
నటీనటుల విషయానికి వస్తే.. వెంకటేష్ మహా, సుహాస్ ఎపిసోడ్ గ్రిప్పింగ్ ఉంటుంది. వారిద్దరికి ఫెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ దక్కడంతో వారిద్దరూ తమదైన శైలిలో ఆ స్పేస్‌ను ఉపయోగించుకొన్నారు. ఇక తరుణ్ భాస్కర్, మడొన్నా ఎపిసోడ్‌కు ఎమోషన్స్ ఉండాల్సింది. కానీ ఆ ఎమోషన్స్ పండకపోవడం.. రీజన్ సిల్లీగా ఉండటం వల్ల ఆడియెన్స్ కనెక్ట్ కాకపోవడానికి అవకాశం ఉంది. వారిద్దరూ కూడా తమ పాత్రలతో ఆడియెన్స్ మీద ఇంపాక్ట్ చూపించడానికి స్కోప్ లేకపోయింది. బిందు మాధవి ఎపిసోడ్‌ది, అలాగే సుధ, ఫణి ఎపిసోడ్‌ది కూడా భావోద్వేగాలు లోపించడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని చెప్పవచ్చు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి ఈ వెబ్ సిరీస్‌కు స్ట్రెంగ్త్‌గా నిలిచింది. కథలకు అనువుగా ఉండే బ్యాక్ డ్రాప్‌ను బాగా ఎలివేట్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అలాగే కొన్ని సీన్లను మ్యూజిక్ బాగా హైలెట్ చేసింది. మిగితా విభాగాల నిపుణులు తమ పరిధిలో ఒకే అనిపించారు.

ఫైనల్‌గా యాంగర్ టేల్స్ ఎలా ఉందంటే?
మనుషులు, మనస్తత్వాలు అనే బేసిక్ కాన్సెప్ట్‌తో యాంగర్ టేల్స్ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. అయితే ప్రతీ ఎపిసోడ్స్‌లోను సరైన ముగింపు లేకపోవడం ప్రేక్షకులకు నిరాశపరిచే అంశం. సరైన కంటెంట్ లేకుండా చేసిన అంథాలజీ అనిపిస్తుంది. ప్రభాల తిలక్ ఐడియా బాగుంది. కానీ సరైన కంటెంట్ రాసుకోవడంలో విఫలమయ్యాడు. సుహాస్, శ్రీధర్ రెడ్డి అనుసరించిన మేకింగ్ వ్యాల్యూస్ బాగున్నాయి. డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఫ్రీ టైమ్‌లో సమయం చిక్కినప్పుడల్లా.. అవకాశాన్ని బట్టి చూసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











