Animal Review రణ్‌బీర్ విశ్వరూపం.. సందీప్ రెడ్డి టేకింగ్ ఓ అరాచకం.. యానిమల్ సమీక్ష!

Rating: 3.5/5

నటీనటులు: రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్, మాగంటి శ్రీనాథ్ తదితరులు
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ
స్క్రీన్ ప్లే: సందీప్ రెడ్డి వంగ, ప్రణయ్ రెడ్డి వంగ, సౌరబ్ గుప్తా
నిర్మాతలు: భూషణ్ కుమార్, మురాద్ ఖేతానీ, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ
సినిమాటోగ్రఫి: అమిత్ రాయ్
ఎడిటింగ్: సందీప్ రెడ్డి వంగ
మ్యూజిక్: విశాల్ మిశ్రా, జానీ, జామ్‌8 (పాటలు), హర్షవర్దన్, రామేశ్వర్ (బీజీఎం)
బ్యానర్: టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సీనీ 1 స్టూడియోస్
నిడివి: 201 నిమిషాలు
రిలీజ్ డేట్: 2023-12-01

దేశంలోనే అతిపెద్ద కంపెనీ స్వస్తిక్ ఇండస్ట్రీస్ అధినేత బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) బిజినెస్ పనుల్లో బిజీగా ఉండటం కొడుకు రణ్ విజయ్‌ (రణ్‌బీర్ కపూర్)కు అసలు నచ్చదు. కానీ తండ్రి, చెల్లెల్లు అంటే పంచప్రాణాలు. తన కుటుంబానికి చీమ కూడా హాని తలపెట్టకూడదని భావిస్తుంటాడు. తనను పట్టించుకోవడం లేదనే కోపంతో తండ్రిని విభేదించినా ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే తన చిన్న నాటి స్నేహితురాలు గీతాంజలి (రష్మిక మందన)ను ప్రేమించి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొని అమెరికాలో నివసిస్తుంటాడు. అలాంటి సమయంలో తండ్రిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఆరేళ్ల తర్వాత తండ్రిని చూసేందుకు ఇండియాకు వస్తాడు.

తండ్రి బల్బీర్ సింగ్‌పై ఎవరు కాల్పులు జరిపారు? బల్బీర్ సింగ్‌తో అస్రార్ హక్ (బబ్లూ పృథ్వీరాజ్), అబ్రార్ హక్‌ (బాబీ డియోల్)కు ఎందుకు విభేదాలు ఏర్పడ్డాయి? భార్య గీతాంజలిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే విజయ్.. జోయా(తృప్తి డిమ్రీ)తో శారీరకంగా ఎందుకు దగ్గరయ్యాడు? జోయా అఫైర్ తర్వాత గీతాంజలి రియాక్షన్ ఏమిటి? తన రూపంలో ఉండే ఓ మనిషిని తయారు చేసి తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనే అబ్రార్ ప్లాన్‌ తెలిసి విజయ్ ఏం చేశాడు? తండ్రిపై ప్రేమతో క్రిమినల్‌గా మారిన విజయ్‌ను గీతాంజలి క్షమించిందా? బల్బీర్ సింగ్, అబ్రార్ హక్ ఫ్యామిలీ మధ్య ఫ్యాక్షన్ గొడవలకు తెరపడిందా? అనే ప్రశ్నలకు సమాధానమే యానిమల్ సినిమా కథ.

Animal Review and Rating: Sandeep Reddy Vanga brilliance, Ranbir Kapoor Master class performance

అర్జున్ రెడ్డితో ప్రేక్షకుల మనసు గెలుచుకొన్న సందీప్ రెడ్డి వంగ.. యానిమల్ మూవీ కోసం రాసుకొన్న కథ అతి పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. స్క్రిప్టులో రాసుకొన్న క్యారెక్టర్లు.. ఆ పాత్రల మధ్య ఇంటారక్షన్ చూస్తే మైండ్ బ్రో కావడం గ్యారంటీ. ఊహకు అందని విధంగా ఫ్యాక్షన్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలో దట్టించిన తీరు చూస్తే.. ప్రతీ సీన్ ఆశ్చర్య పరచడం అనే మాట పక్కన పెడితే.. అబ్బుర పరిచిందనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌ను శ్రద్దగా, చాలా నిజాయితీగా తీర్చి దిద్దిన తీరు సందీప్ రెడ్డి ప్రతిభ అని చెప్పడం కంటే.. సినిమాపై ఉండే తపన, ప్యాషన్ ఏంటో తెలుస్తుంది. సుమారు మూడున్నర గంటల సినిమాలో ఏ సీన్‌ను వంక పెట్టకుండా అద్బుతంగా కథ చెప్పిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సందీప్ రెడ్డి వంగ మేకింగ్ ఇలా మాటల్లో చెప్పడం కష్టం. ఆ టాలెంట్‌ను తెర మీద చూడాల్సిందే.

యానిమల్ సినిమాలో ఫస్టాఫ్ కంటెంట్ విషయానికి వస్తే.. స్కూల్ ఎపిసోడ్, అలాగే చెల్లెల్ని ర్యాగింగ్ చేస్తే విజయ్ స్పందించే తీరు సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. ఇంటర్వెల్‌కు ముందు దాదాపు 20 నిమిషాల పాటు సాగే సుదీర్ఘమైన యాక్షన్ సీక్వెన్స్ దిమ్మతిరిగిపోయేలా ఉంటుంది. అలాగే ఫస్టాఫ్‌లో రష్మికతో రణ్‌బీర్ రొమాంటిక్ సీన్లు, శృంగార సన్నివేశాలు చూస్తే తట్టుకోవడం చాలా కష్టం. తండ్రి, కొడుకుల మధ్య సన్నివేశాలు, బబ్బూ పృథ్వీరాజ్‌తో ఉండే సీన్లు సినిమాకు బలంగా మారాయి.

Animal Review and Rating: Sandeep Reddy Vanga brilliance, Ranbir Kapoor Master class performance

ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే.. బుల్లెట్ గాయాలతో నిర్వీర్యమైన దేహంతో రణ్‌బీర్‌ చేసిన ఫెర్ఫార్మెన్స్ అదుర్స్ అనేలా ఉంటుంది. ఇక జోయాతో రొమాన్స్ కారణంగా గీతాంజలి, విజయ్ మధ్య ఉండే కాన్‌ఫ్లిక్ట్ అదిరిపోయేలా ఉంది. గీతాంజలి, విజయ్ మధ్య వచ్చే సీన్లు చాలా మెచ్యుర్డ్‌గా, ఇప్పటి వరకు ఇండియన్ సినిమా స్క్రీన్‌పై చూడని విధంగా ఉంటాయి. ఇక బాబీ డియోల్‌లో క్లైమాక్స్ ఫైట్ సినిమాకు మరో హైలెట్. చివర్లో తండ్రి బల్బీర్ సింగ్, విజయ్ మధ్య సీన్లు ఎమోషనల్‌గా ఉండటమే కాకుండా కంటతడి పెట్టించేలా, హృదయాన్ని భారంగా మలిచేలా ఉంటాయి.

నటీనటులు విషయానికి వస్తే.. రణ్‌బీర్ కపూర్ విశ్వరూపం చూపించారనే చెప్పాలి. రకరకాల గెటప్స్‌తో విభిన్నం, విలక్షణమైన నటనతో సినిమా భారాన్నంత తన భుజాలపై మోశాడు. రష్మిక మందన చేసిన గీతాంజలి పాత్ర చాలా బాగుంది. ఆ పాత్రలో రష్మిక పరకాయ ప్రవేశం చేసిందనే చెప్పాలి. అనిల్ కపూర్, బాబీ డియోల్, బబ్లూ పృథ్వీరాజ్, సౌరబ్ సచ్‌దేవ్, సురేష్ ఒబేరాయ్, తెలుగు నటుడు మాగంటి శ్రీనాథ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. బబ్లూ పృథ్వీ, మాగంటి శ్రీనాథ్‌కు ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కనిపించారు జోయగా తృప్తి డిమ్రీ ఉన్నంత సేపు గ్లామర్‌తో రపరపాలాడించింది. చిత్రంలో కనిపించిన ప్రతీ నటుడు తమ మార్కును వదిలి వెళ్లారనిపిస్తుంది.

ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. యాక్షన్, ఎమోషన్ సీన్లకు ఆయన అందించిన మ్యూజిక్ సూపర్బ్ అని చెప్పవచ్చు. ఎడిటర్‌గా సందీప్ రెడ్డి వంగ సీన్లను పేర్చిన విధానంగా అద్బుతంగా ఉంటుంది. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టించని విధంగా సినిమాను పరుగులు పెట్టించాడు. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫి ఫెంటాస్టిక్. పాటల్లో తెలుగుదనం లేకపోవడం మైనస్‌గా అనిపిస్తుంది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అందించిన నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా ఉన్నాయి

Animal Review and Rating: Sandeep Reddy Vanga brilliance, Ranbir Kapoor Master class performance

ఫాదర్, సన్ రిలేషన్స్, భార్యభర్తల ప్రేమానురాగాలు, బ్రదర్ సిస్టర్ ఎమోషన్స్ నేపథ్యంగా యాక్షన్, ఫ్యాక్షన్ కలబోసి వదిలిన బుల్లెట్ యానిమల్. అన్ని రకాల భావోద్వేగాలు ప్రేక్షకుడిని కుదిపేసేలా ఉంటాయి. నిర్మాణ పరంగా అత్యుత్తమ విలువలు, ఎక్కడా లోపాలు కనిపించిన స్క్రిప్టు ఈ సినిమాకు బలంగా మారాయి. సందీప్ రెడ్డి వంగా ఇమాజినేషన్, క్యారెక్టర్ల మధ్య కెమిస్ట్రీని ఊహించడమే కష్టంగా అనిపిస్తుంది. రణ్ విజయ్ పాత్రను రణ్‌బీర్ కపూర్ తప్ప మరోకరిని ఊహించుకోవడమే కష్టం. రణ్‌బీర్, రష్మిక కెరీర్‌లో ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. సినిమా రంగంలో అరుదుగా వచ్చే స్క్రిప్టుతో వచ్చే సినిమా యానిమల్. మూడు గంటలకుపైగానే కాదు.. 4 గంటలు ఉన్నా ఏ మాత్రం బోర్ కొట్టని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కాకపోతే మితీమిరిన రక్తపాతం, హింస, శృంగారం కొంత ఇబ్బందిపెట్టేలా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే గొప్ప సినిమా చూసిన ఫీలింగ్‌తో థియేటర్ బయటకు రావడం గ్యారంటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X