Jhansi 2 Review: వేశ్యగా అంజలి.. హైలెట్ గా 'ఝాన్సీ' యాక్షన్ సీన్లు.. కానీ, అదొక్కటే మిస్!

రేటింగ్: 2.5/5

టైటిల్: 'ఝాన్సీ' సీజన్ 2
నటీనటులు: అంజలి, చాందినీ చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, రాజ్ అర్జున్, సంయుక్త హోర్నాడ్, చైతన్య సగిరాజు, రుద్ర ప్రతాప్, రామేశ్వరి తాళ్లురి తదితరులు
రచన: గణేష్ కార్తీక్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ప్రొడక్షన్ బ్యానర్: ట్రైబల్ హార్స్ ఎంటర్టైన్ మెంట్స్
నిర్మాతలు: కృష్ణ కులశేఖరన్, కెఎస్. మధుబాల
దర్శకత్వం: తిరు, గణేష్ కార్తీక్
విడుదల తేది: జనవరి 19, 2023
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (ఎపిసోడ్స్ 4)

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అంజలి, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఝాన్సీ. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ అక్టోబర్ 27, 2022 విడుదలై పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు తాజాగా ఝాన్సీ వెబ్ సిరీస్ రెండో సీజన్ ను ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా రిలీజ్ చేశారు.

మొదటి సీజన్ లో ఎక్కువగా కథను రివీల్ చేయకుండా రెండో సీజన్ పై క్యూరియాసిటీ పెంచేలా మొదటి సీజన్ ను ముగించారు దర్శకుడు తిరు. డైరెక్టర్ తిరు 1, 2, 4 ఎపిసోడ్స్ కి దర్శకత్వం వహించగా.. మూడో ఎపిసోడ్ కు తిరుతోపాటు రైటర్ గణేష్ కార్తీక్ కూడా దర్శకత్వం వహించారు. మరి ఈ రెండో సీజన్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ

కథ

గోవాలో ఝాన్సీ (అంజలి), ధ్రువ (చైతన్య సగిరాజు) ఇద్దరిని బిల్లు క్లబ్ నిర్వాహకులు కిడ్నాప్ చేయడంతో మొదటి సీజన్ ముగుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ కథలో బిల్లు క్లబ్ అనే వేశ్య గృహానికి ఝాన్సీ, బార్బీ (చాందినీ చౌదరి)లను అమ్మేయడంతో పూర్తి అవుతుంది. ఇక రెండో సీజన్ ను తన గతం గురించి వేశ్య గృహం నిర్వాహకురాలు చెప్పడంతో ప్రారంభమవుతుంది.

అప్పుడు తన గతం గురించి ఝాన్సీ ఏం తెలుసుకుంది? మహిత (ఝాన్సీ అసలు పేరు) వేశ్య గృహంలోకి అడుగు పెట్టాక మారిన పరిస్థితులు ఏంటీ? మహితకు పుట్టిన కొడుకు ఏమయ్యాడు? మాఫీయా లీడర్ కాలేబ్ కొడుకు ఈథన్ (ఆదిత్య శివ్ పింక్)ను మహిత ఎందుకు చంపాల్సి వచ్చింది? తన బెస్ట్ ఫ్రెండ్ బార్బీకి మహితపై ద్వేషం, శత్రుత్వం ఎలా పుట్టింది? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఝాన్సీ సీజన్ 2 చూడాల్సిందే.

విశ్లేషణ

విశ్లేషణ

ఝాన్సీ, బార్బీ ఇద్దరు బిల్లు క్లబ్ అనే వేశ్య గృహంలో ఎంటర్ అయిన పరిస్థితులు, వారి మానసిక స్థితి ఎలా ఉంది వంటి సన్నివేశాలతో రెండో సీజన్ ప్రారంభమైంది. అయితే రెండో సీజన్ లో రియాలిటీలో జరిగే కథ కన్నా ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీనే ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో గతం మరిచిపోయిన మహితకు, తనతో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఉప కథలతోనే ఎక్కువగా ఉంటుంది.

అంజలిని చూపించిన విధానం తప్పితే కొత్తగా కథ ఎక్కడా కనపించదు. 12 ఏళ్ల వయసులో కిడ్నాప్ కు గురైన ఒక బాలిక పెరిగి పెద్దయ్యాక ఒక వేశ్య గృహానికి అమ్ముడు పోవడం, అక్కడ కూడా మోస పోయి.. పగ తీర్చుకోవాలనే యువతి కథగా ఈ సిరీస్ ఉంది.

రొటీన్ స్టోరీ బట్, యాక్షన్ మాత్రం..

రొటీన్ స్టోరీ బట్, యాక్షన్ మాత్రం..

ఈ కథలో కొత్తదనం ఏముండదు. మహితకు ఇచ్చిన ఎలివేషన్ ను బట్టి తన గతంలోని స్టోరి కానీ, సన్నివేశాలు కానీ ఇంకాస్తా బలంగా రాసుకుంటే బాగుండేది. ప్రేమ పేరుతో మోసపోయిన ఒక వేశ్య ఎలా పగ తీర్చుకోవాలనుకున్నదే ఝాన్సీ స్టోరి. ఈ కథలో పలు క్యారెక్టర్లు.. వారికి మహితకు ఉన్న అనుబంధం, విలన్ కాలేబ్ వల్ల జరిగిన అన్యాయం వంటివి రొటీన్ అయినప్పటికీ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి.

ఇక ఈ రెండో సీజన్ కూడా పూర్తిగా ముగించలేదు. చివరిలో అంజలి, చాందినీ చౌదరి మధ్య వచ్చిన సంబాషణ మూడో సీజన్ కు స్ట్రాంగ్ బేస్ అని చెప్పవచ్చు. రెండో సీజన్ ముగింపు మూడో సీజన్ కు క్యూరియాసిటీ పెంచేలా ఉందని మాత్రం చెప్పవచ్చు.

ఎవరెలా చేశారంటే..

ఎవరెలా చేశారంటే..

ఈ వెబ్ సిరీస్ లో ఝాన్సీ పాత్రకు అంజలి చాలా బాగా సెట్ అయింది. గతాన్ని వెతుక్కుంటూ వెళ్లే యువతిగా బాగా నటించింది. ఇక ఈ ఝాన్సీ రెండో సీజన్ లో అంజలిని ఎప్పుడు చూడని విధంగా చూస్తారు. వేశ్య పాత్రలో బాగానే ఆకట్టుకుంది. ఇక యాక్షన్ సన్నివేశాల్లో అంజలి అదరగొట్టిందనే చెప్పవచ్చు.

ఇక అంజలి తర్వాత మరో ఇంపార్టెంట్ రోల్ చాందిని చౌదరిది. తను కూడా వేశ్యగా.. షూటర్ గా బాగా పర్ఫామ్ చేసింది. నెగెటివ్ క్యారెక్టర్ గా బాగా యాప్ట్ అయింది. అయితే ఫ్లాష్ బ్యాక్ కంటే రియాలిటీ కథలో స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంది. ఇక మిగతా క్యారెక్టర్లు పరిధి మేర ఆకట్టుకున్నాయి.

ఫైనల్ గా ఎలా ఉందంటే..

ఫైనల్ గా ఎలా ఉందంటే..

శ్రీచరణ్ పాకాల సంగీతం అక్కడక్కడ బాగుంది. సన్నివేశాలకు తగినవిధంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెట్ అయింది. పలు చోట్ల డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇదివరకు గోపిచంద్ తో చాణక్య సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ తిరు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. అంజలి గతం తాలుకు సన్నివేశాలను ఇంకాస్తా బలంగా చూపించి ఉంటే బాగుండేది.

ఇక ఫైనల్ గా చెప్పాలంటే.. మొదటి సీజన్ చూసిన వారు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీజన్ 2 చూడొచ్చు. అలాగే అంజలి యాక్షన్ సీన్స్ కోసం వీకెండ్ లై టైమ్ పాస్ గా ఝాన్సీ సీజన్ 2ను వీక్షించవచ్చు. కానీ స్టోరీ, గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ పై పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకపోవడం మంచిది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X