Fall Series Review: అంజలి కొత్త సిరీస్ 'ఫాల్'.. ఆ పాత్రలో తొలిసారిగా సింగర్ ఎస్పీ చరణ్!

రేటింగ్: 2.5/5

టైటిల్: ఫాల్ వెబ్ సిరీస్
నటీనటులు: అంజలి, ఎస్పీ చరణ్, సోనియా అగర్వాల్, సంతోష్ ప్రతాప్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి
రచన: కరుణ్ దేల్ రాజేష్, సిద్ధార్థ్ రామస్వామి
దర్శకత్వం: సిద్ధార్థ్ రామస్వామి
సంగీతం: అజేష్ అశోక్
నిర్మాతలు: ఎస్పీ చరణ్, దీపక్ ధర్, రాజేష్ చద్దా
విడుదల తేది: డిసెంబర్ 9, 2022
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (ప్రస్తుతం 3 ఎపిసోడ్స్)

టాలీవుడ్ లో అచ్చమైన తెలుగు అమ్మాయిగా ముద్ర వేసుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ అంజలి. కథానాయిక పాత్రల్లోనే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో సైతం అలరించిన అంజలి ప్రస్తుతం ఓటీటీలో హవా చూపిస్తోంది. ఇటీవల యాక్షన్ ఎంటర్టైనర్ ఝాన్సీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అంజలి తాజాగా మరో వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అంజలి, ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఫాల్' (Fall Web Series) వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం!

కథ:

కథ:


స్పోర్ట్స్ సెంటర్ నడుపుతుంటుంది దివ్య (అంజలి). తల్లిదండ్రులతో గొడవపడి వాళ్లకు దూరంగా స్పోర్ట్స్ సెంటర్ వద్దే ఉంటుంది. ఒక రోజు రాత్రి కారులో వస్తూ డేనియల్ (సంతోష్ ప్రతాప్) గురించి ఒక విషయం చెప్పాలని మలార్ (సోనియా అగర్వాల్) కు మెసేజ్ పంపుతుంది. అదే రోజు రాత్రి తన ఫ్లాట్ పై నుంచి కింద పడి కోమాలోకి వెళ్తుంది. సుమారు 6 నెలలపాటు కోమాలో ఉండి బయటకు వస్తుంది. అయితే దివ్య నుంచి తిరిగి వచ్చిందని తెలియగానే తన చెల్లెలు, అన్నయ్య రోహిత్ (ఎస్పీ చరణ్), డేనియల్ అంతా కంగారు పడతారు. కానీ ఆమెకు ఏం గుర్తు లేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. దివ్య ఎందుకు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది? అసలు అది సూసైడేనా? డేనియల్ ఎవరు? దివ్య స్పోర్ట్స్ సెంటర్ అమ్మేందుకు రోహిత్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? వంటి తదితర ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ ఫాల్ చూడాల్సిందే.

విశ్లేషణ:

విశ్లేషణ:


ఇటీవల ఝాన్సీ అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న అంజలి మరోసారి ఫాల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, సింగర్ ఎస్పీ చరణ్ నటించడం విశేషం. గత ఝాన్సీ వెబ్ సిరీస్ లానే ఇదికూడా మెమోరీ లాస్ నేపథ్యంతో సాగింది. అయితే 2012లో వచ్చిన వర్టీజ్ అనే కెనడా వెబ్ సిరీస్ కు రీమేక్ గా ఫాల్ తెరకెక్కించారు. తమిళంలో చిత్రీకరించిన ఈ సిరీస్ ను తెలుగుతోపాటు వివిధ భాషల్లో డబ్ చేశారు. ప్రస్తుతానికి ఫాల్ సిరీస్ మూడు ఎపిసోడ్స్ మాత్రమే విడుదల చేశారు. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ను రిలీజ్ చేయనున్నారు.

ఆసక్తిగా ప్రారంభించిన ఫాల్ వెబ్ సిరీస్ లో ప్రస్తుతం విడుదలైన మూడు ఎపిసోడ్స్ అంతా పాత్రల పరిచయానికే అన్నట్లుగా ఉంది. దివ్య భవనంపై నుంచి పడిపోతే.. వాళ్ల ఇంటి సభ్యులు ఎలా ఫీల్ అయ్యారు. తర్వాత కోమా నుంచి బయటకు వచ్చాక వాళ్ల ప్రవర్తన ఏంటీ అనే దానిపైనే ఈ ఎపిసోడ్స్ సాగాయి. దివ్య స్పోర్ట్స్ సెంటర్, ఒక మెట్రో ప్రాజెక్ట్, క్యారెక్టర్ల్ బలాలు, బలహీనతలు, వంటి అంశాలపైనే ఈ ఎపిసోడ్స్ నడిచాయి. అలాగే దివ్య తన గతాన్ని గుర్తు తెచ్చుకోవాడనకి ప్రయత్నించడం, దానికి ఆమె ఫ్రెండ్ వదినా మలార్ (సోనియా అగర్వాల్) సహాయం చేయడం వంటి సన్నివేశాలే ఎక్కువ కనిపిస్తాయి. పెద్దగా ట్విస్ట్స్ ఏం ఉండవు. అలాగే ఈ సిరీస్ ఒక సీరియల్ చూసిన ఫీలింగ్ కూడా తెప్పిస్తుంది. ఎటు ముందుకు కదట్లేదన్న భావన ఎక్కువగా కనిపిస్తుంది.

 ఎవరెలా చేశారంటే..

ఎవరెలా చేశారంటే..


అంజలికి ఇలా గతం మర్చిపోయి.. తన తన కథేంటో వెతుక్కునే పాత్ర చేయడం ఇది రెండోసారి. అంజలి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇప్పటివరకు విడుదలైన ఎపిసోడ్స్ లో ఆమె నటన చూపించే అంతగా సన్నివేశాలు అయితే ఏం రాలేదు. ఇక ఎస్పీ చరణ్ నెగెటివ్ షేడ్స్ తో కొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. సోనియా అగర్వాల్ పాత్రకు తగినట్లుగా నటించింది. మిగతా పాత్రలు కూడా పరిధి మేర ఆకట్టుకున్నాయి. అజేష్ అశోక్ నేపథ్యం సంగీతం వెబ్ సిరీస్ కు ప్లస్ అని చెప్పవచ్చు. సస్పెన్స్ సన్నివేశాల్లో ఆ మూడ్ క్రియేట్ చేశాడు. డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ రామస్వామి సినిమాటో గ్రఫీ కూడా అందించారు. విజువల్స్ బాగున్నాయి.

 ఫైనల్ గా చెప్పాలంటే..

ఫైనల్ గా చెప్పాలంటే..


ఓవరాల్ గా ఫాల్ వెబ్ సిరీస్ ఓకే అనిపించినా.. కథలో కాస్తా స్పీడ్ పెంచి.. 40 నిమిషాలు ఉన్న ఎపిసోడ్ నిడివిని 30 నిమిషాలకు తగ్గిస్తే క్రిస్పీగా ఉండేది. అలాగే మూడు ఎపిసోడ్స్ కాకుండా కథలో ఇంకొంచెం డెప్త్ చూపించినా, ఇంకో రెండు ఎపిసోడ్స్ విడుదల చేసినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేందుకు ఇంకా అవకాశం ఉండేది. ఇక ఓటీటీలోనే కాబట్టి సిరీస్ కాస్తా స్లో అయినా వీకెండ్ లో ఒక చిన్న విరామం కోసం 'ఫాల్' ను ఫాలో అవ్వొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X