Annapurna Photo Studio Review పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో కామెడీ లవ్ స్టోరి.. అన్నపూర్ణ ఫోటో స్టూడియో రివ్యూ

Rating:2.75/5

నటీనటులు: చైతన్య రావు మదాడి, లావణ్య సాహుకార, లలిత్ ఆదిత్య, వైవా రాఘవ, ఉత్తర రెడ్డి, మిరా గురుపాదప్ప, యష్ రంగినేని, వాసు ఇంటూరి, కృష్ణ మోహన్, రమణ తదితరులు
దర్శకత్వం: చెందు ముద్దు
నిర్మాత: యష్ రంగినేని
మ్యూజిక్: ప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రఫి: పంకజ్ తొట్టాడ
ఎడిటర్: డీ వెంకట్ ప్రభు
బ్యానర్: బిగ్ బెన్,
రిలీజ్ డేట్: 2023-07-21

కపిలేశ్వరపురం గ్రామంలో అన్నపూర్ణ ఫోటో స్టూడియోను నడిపే వీడియోగ్రాఫర్ చంటి (30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు)కి వయసు మీద పడినా పెళ్లి జరగదు. అదే గ్రామానికి చెందిన గౌతమి (లావణ్య సాహుకార)తో ప్రేమలో పడుతాడు. గౌతమి, చంటి ప్రేమలో మునిగి తేలుతుంటారు. అంతా సవ్యంగా సాగుతుందనే క్రమంలో చంటి ఆత్మహత్యాయత్నం చేస్తాడు.

Annapurna Photo Studio Telugu  movie Review and Rating

చంటికి వయసు మీద పడినా ఎందుకు పెళ్లి కాదు? చంటికి పెళ్లి కాకపోవడం వెనుక అసలు కారణం ఏమిటి? గౌతమిని ప్రేమలో పడేయడానికి చంటి చేసిన ప్రయత్నాలు ఎలా సాగాయి. చంటి, గౌతమి మధ్య లవ్ ట్రాక్ ఎలా నడిసింది? సడెన్‌గా చంటి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశాడు? చంటి ఆత్మహత్యాయత్నం వెనుక కారణాన్నితెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ఎలా సాగింది? చంటి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకొన్నాడు? చంటి జీవితంలో మర్డర్ ట్విస్టు ఏమిటి? చివరకు చంటి, గౌతమి పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా కథ.

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో చంటి క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కాస్త సమయం తీసుకొన్నారనే ఫీలింగ్ కలుగుతుంది. పక్కా గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో దర్శకుడు చెందు ముద్దు రాసుకొన్న పాత్రల్లో నిజాయితీ కనిపిస్తుంది.

కమర్షియల్ హంగులకు పోకుండా దర్శకుడు స్వచ్ఛమైన విలేజ్ నేపథ్యంగా కథను పండించే ప్రయత్నం దర్శకుడు చేసినట్టు కనిపిస్తుంది. 80 దశకం బ్యాక్ డ్రాప్‌కు తగినట్గుగా పాత్రలను, వారి గెటప్‌లను డిజైన్ చేసిన విధానం బాగుంది. ఆహ్లాదకరంగా సాగే ఈ కథలో హాస్యానికి పెద్ద పీట వేసినట్టు కనిపిస్తుంది. చంటి సూసైడ్ అటెంప్ట్‌తో అసలు కథ మొదలవుతుంది.

Annapurna Photo Studio Telugu  movie Review and Rating

ఇక సెకండాఫ్‌లో చంటి మరణానికి ముందు రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా సన్నివేశాలు, కథ సాగుతాయి. పోలీసులు సూసైడ్ లెటర్‌ చదివే క్రమంలో జరిగే సీన్లు కొంత సాగదీసినట్టు కనిపిస్తుంది. రౌడీ (శివ కాముని) ఓ అమ్మాయిని చంపేందుకు ప్రయత్నించే ఎపిసోడ్‌తో కథ కొత్త మలుపు తీసుకొంటుంది. గౌతమ కానీ క్లీన్ అండ్ హెల్తీ కామెడీ సీన్లు ఉండటం వల్ల సినిమా ఆహ్లాదకరంగా సాగినట్టు అనిపిస్తుంది. చివర్లో నిర్మాత యష్ రంగినేని పాత్ర ఇచ్చే ట్విస్టుతో మూవీ ఫీల్‌గుడ్‌గా ముగుస్తుంది.

ఇక నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పెళ్లి కాని ప్రసాద్ లాంటి పాత్రలో చైతన్యరావు చక్కగా ఒదిగిపోయాడు. కామెడీ టచ్‌తోసాగే పాత్రలో చైతన్య చూపించిన హావభావాలు, ఎమోషన్స్ ఆకట్టుకొంటాయి. 30 వెడ్స్ 21 తర్వాత మరోసారి మంచి హ్యుమర్‌కు స్కోప్ ఉన్న పాత్రలో చైతన్య రావు మెప్పించాడు. లావణ్య, మిహిర పాత్రను పోషించిన యాక్టర్, యష్ రంగినేని, వాసు ఇంటూరి, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

Annapurna Photo Studio Telugu  movie Review and Rating

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. గ్రామీణ నేపథ్యంతో సాగే కథకు కావాల్సిన ఫీల్‌గుడ్ అంశాలను ఎలివేట్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ పంకజ్ సఫలమయ్యారు. ప్రిన్స్ హెన్నీ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. ఫస్టాఫ్‌లో సినిమా చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎడిటర్ వెంకట్ ప్రభు తన కత్తెరకు మరింత పదును పెట్టాల్సి ఉందనిపిస్తుంది. బిగ్ బెన్ బ్యానర్‌పై యష్ రంగినేని అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తెలుగు నేటివిటి, లవ్, ఎమోషన్స్, 80వ దశకం బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. సున్నితమైన ఫ్యామిలీ వ్యాల్యూస్, నిజాయితీగా చెప్పే కథ ఈ సినిమాకు ప్లస్ అయితే.. మూవీ చాలా స్లోగా, బలమైన సన్నివేశాలు, భావోద్వేగాలను పండించే ఎమోషన్ మిస్ కావడం కొంత ఈ సినిమాకు మైనస్ అనిపిస్తుంది. క్లీన్ అండ్ హెల్తీ కామెడీని, ఫ్యామిలీ అంత చూడదగిన సినిమాగా రూపొందించే ప్రయత్నం అభినందనీయం. గ్రామీణ నేపథ్యంతో రూపొందే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఎలాంటి అంచనాల లేకుండా వెళితే మంచి వినోదం, అనుభూతిని అందిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X