Ant-Man and the Wasp: Quantumania review కాంగ్ విధ్వంస ఆకట్టుకొందా? మార్వెల్ సూపర్ హీరో ఫ్యాన్స్‌ను మెప్పిస్త
2.5/5
నటీనటులు: పాల్ రుడ్, ఎవాంజెలీన్ లిల్లీ, జోనాథన్ మేజర్స్, మైఖేల్ డగ్లస్, కాత్రీన్ న్యూటన్, కాటీ ఓబ్రియన్, విలియమ్ జాక్సన్, బిల్ ముర్రే తదితరులు
దర్వకత్వం: పీటన్ రీడ్
రచన్: జెఫ్ లవ్ నెస్
నిర్మాతలు: కెవీన్ ఫీజ్, స్టీఫాన్ బ్రౌసార్డ్
సినిమాటోగ్రఫి: విలియం హోప్
ఎడిటింగ్: ఆడమ్ గెర్ స్టెల్, లారా జెన్నింగ్స్
మ్యూజిక్: విలియం హోప్
బ్యానర్: మార్వెల్ స్టూడియోస్
డిస్ట్రిబ్యూషన్: వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2023-02-17
ఎండ్‌గేమ్ ఎపిసోడ్ తర్వాత తన ప్రేయసి హోప్ వ్యాన్ డైన్ (ఎవాంజిలిన్ లిల్లీ)తో కలిసి స్కాట్ లాంగ్ అలియాస్ యాంట్ మ్యాన్ (పాల్ రుడ్) ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. స్కాట్ కూతురు కాసీ (క్యాత్రీన్ న్యూటన్) మాత్రం భూమండలానికి సమాంతరంగా ఉన్న కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఉత్సాహంగా ఉంటుంది. హోప్, జానెట్ (మిచెల్లీ ఫైఫర్), హంక్ (మైఖేల్ డగ్లస్)తో కలిసి మల్టీవెర్స్‌లోకి ప్రవేశిస్తారు. కొత్త ప్రపంచంలో కాంగ్ (జోనాథన్ మేజర్) రూపంలో ఓ దుష్టశక్తి ఎదురువుతుంది.
కాంగ్ బారిన పడిన కాసీ, జానెట్, హంక్ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు. కాంగ్ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాడు. కాంగ్ చేతిలో కిడ్నాప్‌కు గురైన కాసీని రక్షించుకోవడానికి యాంట్ మ్యాన్ స్కాట్ ఏం చేశాడు. కాంగ్ విధ్వంసానికి, కుట్రలకు ఎలా ముగింపు పలికారు అనేది Ant-Man and the Wasp: Quantumania సినిమా కథ.

యాంట్ మ్యాన్ అలియాస్ స్కాట్ లాంగ్‌గా పాల్ రూడ్ మరోసారి తన పాత్రతో విజృంభించాడు. హోప్‌తో కలిసి రొమాంటిక్ సీన్లలో ఫన్ క్రియేట్ చేశారు. స్కాట్ కూతురు కాసీగా క్యాథ్రీన్ న్యూటన్) సినిమాను పూర్తిగా లీడ్ చేసే ప్రయత్నం చేసింది. ఇక మార్వెల్ యూనివర్స్‌లో భయంకరమైన విలన్‌గా కాంగ్ కొత్తగా కనిపిస్తాడు. కాంగ్ పాత్రలో జోనాథన్ మేజర్స్ తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
మల్టీవర్స్, క్వాంటమేనియా లాంటి కొత్త ప్రపంచాన్ని సాంకేతికంగా అద్బుతంగా క్రియేట్ చేశారు. కానీ ఆ ప్రపంచానికి సరిపడే కథను గానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ గానీ అందించడంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మ్యూజిక్, మూవీ బ్యాక్ డ్రాప్ గతంలో వచ్చిన నాలుగు సూపర్ హీరో సినిమాలతో పొల్చితే గొప్పగా అనిపించదు. మార్వెల్ యూనివర్సల్ సినిమాలు ప్రపంచాన్ని ఆకట్టుకొన్నంతగా యాంట్ మ్యాన్ వాస్ప్‌ను తెరకెక్కించడంలో దర్శకుడు పేటన్ రీడ్ సక్సెస్ కాలేడని చెప్పాలి.
ఫస్టాఫ్‌లో రొమాన్స్, ఫన్ సీన్స్‌తో సినిమాను సరదాగా ముందుకు తీసుకెళ్లాడు. సెవన్ హోల్స్ లాంటి సన్నివేశాలు మంచి ఫన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలైనా, యాక్షన్ సీన్లైనా అక్కడ మాత్రమే మెరుపులు మెరిపించాయి. సెకండాఫ్‌లో కాంగ్‌పై వార్ సీక్వెన్సెస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని చెప్పాలి.
ఇక సాంకేతిక నిపుణల విషయానికి వస్తే.. విలియమ్ హోప్స్ సినిమాటోగ్రఫి బాగుంది. క్రిస్టోఫే బెక్ మ్యూజిక్ అంతగా గొప్పగా అనిపించదు. గత యాంట్ మ్యాన్, మార్వెల్ సూపర్ హీరో సినిమాలతో పోల్చితే.. యాంట్ మ్యాన్ వాస్ప్ మాత్రం నిరాశనే కలిగిస్తుంది. చిన్న పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. భారీ అంచనాతో కాకుండా రెగ్యులర్ ఆడియెన్స్ వెళ్తే వారు కూడా మంచి అనుభూతితో వస్తారని చెప్పవచ్చు. మార్వెల్ అభిమానులు ఓసారి ట్రై చేసి చూడండి..


Click it and Unblock the Notifications











