ఏదో ఒకటి అంతా మనమంచికే

By Staff

Antamanamanchike
-వాసు
చిత్రం: అంతామన మంచికే
నటీనటులు: రాజేంద్రప్రసాద్‌, రచన, ఆశాషైనీ, కోవైసరళ, సుధాకర్‌
ప్రొడ్యుసర్‌: మహేష్‌ రాఠీ
కథ, స్క్రీన్‌ ప్లే, సంగీతం, దర్శకత్వం: వీరు.కె.

రాజేంద్రప్రసాద్‌ చిత్రం అనగానే కడుపుబ్బ నవ్వించే కామెడీని ఎక్స్‌ పెక్ట్‌ చేస్తాం. చాలా రోజలు తర్వాత హీరోగా రాజేంద్రప్రసాద్‌ నటించిన అంతా మనమంచికే చిత్రంలో కామెడీ పాలు తక్కువ. గందరగోళ సన్నివేశాలు ఎక్కువ. కామెడీ సీన్‌ లన్నింటిని ఒక దగ్గర చేర్చి రూపొందించిన ఈ చిత్రం అతుకుల బొంత. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి విజయవంతం కావడంతో- డబ్బు సంపాదించేందుకు కామెడీ పేరిట సాగే చిత్రవిచిత్ర వినోదాత్మక చిత్రాల సంఖ్య పెరిగింది. ఈ చిత్రం అలాంటి కోవకు చెందినదే.

రాజేంద్రప్రసాద్‌ ఓ ధనవంతుడి కొడుకు. రచనను చూడగానే ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను పొందేందుకు లెక్షరర్‌ వేషం వేస్తాడు. కానీ డబ్బు మాత్రం ముఖ్యమని నమ్మే రచన రాజేంద్రప్రసాద్‌ ప్రేమను తిరస్కరిస్తుంది. డబ్బు ఉన్న వాడిని తప్ప మామూలు వ్యక్తిని పెళ్ళిచేసుకోనని తెగేసి చెప్పుతుంది. అప్పుడు రాజేంద్రప్రసాద్‌ తన ఆస్థి గురించి చెప్పుతాడు. ఇద్దరి పెళ్ళి అవుతుంది. కానీ రాజేంద్రప్రసాద్‌ తండ్రికి రచన అంటే ఇష్టముండదు.

తన ఆస్థిపై మాత్రమే ఆమెకు ఇష్టముందని భావించిన ఆయన రాజేంద్రప్రసాద్‌ ను ఇంట్లోంచి బయటికి వెళ్ళి బతకమని చెప్పుతాడు. వీరిద్దరూ వేరే కాపురం పెడుతారు. డబ్బు పిచ్చి ఉన్న రచన ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తుంది. అప్పుల బాధ ఎక్కువడంతో సమస్యలు మొదలవుతాయి. ఇద్దరూ కోర్డుకెక్కుతారు. కానీ డైవర్స్‌ కు కోర్ట్‌ ఒప్పుకోదు. విడాకులు తీసుకునేముంది మరికొన్ని రోజులు కలిసుండాల్సిందిగా కోర్టు తీర్పు ఇస్తుంది. ఆ తర్వాత జరగే సీన్‌ లన్నీ కామెడీ దృశ్యాలే.

రాజేంద్రప్రసాద్‌ నటన గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. రచన నటన బావుంది. కోవైసరళ, సుధాకర్‌, రమాప్రభలు చేసే కామెడీ ఈ సినిమాకు కాస్తా పట్టు. దర్శకుడు వీరు.కె. అనేక శాఖలు నిర్వహించి ఏదీ పరిపూర్ణంగా చేయలేదు. సంగీతం అంతంతమాత్రమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X