twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ante Sundaraniki Movie Review.. నాని, నజ్రియా సూపర్.. వివేక్ ఆత్రేయ వల్లే అలాంటి ఫీలింగ్!

    |

    Rating:
    2.5/5

    Recommended Video

    Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat

    మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి ఫీల్ గుడ్ సినిమాలు అందించిన వివేక్ ఆత్రేయ, నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీం జంటగా నటించిన అంటే సుందరానికి మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు విభిన్న మతాలకు సంబంధించిన ప్రేమ కథతో వచ్చిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు ఆసక్తిని పెంచాయి. నజ్రియా నజీం, ఇతర పాత్రల వివరాలు సినిమాపై క్యూరియాసిటిని పెంచాయి. ఇలాంటి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని పంచిందో తెలుసుకొందాం పదండి..

    అంటే సుందరానికి కథ ఏమిటంటే?

    అంటే సుందరానికి కథ ఏమిటంటే?


    హిందు మతానికి సంబంధించి బ్రహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని), క్రిస్టియన్ మతానికి చెందిన లీలా థాంప్సన్ (నజ్రియా నజీం ఫాహద్) బాల్య స్నేహితులు. చిన్నప్పటి నుంచే ఒకరంటే మరొకరికి ఇష్టం. తల్లిదండ్రుల ఆచారాలు, సంప్రదాయాల వల్ల సుందర్ రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అయితే పరమతం అంటే ద్వేషం పెంచుకొన్న తల్లిదండ్రుల కారణంగా లీలా పరిమితమైన జీవితంలో బతకాల్సి వస్తుంది. ఇలా భిన్నధ్రువాల సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్న సుందర్, లీలా ప్రేమలో పడుతారు. అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఓ నాటకం ఆడుతారు.

    కథలో ట్విస్టులు ఇలా..

    కథలో ట్విస్టులు ఇలా..


    తండ్రి కట్టుబాట్ల కారణంగా సుందర్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? సుందర్‌పై తండ్రి రకరకాల ఆంక్షలు విధించాడు? లీలా తండ్రికి హిందు మతం అంటే ఎందుకు గిట్టదు. పెళ్లి కోసం లీలా చేత సుందర్ ఆడించిన నాటకం ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది. పెళ్లి కోసం సుందర్ ఆడిన నాటకం తన కుటుంబంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించింది. పెళ్లి కోసం ఆడిన అబద్దాలను తప్పు అని చెప్పడానికి ఎలాంటి ఇబ్బందులను లీలా, సుందర్ ఎదుర్కొన్నారు? చివరకు లీలా, సుందర్ పెళ్లికి రెండు కుటుంబాలు కలిపి పోయాయా? అనే ప్రశ్నలకు సమాధానమే అంటే సుందరానికి సినిమా కథ.

    మూవీ ఫస్టాఫ్ ఎలా ఉందంటే

    మూవీ ఫస్టాఫ్ ఎలా ఉందంటే

    సుందర్, లీలా బాల్యంలో జరిగిన సంఘటనలతో అంటే సుందరానికి సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. పాత్రల పరిచయం, వాటి తీరుతెన్నులను ప్రేక్షకులకు చెప్పడానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ అనుసరించిన విధానం బాగుంది. కానీ ఓ టిపికల్ స్క్రీన్ ప్లేను ఎంచుకొని కథను, సన్నివేశాలను సాగదీసి.. నసతో సీన్లను ప్రేక్షకుల ముందు ఉంచడంతో తొలి భాగంలో సహనానికి పరీక్ష పెట్టినంత పనైందనే అభిప్రాయం కలుగుతుంది. అయితే తొలి భాగంలో దర్శకుడు కథను చెప్పిన విధానం పూర్తి ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందనే ఫీలింగ్‌ కలగడం సహజం అనిపిస్తుంది.

    సెకండాఫ్‌ ఎమోషనల్‌గా

    సెకండాఫ్‌ ఎమోషనల్‌గా

    ఇక అంటే సుందరానికి మూవీ సెకండాఫ్‌పై ఆశలు పెట్టుకొన్న ప్రేక్షకులకు అదే పరిస్థితి కనిపిస్తుంది. అదే సాగదీత, నస, అనవసరమైన సీన్లు, ఫ్రంట్ బ్యాక్ స్క్రీన్ ప్లేతో విసిగించాడు అనుకొనే సమయంలో దర్శకుడు అసలు కథను ఎత్తుకొని సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చాడేంటిరా అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథలోని ఎమోషనల్ పాయింట్‌ను నేరుగా చెప్పకుండా.. ముక్కు ఎక్కడుందిరా అంటే చుట్టూ తిప్పి చూపించిన విధంగా సినిమా అనిపిస్తుంది. అయితే టిపికల్ నేరేషన్ కారణంగా కథలో ఉండే బలమైన అంశాలు ప్రేక్షకుల దృష్టి నుంచి దూరమైట్టు అనిపిస్తుంది. చివరి 20 నిమిషాల్లో ఎమోషన్స్ బాగా పండటం కొంత ఉపశమనం మాత్రమే. ఆ తర్వాత కూడా క్లైమాక్స్‌లో అదే నస కొనసాగడంతో హృదయానికి టచ్ అయిన అంశాలు కూడా మరిచిపోయేలా చేసిందని ఫీలింగ్ కలుగుతుంది. సుందర్, లీలా తల్లిదండ్రుల కలిసే సీన్, హాస్పిటల్ సీన్లు సినిమాకు హైలెట్ అనిపిస్తాయి. మిగితాదంతా ప్రేక్షకుడికి చుక్కలు చూపించడమే అనిపిస్తుంది.

    వివేక్ ఆత్రేయ అనుసరించిన స్క్రీన్ ప్లే..

    వివేక్ ఆత్రేయ అనుసరించిన స్క్రీన్ ప్లే..

    మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలతో దర్శకుడు వివేక్ ఆత్రేయకు ప్రేక్షకుల్లో సదభిప్రాయం ఉండేది. అయితే అంటే సుందరానికి ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడానికి అదే బలమైన కారణం. మంచి ఎమోషనల్ పాయింట్‌తో సినిమాను రాసుకోవడం బెటరే కానీ.. ఆయన కథను చెప్పిన తీరే చాలా అభ్యంతరకరం. చివరి దాకా అసలు పాయింట్‌ను దాచిపెట్టి ఉంచాలనుకోవడం.. చైల్డ్ ఎపిసోడ్‌ను సినిమా అంతా వాడుకోవడం కథలోనే భావోద్వేగాలను ప్రేక్షకులకు దూరం చేసిందని చెప్పవచ్చు. ఇక మతానికి సంబంధించిన సెన్సిటివ్ విషయాలను ఎలాంటి వివాదాలు లేకుండా చెప్పడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. మంచి భోజనాన్ని (కథ) సరైన విధంగా.. చెడిపోయిన విస్తరి (స్క్రీన్ ప్లే) లో పెట్టే ప్రయత్నం చేయడమే ఈ సినిమాకు ప్రధాన లోపం అని చెప్పవచ్చు.

    నాని ఎలా మెప్పించాడంటే?

    నాని ఎలా మెప్పించాడంటే?

    అంటే సుందరానికి సినిమాకు బలం, వెన్నెముక నాని. సుందరం పాత్రలో నాని చక్కగా ఒదిగిపోయాడు. దర్శకుడు అనుసరించిన లోపాలను తన నటనతో కప్పి పుచ్చడానికి చేసిన ప్రయత్నమే ఈ సినిమాపై కొంత గౌరవాన్ని పెంచేలా చేసింది. ప్రతీ ఫ్రేమ్‌లో నాని ఫెర్ఫార్మెన్స్ కొత్తగా, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఫెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే నానికి కెరీర్ పరంగా ఇది మరో బెస్ట్ అని చెప్పవచ్చు.

    నజ్రియా నజీం మరోసారి అలా మెరిసి..

    నజ్రియా నజీం మరోసారి అలా మెరిసి..


    ఇక అంటే సుందరానికి సినిమా చూడటానికి ముందు లీలా పాత్ర కోసం నజ్రియా నజీం తీసుకోవాల్సిన అవసరమేంటి? అని లేచిన ప్రశ్నలకు ఆమె ఫెర్ఫార్మెన్స్ తగిన సమాధానం చెబుతుంది. బలమైన క్యారెక్టర్‌ను అంతే బలంగా తెరపైన పండించింది. లీలాగా బిహేవ్ చేయడం వల్ల నజ్రియా ఎక్కడ కనిపించదు. లీలా పాత్ర ద్వారా మరోసారి పుష్కలంగా అభిమానులను సంపాదించుకోవడం ఖాయం. ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ రోల్ స్పెషల్ సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. కథలో భాగంగా ఆమె పాత్ర కీలకంగా కనిపిస్తుంది.

    ఇతర నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    ఇతర నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    అంటే సుందరానికి మూవీలో సుందరం తల్లిదండ్రులుగా నటించిన నరేష్, రోహిణి పాత్రలు మన కుటుంబంలో, ఇరుగు పొరుగింటిలో ఉండే పాత్రల్లా కనిపిస్తాయి. నరేష్ సినిమా కథను తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు భుజాల మీద మోసాడనే ఫీలింగ్ కలిగిస్తాడు. రోహిణి కూడా అద్భుతంగా నటించింది. ప్రీ క్లైమాక్స్‌లో కొన్ని సీన్లలో రోహిణి ఆకట్టుకొన్నది. ఇక లీలా తల్లిదండ్రులుగా నటించిన నదియాతోపాటు థాంసన్ (అజగమ్ పెరుమాల్) కూడా చక్కగా నటించాడు. ఇక బామ్మగా నటించిన అరుణ బిక్షు పాత్ర ఎప్పటికి గుర్తుండిపోతుంది. హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలతో మెప్పించారు.

    టెక్నికల్ అంశాల పనితీరు

    టెక్నికల్ అంశాల పనితీరు


    సాంకేతిక విభాగాల పనీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మ ఫుల్ మార్కులు కొట్టేశారు. ప్రతీ చిన్న ఎమోషన్స్, కథను సీన్లలో జొప్పించిన విధానం.. భావోద్వేగాలను సీన్లలో పడించడానికి వాడుకొన్న లైటింగ్ అన్ని చక్కగా కుదిరాయి. ముఖ్యంగా సీన్లలో డిటైయిలింగ్ సూపర్. వివేక్ సాగర్ మ్యూజిక్ సన్నివేశాల పరంగా ఒకే అనిపిస్తుంది. సాధారణ ప్రేక్షకుడిని గొప్ప అనుభూతికి గురిచేసే మ్యూజిక్ మాత్రం ఈ సినిమాలో కనిపించదు. రవితేజ గిరిజాల పైనే అందరి చూపుపడింది. ఈ సినిమాకు ఇంత నిడివి అవసరమా అనే ప్రశ్న అందరిలోను కనిపిస్తుంది. నిడివిని తగ్గించే ప్రయత్నంలో రవితేజపై ఎంత ఒత్తిడి ఉందో సినిమాపై కొంత నాలెడ్జి ఉన్నవారికి అర్ధం అవుతుంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి

    ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి

    మైత్రీ మూవీస్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. స్టోరి నేరేషన్ మీద కాస్త శ్రద్ద పెట్టి ఉంటే.. బ్యానర్ ప్రతిష్టను పెంచే సినిమా అయి ఉండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. పాత్రలకు నటీనటుల ఎంపిక సినిమా క్వాలిటీని, స్టాండర్డ్స్ పెంచిందనిపిస్తుంది. నిడివిని కంట్రోల్ చేసి ఉంటే డిఫినెట్‌గా మంచి సినిమా అయి ఉండేదనిపిస్తుంది.

    ఫైనల్‌గా మూవీ గురించి

    ఫైనల్‌గా మూవీ గురించి


    భిన్న సంప్రదాయాలు, ఆచారాలున్న రెండు మతాలకు చెందిన కుటుంబాలు, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణ అంటే సుందరానికి. ఈ సినిమాలో డిటైలిటి ఎక్కువ కావడం ప్రధానమైన మైనస్. గొప్పగా సన్నివేశాలు రాసుకొని ఉంటే.. మూడు గంటల సినిమా అందరికి మనసుకు నచ్చి ఉండేది. కథనంలో లోపాలు సినిమాలోని ఎమోషన్స్‌తో ఆడుకొన్నాయి. మతం ముఖ్యం కాదు.. మనసులు కలవడం ప్రధానం అనే పాయింట్ అద్భుతంగా ఉంది. కానీ ఓవరాల్‌గా సినిమాను ప్రేక్షకుల ముందుకు పెట్టిన విధానమే ఆకట్టుకొలేకపోయింది. ప్రేక్షకుల సహనానికి పరీక్షించే సినిమా. చాలా ఓపికతో చూడాల్సిన మూవీ. కానీ నాని, నజ్రియా ఫ్యాన్స్‌ చూడదగిన సినిమా. సాంకేతిక విలువలు, హ్యుమర్, ఎమోషన్స్ కారణంగా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. రెండు మూడు రోజులు ఆగితే.. సినిమా పరిస్థితి ఏంటో స్పష్టమవుతుంది.

    అంటే మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    అంటే మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: నాని, నజ్రియా నజీం, అనుపమ పరమేశ్వరన్, నరేష్, రోహిణి, నదియా, అజగమ్ పెరుమాల్, హర్షవర్ధన్, పృథ్వీరాజ్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
    రచన, దర్వకత్వం: వివేక్ ఆత్రేయ
    నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్
    సినిమాటోగ్రఫి: నికేత్ బొమ్మి
    ఎడిటింగ్: రవితేజ గిరిజాలా
    మ్యూజిక్: వివేక్ సాగర్
    బ్యానర్: మైత్రీ మూవీస్ మేకర్స్
    రిలీజ్ డేట్: 2022-06-10
    నిడివి: 178 నిమిషాలు

    English summary
    Natural Star Nani's Ante Sundaraniki movie is released on June 10th. Here is the filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X