twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Anubhavinchu Raja movie review.. కొత్త సీసాలో పాత సారా.. రాజ్ తరుణ్‌కు అందని ద్రాక్షేనా?

    |

    Rating:
    2.5/5
    Star Cast: రాజ్ తరుణ్, కశీష్ ఖాన్, అరియానా గ్లోరి
    Director: గవిరెడ్డి శ్రీనివాస్

    నటీనటులు: రాజ్ తరుణ్, కశీష్ ఖాన్, అరియానా గ్లోరి, సుదర్శన్, అజయ్, పోసాని కృష్ణమురళి, రవికృష్ణ, టెంపర్ వంశీ, ఆదర్శ బాలకృష్ణ, ఆడుకాలమ్ నరేన్, భూపాల్ రాజ్ తదితరులు
    కథ, దర్శకత్వం: గవిరెడ్డి శ్రీనివాస్
    నిర్మాత: సుప్రియ యార్లగడ్డ, ఆనంద్ రెడ్డి
    మ్యూజిక్: గోపిసుందర్
    సినిమాటోగ్రఫి: నగేశ్ బానెల్లి
    ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
    స్టంట్స్: రియల్ సతీష్
    సాహిత్యం: రవి కుమార్ భాస్కరభట్ల
    రిలీజ్ డేట్: 2021-11-26

    భీమవరంకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బంగార్రాజు ( రాజ్ తరుణ్) సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువకుడు. ఓ రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకొంటాడు. అయితే సంపాదన కోసమే జీవితమంతా కష్టపడ్డాం. సంపాదించిన మొత్తాన్ని అనుభవించకుండానే పోతున్నామని బంగార్రాజు తాత ఆవేదన చెందుతాడు. దాంతో తాతలు సంపాదించిన మొత్తాన్ని బంగార్రాజు అనుభవించాలని నిర్ణయించుకొంటాడు. అయితే జీవితంలో ఊహించని మలుపు తిప్పడంతో బంగార్రాజు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేయాల్సి వస్తుంది.

    జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాల్సిన బంగార్రాజు ఎందుకు జైలుకు వెళ్లాడు? జైలు నుంచి బయటకు వచ్చిన బంగార్రాజు సెక్యూరిటీ గార్డుగా ఎందుకు పనిచేశాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే శృతి (కశీష్ ఖాన్‌)తో బంగార్రాజుకు ఉన్న సంబంధం ఏమిటి? భీమవరంకు సమీపంలో ఉన్న గ్రామంలో జరిగిన గొడవలు బంగార్రాజు జీవితంపై ఎలా ప్రభావం చూపాయి? చివరికి తన గ్రామ ప్రజలను బంగార్రాజు ఏ విధంగా మెప్పించాడు అనే ప్రశ్నలకు సమాధానమే అనుభవించు రాజా సినిమా కథ

    Anubhavinchu Raja movie review and Rating: Raj Taruns unimpressive village drama

    అక్కినేని నాగార్జున అభిమానిగా బంగార్రాజు క్యారెక్టర్ ఆసక్తికరంగానే మొదలవుతుంది. సమయం గడిచిన కొద్ది బంగార్రాజు క్యార్టెక్టర్‌లో ఇంటెన్స్ కనిపించకపోవడం రాజ్ తరుణ్ నటించిన పాత్ర రొటీన్ పాత్రే అనే ఫీలింగ్ కలుగుతుంది. సెక్యూరిటీ గార్డుగా రాజ్ తరుణ్ సన్నివేశాలు మరీ పేలవంగా ఉండటంతో ఆసక్తిని కలిగించలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు సుదర్శన్ కామెడీ ట్రాక్ కూడా నిస్తేజంగా సాగడం, అంతేకాకుండా కశీష్ ఖాన్ లవ్ ట్రాక్ కూడా మెప్పించలేకపోవడంతో మూవీ చాలా సాధారణంగా మొదటి భాగం సాగిపోతుంది.

    ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. కోడి పందాలు, జాతర సీన్లు మాస్ ఎలిమెంట్స్‌తో సాగడం కాస్త జోష్ పెరుగుతుంది. అయితే సరైన కథనం, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో కథ రొటీన్‌గా మారిపోయింది. జాతర సీన్ల తర్వాతైనా కథలో భావోద్వేగ అంశాలు ఉంటాయేమో అని ఆశించిన వారికి నిరాశే మిగులుతుంది. ఇక క్లైమాక్స్ చాలా హడావిడిగా ముగించడం మరింత అసంతృప్తిని కలుగు చేస్తుంది. దాంతో వెరసి.. రాజ్ తరుణ్ ఖాతాలో అతిసాధారణమైన సినిమాగా మిగిలిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    జీవితమంటే సంపాదిచండం, కష్టపడటమే కాదు.. పరిపూర్ణంగా అనుభవించాలి అనే మంచి పాయింట్‌తో వచ్చిన దర్శకుడు గవిరెడ్డి శ్రీనివాస్ కథ, కథనాలను సంపూర్ణంగా రాసుకోలేకపోయాడు. కథకు బలంగా మారాల్సి ఉండే కొన్ని క్యారెక్టర్లను అర్ధాంతరంగా వదిలివేశాడని అనిపిస్తుంది. కథలో ఎమోషనల్ ఎలిమెంట్స్ లేకపోగా, కథను నడిపించడానికి కావాల్సిన వినోదం కూడా లేకపోవడం వల్ల దర్శకుడి తడబాటు స్పష్టంగా కనిపించింది. సినిమా మొత్తంలో మూడు, నాలుగు చోట్ల ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాడు. కానీ పూర్తిస్థాయిలో ఆ ఇంపాక్ట్‌ను కొనసాగించలేకపోవడం సినిమా తేలిపోయినట్టు అనిపిస్తుంది.

    టాలెంట్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేకుండా రాజ్ తరుణ్ బంగార్రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాఫ్‌లో బంగార్రాజు క్యారెక్టర్ బలంగా లేకపోవడం వల్ల రాజ్ తరుణ్ కొత్తగా ప్రభావితం చేయలేకపోయాడనిపిస్తుంది. సెకండాఫ్‌కు వస్తే తన ప్రతిభకు అద్దంపట్టే పాత్ర దొరికినప్పటికీ.. కథలో రకరకాల వేరియేషన్స్ కారణంగా బంగార్రాజు పాత్ర మరుగునపడిపోయిందనిపిస్తుంది. శృతిగా కశీష్ ఖాన్ అందంగా కనిపించినా అభినయానికి స్కోప్ లేకపోయింది. కామెడీని పండించడానికి సుదర్శన్‌కు స్కోప్ లేకపోయింది. కానీ తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించాడు. అమ్మిరాజుగా పూర్తిగా రొటిన్ పాత్రలో అజయ్‌ కనిపించాడు. అరియానా రెండు సీన్లకు పరిమితమైంది. రాహుల్‌గా రవికృష్ణ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ కాలేకపోయింది. టెంపర్ వంశీ మిగితా పాత్రల్లోని వారు తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. కథ, సన్నివేశాల్లో బలహీనత కారణంగా గోపి సుందర్ కూడా మ్యూజిక్ పరంగా విభిన్నంగా కనిపించలేదు. అనుభవించు రాజా హమ్మింగ్‌కు బాగానే ఉంది. కానీ తెర మీద ఆసక్తిని కలిగించలేకపోయింది. సెకండాఫ్‌లో నగేష్ బానెల్లి సినిమాటోగ్రఫి బాగుంది. జాతర, యాక్షన్ సీన్లను బాగా చేశాడు. ఎడిటింగ్ విషయంలో చోటా కే ప్రసాద్ పని కత్తీ మీద సాముగానే అనిపించింది. సెకండాఫ్‌లో కథలో వేరియేషన్స్ చోటా బాగానే డీల్ చేశాడనిపిస్తుంది. రియల్ సతీష్
    స్టంట్స్ బాగున్నాయి. అన్నపూర్ణ స్టూడియో స్థాయిలో నిర్మాణ విలువలు కనిపించలేదని చెప్పవచ్చు. పిండికి తగిన రొట్టె మాదిరిగా ప్రొడక్షన్ వ్యాల్యూస్ కనిపించాయి.

    Recommended Video

    Radhe Shyam #EeRaathale Trending 1 | Prabhas పవర్ ఫుల్ లైనప్ || Filmibeat Telugu

    కథ, కథనాల్లో ఎలాంటి కొత్తదనం లేకుండా తెరకెక్కించిన పక్కా రొటీన్, ఫార్మూలా మూవీ అనుభవించు రాజా. స్టోరి పాయింట్ బాగున్నప్పటికీ.. సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్‌ లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. పేలవమైన సన్నివేశాలు, రొటీన్ కథ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటాయి. సరైన హిట్టుకోసం ఎదురు చూస్తున్న రాజ్ తరుణ్.. మరికొన్నాళ్లు సక్సెస్ కోసం ఆగాల్సిందే అనే ఫీలింగ్ కలుగుతుంది. గ్రామీణ నేపథ్యంతో సాగే రివేంజ్ డ్రామాను థియేటర్లలో ఎంజాయ్ చేయాలనుకొని.. ఎలాంటి అంచనాలు లేకుండా కాస్త రిలాక్స్‌గా వెళితే.. అనుభవించు రాజాను కొన్ని అంశాలు మెప్పించేలా చేస్తాయి.

    English summary
    Hero Raj Tarun's Anubhavinchu Raja movie review and Rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X