twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు విష్ణు ‘అనుక్షణం’ రివ్యూ...

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. సంచలనాలకు పెట్టిందిపేరైన వర్మ...తనదైన మార్కు సినిమాలతో గొప్ప డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడన్నది ఎంత వాస్తవమో..ఇటీవల కాలంగా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను టార్చర్ పెడుతూ చెత్త దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్నాడన్నది అంతే వాస్తవం.

    చెత్త సినిమాలు తీసినా, మంచి సినిమాలు తీసినా...వర్మ సినిమా అంటే ఆసక్తి చూపే వారికి కొదువేం లేదు. తాజాగా వర్మ ‘అనుక్షణం' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. సైకో థ్రిల్లర్ కథాంశానికి పవర్ ఫుల్ కాప్ క్యారెక్టర్ జోడించి తెరకెక్కించిన ఈచిత్రం విశేషాలపై ఓ లుక్కేద్దాం...

    కథలోకి వెళితే...
    ఓ సైకో అమ్మాయిలను వరుసగా హత్యలు చేస్తూ హైదరాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఈ సైకో ఆట కట్టించడానికి ప్రభుత్వం గౌతం(మంచు విష్ణు) అనే స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తుంది. సైకోను పట్టుకోవడానికి గౌతం పలు ప్రయత్నాలు చేసి విఫలం అవుతాడు. అదే సమయంలో సైకో కిల్లర్స్ మీద రీసర్చ్ చేసిన శైలజ(రేవతి) ఈ కేసులో గౌతంకు సహాయం చేయడానికి వస్తుంది. వీరి ఇన్వెస్టిగేషన్లో ఆ సైకో టాక్సీ డ్రైవర్ అయిన సీతారాం(సూర్య) అని గుర్తిస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది. అతన్ని పట్టుకోవడంలో గౌతం ఎలాంటి ప్లాన్స్ అమలు చేసాడు? అతను ఎందుకు అలా చేస్తున్నాడు? అనేది తర్వాతి కథ.

     Anukshanam is a crime thriller film

    నటీనటు పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...హీరో మంచు విష్ణు పోషించిన పోలీసాఫీసర్ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకునేలా ఉంది. సినిమాకు మంచు విష్ణు పెద్ద ప్లస్ పాయింట్. నటి రేవతి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సైకో పాత్రలో సూర్య ఇమిడిపోయాడు. బ్రహ్మానందం ఉన్నా కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇతన నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

    ఇలాంటి సినిమాల్లో కీలమైన సినిమాటోగ్రఫీని బాగా హ్యాండిల్ చేసారు. అయితే మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోరు, ఎడిటింగ్ ఫర్వా లేదు. ఇలాంటి కథ, కథనాలు మనకు కొత్తేమీ కాక పోయినా...సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపడంలో రామ్ గోపాల్ వర్మ కొంతమేర మెప్పించాడు. అయితే సినిమాలో ఆశించినంత సస్పెన్స్ మాత్రం లేదు. సీరియస్‌గా నడిచే సినిమాలో బ్రహ్మానందంతో బలవంతంగా కామెడీని జొప్పించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. డైలాగ్స్ ఓకే అనే విధంగా ఉన్నాయి. ఈ చిత్రానికి మంచు విష్ణే నిర్మాత. నిర్మాణ విలువల బాగున్నాయి. సినిమాను ఎక్కువ సాగదీయకుండా నిడివి తగ్గించి మంచి పని చేసారు.

    సైకో థ్రిల్లర్ కథాంశాలు, సస్పెన్స్ జేనర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. కామెడీ, యాక్షన్, రొమాన్స్ లాంటివి ఈ సినిమా నుండి ఆశిస్తే నిరాశ తప్పదు. మొత్తానికి ఇటీవల కాలంలో వచ్చిన పలు రామ్ గోపాల్ వర్మ సినిమాలతో పోలిస్తే కొంతలో కొంత ఈ సినిమా బెటరే అని చెప్పొచ్చు.

    English summary
    Anukshanam is a crime thriller film, which is inspired by a real life incident. The film is based on a serial killer who sends a wave of panic across Hyderabad. Besides producing the movie under his home banner 24 Frames Factory, Vishnu Manchu has also played the role of cop, who tracks down the serial killer. Revathi, Brahmanandam, Navdeep, Tejaswi Madivada and Madhu Shalini appear in other important role in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X