For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘అనుకున్నది ఒకటి అయినది ఒకటి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating: 1.5/5

  ధన్యా బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, సిద్ది ఇద్నానీ, త్రిధా చౌదరి అందమైన హీరోయిన్లతో నూతన దర్శకుడు బాలు అడుసుమిల్లి చేసిన ప్రయోగమే అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఇలాంటి కాన్సెప్ట్‌లు బాలీవుడ్, హాలీవుడ్‌లో సక్సెస్ అయ్యాయి.. అదే విధంగా తెలుగులోనూ విజయవంతమవుతుందా? ఈ అందమైన నలుగురు భామలకు మంచి పేరును తీసుకొచ్చిందా? లేదా? అన్నది చూద్దాం

  కథ

  కథ

  ఓ నలుగురు అమ్మాయిలు. అందులో ముగ్గురు (ధన్యా బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, త్రిధా చౌదరి) ఉద్యోగాలు చేసుకుంటూ ఇష్టమొచ్చినట్టు స్వేచ్చగా బతికేస్తుంటారు. వీరిలో గ్యాంగ్‌లో మిగిలిన సిద్ది (సిద్ది ఇద్నానీ) పెళ్లి చేసుకుని అసంతృప్తితో బతికేస్తుంది. ఈ నలుగురు తమ స్నేహితురాలి పెళ్లి కోసమని గోవా వెళ్తారు.

  కథలో ట్విస్ట్‌లు..

  కథలో ట్విస్ట్‌లు..

  డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ గోవాకు వెళ్లిన ఆ నలుగురికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వారు ఒకరిని హత్య ఎందుకు చేయవలసి వస్తుంది? ఆపై వారు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలేంటి? వారిని బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి ఎవరు? చివరకు ఏం జరిగింది?లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే అనుకున్నది ఒకటి అయినది ఒకటి.

  ఫస్టాప్ అనాలిసిస్..

  ఫస్టాప్ అనాలిసిస్..

  టీజర్, ట్రైలర్‌లో చూపించినట్టుగానే ఇది కాస్త బోల్డ్ నెస్‌తో కూడుకున్న సినిమానే. ఆఫీస్‌లోని ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకునే క్రమంలో అమ్మాయిలంతా కలిసి మందు, సిగరెట్లు తాగడం వంటి సీన్లతోనే ఫస్టాఫ్ మొత్తం నింపేశాడు. ప్రతీ ఐదారు నిమిషాలకు దాదాపు ఇవే సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తోనే నింపేసిన ఫీలింగ్ కలుగుతుంది. నలుగురు అమ్మాయిలు కలిస్తే ఇలా ఉంటుందా? అనే అనుమానం వచ్చేలా ప్రథమార్థం సాగింది. నలుగురు అమ్మాయిలు ఓ అబ్బాయిని బుక్ చేసుకోవడం, నేను ముందు వెళ్తానంటే నేను ముందు వెళ్తానని అరుచుకోవడం లాంటి సీన్స్, వారంతా మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఓ దశలో చిరాకు కూడా పుట్టిస్తాయి. వారంతా కలిసి అతడ్ని చంపేయడం, శవాన్ని పడేయడంతో ప్రథమార్థం ముగుస్తుంది. బోల్డ్ డైలాగ్‌లతో నిండిపోయిన ప్రథమార్థం.. ప్రేక్షకులను ఓ మోస్తరుగా మెప్పించే అవకాశం ఉంది.

  సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్ అనాలిసిస్..

  గోవాలో హత్య చేసి హైద్రాబాద్‌కు చేరుకుని ఎవరి పనుల్లో వారు మునిగితేలుతూ ఉండే సీన్స్‌తో ద్వితీయార్థం మొదలవుతుంది. అయితే వీరందర్నీ కలిసి ఓ అజ్ఞాతవ్యక్తి బ్లాక్ మెయిల్ చేయడంతో మళ్లీ గోవాకే రావడం, అతనేవరో కనిపెట్టాలనే చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. ఎంతో సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌తో సాగాల్సిన ఈ సీన్స్ మరీ నీరసనంగా సాగడంతో ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. చివరకు కథనం గాడి తప్పినట్టు కనిపిస్తుంది. క్లైమాక్స్‌లోనైనా.. ఏదైనా సీరియస్‌నెస్ ఉంటుందని ఊహించిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ప్రేక్షకులను కట్టిపడేయడంలో ద్వితీయార్థం విఫలమైన ఫీలింగ్ కలుగుతుంది.

  నటీనటుల పర్ఫామెన్స్

  నటీనటుల పర్ఫామెన్స్

  ధన్యా బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, సిద్ది ఇద్నానీ, త్రిధా చౌదరి అందరు గ్లామర్‌ను బాగానే ఒలకబోశారు. ఇక సినిమా మొత్తం వీరే కనడబడటంతో నటించే స్కోప్ కూడా దక్కింది. ఈ అందరిలోనూ ధన్యా బాలకృష్ణ చక్కగా కనిపించడమే కాదు.. అందర్నీ ఆకట్టుకునేలా నటించింది. మిగిలిన ఆ ముగ్గురు పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రల్లో సమీర్, హిమజ ఇలా తమ పరిధి మేరకు నటించారు. జాక్‌ పాత్ర కడుపుబ్బా నవ్విస్తోంది. ఆ పాత్ర ధారి బాగానే ఆకట్టుకున్నాడు.

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  అనుకున్నది ఒకటి అయినది ఒకటి కథ, కథనంలో పెద్ద మైనస్ ఉంది. ఈ సినిమా కామెడీనా, థ్రిల్లరా?, క్రైమా?.. అసలిది ఏ జానర్‌లో తెరకెక్కిద్దామని దర్శకుడు అనుకున్నాడో కనీసం ఆయకైనా తెలుసా? అనే అనుమానం ప్రేక్షకులకు కలిగే అవకాశం ఉంది. మొత్తం బోల్డ్ డైలాగ్స్‌తో నింపేయడమే సరిపోయిందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఏ ఒక్క సీన్‌లోనూ తరువాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠను కలిగించలేకపోయాడు. ఈ విషయంలో దర్శకుడు విఫలమయ్యాడు.

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  అనుకున్నది ఒకటి అయినది ఒకటి సినిమాలో పాటలు కూడా అంతగా గుర్తుండవు. వికాస్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఏమంతగా ఆకట్టుకోలేదు. శేఖర్ గంగనమోని తన కెమెరా పనితనంతో గోవా అందాలను బాగానే ఎలివేట్ చేశాడు. మణికాంత్ ఇంకొన్నిసీన్లను తీసేస్తే బాగుండేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

  ఫైనల్‌గా..

  ఫైనల్‌గా..

  అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటే.. నలుగురమ్మాయిలు కలిసి కూర్చుని చేసే చిట్ చాట్. అయితే ఇందులోని బోల్డ్ డైలాగ్స్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నా.. కమర్షియల్‌గా నిలబడుతుందో లేదో చూడాలి.

  బలాలు, బలహీనతలు..

  బలాలు, బలహీనతలు..

  ప్లస్ పాయింట్స్

  నటీనటులు

  కామెడీ

  మైనస్ పాయింట్స్

  కథ

  ఆసక్తికరంగా సాగని కథనం

  క్లైమాక్స్

  Palasa 1978 Movie Public Talk | Palasa 1978 Movie Audience Response
  నటీనటులు : తదితరులు

  నటీనటులు : తదితరులు

  దర్శకత్వం : బాలు అడుసుమిల్లి

  నిర్మాత : హిమ వెలగపూడి, వేగి శ్రీనివాస్

  బ్యానర్ : బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్

  మ్యూజిక్ : వికాస్ బడిజా

  సినిమాటోగ్రఫి : శేఖర్ గంగనమోని

  ఎడిటింగ్ : మణికాంత్

  రిలీజ్ డేట్ : 2020-03-06

  రేటింగ్ : 1.5/5

  English summary
  Anukunnadi Okkati Ayinadi Okkati is an Telugu language Crime , Thriller And Entertainment Drama written and directed by Baalu Adusumilli. The film stars Dhanya Balakrishna, Komalee Prasad, Siddhi Idnani, Tridha Choudhury. This movie released on March 6th 2020.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X