Anukunnavanni Jaragavu Konni Review క్రైమ్ కామెడీతో కాల్ గర్ల్, కాల్ బాయ్ కథ..

నటీనటులు: శ్రీరాం నిమ్మల, కలపాల మౌనిక, పోసాని కృష్ణ మురళీ, బబ్లూ, బిగ్‌బాస్ కిరిటీ, స్నేహ మాధురి, గౌతమ్ రాజు, మిర్చి హేమంత్ తదితరులు
నిర్మాత: జీ సందీప్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: జీ సందీప్
సినిమాటోగ్రఫి: చిన్నా శ్రీరాం, జీవీ అజయ్ కుమార్
ఎడిటర్: కేసీబీ హరి
మ్యూజిక్: గిడియన్ కట్టా
కో ప్రొడ్యూసర్: జీ భరత్
బ్యానర్: శ్రీ భరత్ ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2023-11-03

జీవితంలో కొన్ని సమస్యలు ఎదురు కావడంతో కార్తీక్ (శ్రీరామ్ నిమ్మల), మధు (మౌనిక కలపాల) కాల్ బాయ్, కాల్ గర్ల్‌గా పనిచేస్తుంటారు. తమ ఎంచుకొన్న వృత్తిలో భాగంగా ఇద్దరు వేర్వేరుగా ఓ హోటల్‌కు వెళ్లారు. వారు వెళ్లిన గదుల్లో ఇద్దరు దారుణ హత్యకు గురై ఉంటారు.

Anukunnavanni Jaragavu Konni Movie Review

కాల్ బాయ్‌గా, మధు కాల్ గర్ల్‌గా వృత్తిని ఎందుకు ఎంచుకొన్నారు. ఈ వృత్తిలో వారికి ఎదురైన అనుభవాలు ఏమిటి? వారు వెళ్లిన గదుల్లో హత్యకు గురైన వారు కనిపించడంతో ఏం జరిగింది? ఆ హత్యానేరం వ్యవహారంలో వారికి ఎదురైన సమస్యలు ఏమిటి? ఆ హత్య కేసు నుంచి వారు ఎలా భయపడ్డారు. వారిని ఎవరైనా ఇరికించే ప్రయత్నం చేశారా? అనే ప్రశ్నలకు సమాధానమే అనుకొన్నవన్నీ జరగవు కొన్ని సినిమా కథ.

కాల్ బాయ్, కాల్ గర్ల్ అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు మర్డర్ మిస్టరీగా రూపొందించిన తీరు బాగుంది. తొలి చిత్ర దర్శకుడైనప్పటికీ.. కథను చెప్పే విధానం, స్టోరీని నడిపించిన విధానం సినిమాపై ఆయనకు ఉన్న తపన, అభిరుచి కనిపిస్తుంది. ఇంకా వర్క్ చేసి.. ఇంకాస్త బడ్జెట్‌ ఉండి ఉండే డెఫినెట్‌గా మంచి కంటెంట్ ఉన్న చిత్రంగా అయి ఉండేదనిపిస్తుంది. దర్శకుడు సందీప్ రాసుకొన్న కథలోని పాత్రలకు నటీనటులు ఎంచుకొన్న తీరు ఫర్‌పెక్ట్‌గా సెట్ అయిందని చెప్పవచ్చు. కామెడీ సీన్లను, ఎమోషనల్ అంశాలను మేళవించిన తీరు బాగుంది.

నటీనటులు విషయానికి వస్తే.. శ్రీరామ్ నిమ్మల, మౌనిక తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. నటనపరంగా అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ పాత్రల్లో ఒదిగిపోయిన తీరు వారి ప్రతిభకు అద్దంపట్టింది. కొత్త హీరో, హీరోయిన్లకు పోసాని, కిరిటీ, గౌతమ్ రాజు లాంటి సీనియర్ల సహకారం కలిసి వచ్చింది. స్నేహ మాధురి, సోనియా చౌదరి, మిర్చి హేమంత్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. దర్శకుడు ఈ సినిమాకు వన్ మ్యాన్ షోగా మారాడు. డైలాగ్స్‌తోపాటు నిర్మాతగా మారి తన అభిరుచిని చాటుకొన్నారు. గిడియన్ కట్టా అందించిన మ్యూజిక్ బాగుంది. చిన్నా శ్రీరాం, జీవీ అజయ్ కుమార్ అందించిన మ్యూజిక్, కేసీబీ హరి ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది. కథ డిమాండ్ మేరకు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

సస్సెన్స్, థ్రిల్లర్, ఎమోషనల్ అంశాలను మేళవించిన చిత్రం అనుకొన్నవన్నీ జరగవు కొన్ని. కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో భావోద్వేగమైన అంశాలు కట్టిపడేస్తాయి. చిన్న చిత్రమైనా మంచి ఫీల్‌తో సాగిందనే చెప్పాలి. ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నా చిన్న సినిమా కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. క్రైమ్ , కామెడీతో వచ్చే సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. కంటెంట్ ప్రధానంగా వచ్చే సినిమాలను ఆదరించే వారు ఈ సినిమాను ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఓ కొత్త అనుభూతి కలిగే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X