Don't Miss!
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Butterfly Review: కుటుంబమే కిడ్నాపర్లు అయితే!.. అనుపమ పరమేశ్వరన్ 'బటర్ ఫ్లై' ఎలా ఉందంటే?
రేటింగ్: 2.5/5
టైటిల్: బటర్ ఫ్లై
నటీనటులు: అనుపమ పరమేశ్వరన్, భూమిక చావ్లా, నిహాల్ కోదాటి, రావు రమేష్, ప్రవీణ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
కథ, కథనం, దర్శకత్వం: ఘంటా సతీష్ బాబు
సంగీతం: అర్విజ్, గిడియన్ కట్టా
నిర్మాతలు: రవిప్రకాష్ బోడపాటి, ప్రదీప్ నల్లమెల్లి, ప్రసాద్ తిరువళ్లూరి
సమర్పణ: జెన్ నెక్ట్స్ సినిమా
విడుదల తేది: డిసెంబర్ 29, 2022
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
అందం, అభినయంతో ఆకట్టుకునే బ్యూటిఫుల్ హీరోయిన్స్ లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. కేరళకు చెందిన ఈ బ్యూటి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన బ్యూటి ఆరు రోజుల ముందు నిఖిల్ కు జోడిగా నటించిన 18 పేజీస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాకు పాజిటివ్స్ రాగా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు మరో సినిమాతో నేరుగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుపమ పరమేశ్వరన్. అనుపమ పరమేశ్వరన్ తోపాటు సీనియర్ హీరోయిన్ భూమికా చావ్లా కీలక పాత్ర పోషించిన బటర్ ఫ్లై సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
వైజయంతి (భూమిక చావ్లా), గీత (అనుపమ పరమేశ్వరన్) ఇద్దరు అక్కా చెల్లెళ్లు. తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోవడంతో.. ఇద్దరు ఒంటరిగా బతుకుతుంటారు. వైజయంతి ఫేమస్ క్రిమినల్ లాయర్ గా ఎదుగుతుంది. గీత ఒక జాబ్ చేస్తుంది. ఆమె కొత్తవాళ్లతో త్వరగా కలవలేదు. వైజయంతీ తన భర్త (రావు రమేశ్)తో విడాకుల కోసం ప్రయత్నిస్తుంటుంది. కానీ వాళ్లకు ఉన్న ఇద్దరు పిల్లలను వైజయంతీకి దక్కనివ్వనని అంటాడు వైజయంతీ భర్త. సిటీలో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి డబ్బు వచ్చాక చంపేసే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో వైజయంతీ ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అవుతారు. ఆ పిల్లలను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? వైజయంతీ శత్రువులు ఎవరైనా చేశారా? పిల్లలను కాపాడేందుకు గీత ఏం చేసింది? ఎలా పోరాడింది? ఎలాంటి కష్టాలు పడింది? అనే తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే బటర్ ఫ్లై సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
అనుపమ పరమేశ్వరన్ నటించిన బటర్ ఫ్లై మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఇలాంటి కిడ్నాప్, మిస్టరీ డ్రామా నేపథ్యంలో ఇదివరకు సినిమాలు చాలానే వచ్చాయి. కథ పరంగా కొత్తది కాకున్న మూవీ టేకింగ్ బాగుంది. అయితే సినిమా ప్రారంభమైన అర గంట వరకు చాలా బోరింగ్ అండ్ రొటీన్ గా సాగుతుంది. గీత, విశ్వ (నిహాల్ కోదాటి) మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా రొటీన్ గా ఉండి ఆకట్టుకోవు. వైజయంతీ ఇద్దరు పిల్లలు తప్పిపోవడంతో సినిమాలో వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచే సినిమా మొత్తం ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. అయితే కిడ్నాపర్ కు డబ్బులు ఇవ్వడం.. అనుపమ బృందం తప్పులు చేయడం రిపీట్ కావడం చూసిందే చూసినట్లుగా ఉంటుంది.

ఆకట్టుకునే క్లైమాక్స్ సీన్స్..
సినిమాలో ప్రధానంగా ఆడపిల్లకు అమ్మ కడుపులో, స్మశానంలో తప్ప రక్షణ లేదు అనే సందేశాన్ని ఇచ్చారు. అనాథలకు, అమ్మాయిలకు ఎలాంటి రక్షణ లేదని ఈ సినిమా ద్వారా చూపించారు. అలాగే ఆపదలో, ఒక అవసరంలో ఉన్న అమ్మాయితో అయినవాళ్లు ఎలా ప్రవర్తిస్తారో చూపించారు. అనాథలుగా పెరిగిన వైజయంతీ, గీతలపై సింపథీ క్రియేట్ చేసే సీన్లు కాకుండా ఉన్నతంగా హుందాగా చూపించే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ సన్నివేశాలు బాగుంటాయి. కాస్తా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. పతాక సన్నివేశాల్లో అనుపమ పరమేశ్వరన్ నటన ఆకట్టుకునేలా ఉంది. కొత్తవాళ్లతో త్వరగా కలిసిపోయేందుకు భయపడే ఓ యువతి అక్క పిల్లలు ఆపదలో ఉన్నారని తెలిసి ఒక ధైర్యవంతురాలిగా ఎలా మారిందని చూపించారు. అంటే సినిమా టైటిల్ కు తగినట్లుగా ఒక గొంగళి పురుగు అందమైన సీతకోక చిలుకగా మారినట్లు ఇండికేట్ చేశారు.

ఎవరేలా చేశారంటే..
అనుపమ పరమేశ్వరన్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది. క్లైమాక్స్ లో తన యాక్టింగ్ ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక పాట పాడటం విశేషం. భూమిక చావ్లా ఆదర్శవంతమైన లాయర్ గా, మహిళగా హుందాగా నటించారు. ప్రేయసి కష్టాల్లో ఉంటే పరితపించే యువకుడిగా నిహాల్ కోదాటి పర్వాలేదనిపించాడు. ఇక అర్విజ్, గిడియన్ కట్టా నేపథ్య సంగీతం బాగుంది. సినిమాలో సింగర్ చిత్ర పాడిన పాట పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. డైరెక్టర్ ఘంటా సతీష్ బాబు తన తెలివితో సినిమాలో హింట్స్ ముందుగానే వదిలారు. మహా భారతం, పాండవులు, బేతాలుడు కథలు చెప్పి విలన్ల గురించి ముందే హింట్స్ ఇచ్చారు. ఇక కిడ్నాపర్ల యాక్టింగ్ కూడా చాలా ఆకట్టుకునేలా ఉంది. వాళ్ల నటనకు కూడా మంచి స్కోప్ ఇచ్చారు డైరెక్టర్.

ఫైనల్ గా ఎలా ఉందంటే..
వల్గారిటీ, వయెలెన్స్ లేకుండా రెగ్యులర్ మిస్టరీ డ్రామాలకు కాస్తా డిఫరెంట్ గా సాగిన చిత్రం అనుపమ పరమేశ్వరన్ బటర్ ఫ్లై. మహిళలు, అనాథలు ఎదుర్కునే సమస్యలు, కిడ్నాపర్లు మనతోనే ఎలా ఉంటారు వంటి ఆసక్తికర అంశాల మేళవింపే ఈ సినిమా. ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా చూస్తే కచ్చితంగా నచ్చుతుంది. ఓటీటీనే కాబట్టి ఈ వీకెండ్ కి ఇయర్ ఎండ్ కి ఒక థ్రిల్లింగ్ సినిమాగా ట్రై చేయొచ్చు.