»   » మర్ నా ('వర్ణ' రివ్యూ)

మర్ నా ('వర్ణ' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.0/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

'7/G బృందావన కాలనీ', 'ఆడువారి మాటలకు అర్దాలే వేరులే' ,'యుగానికొక్కడు' వంటి విభిన్న చిత్రాలు అందించిన శ్రీ రాఘవ చిత్రాలంటే తెలుగు,తమిళ ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్. ఆ క్రేజ్ తోనే దాదాపు అరవై కోట్ల భారీ బడ్జెట్ తో అనుష్క ప్రధాన పాత్రలో చిత్రం రూపొంది వస్తోందనగానే సినీ ప్రేమికులు ఏదో ఓ గొప్ప చిత్రం చూడబోతున్నామని ఆశించారు. అయితే శ్రీ రాఘవ వారి ఆనందంపై నిర్ధాక్ష్యణ్యంగా నీళ్లు పోసేసాడు. అర్దం పర్దం లేని కథ,కథనంతో రెండున్నర గంటలు సేపు విసిగించాడు. రెండు లోకాలంటూ చూపిస్తూ వచ్చిన ఈ చిత్రం చూసినవాడుకి మూడో లోకం కనపడి మాలోకంగా మారిపోయే స్ధితి ఏర్పడింది. ఎంతో గొప్పగా పబ్లిసిటీ చేసిన గ్రాఫిక్స్ సైతం అవతార్ కాపీ కొట్టినట్లుగా ఉండి తేలిపోయాయి. ప్రస్తుతం తను చేస్తున్న రుద్రమదేవి, బాహుబలి చిత్రాలకోసం కత్తి ఫైట్స్ ప్రాక్టీస్ చేసినట్లుగా అనుష్క పాత్ర సాగింది. ఎక్సపెక్టేషన్స్ కొంచెం కూడా రీచ్ కానీ ఈ చిత్రంలో దేని గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవటానికి లేదు.

సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం రెండు లోకాల్లో జరుగుతుంది. మొదటి లోకంలో అంటే మన భూలోకంలో ... అంతా స్వేచ్చామయం...ముఖ్యంగా స్త్రీ స్వేచ్చకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మధు బాలకృష్ణ(ఆర్య) అనే సాప్ట్ గా ఉండే వ్యక్తిని రమ్య(అనుష్క) ప్రేమించి వెంటపడుతుంది. అయితే మొదటి ఆమె ప్రేమను ఏక్సెప్టు చేయకపోయినా...తర్వాత మెల్లిగా ఆమె ప్రేమలో పడ్డ మధు..ఆమె వెనక పడతాడు. ప్రేమ కథ క్లైమాక్స్ కి వచ్చిందనగా కథ లో ఊహించని ట్విస్ట్ వస్తుంది.

ఇక రెండో లోకంలో జరిగే కథ విషయానికి వస్తే...అక్కడ పై లోకంలో జరిగే కథకు రివర్స్ లో జరుగుతంది. ప్రేమకు,స్వేచ్చకు అక్కడ చోటు ఉండదు. మహేంద్ర(మళ్ళీ ఆర్య) ... వర్ణ(మళ్లీ అనుష్క)ని ఇష్టపడి బలవంతంగానైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. అయితే వర్ణకు స్వేచ్చా జీవితం అంటే ఇష్టం..పెళ్లి చేసుకుని బానిసలా బతకాలని ఉండదు. దాంతో ఆమె ఈ ప్రపోజల్ కి ఇష్టపడదు. అప్పుడు ఆమెకు ఇష్టం లేకుండా ...మహేంధ్ర ఆమెను పెళ్లి చేసుకుంటాడు. దాన్ని ఆమె వ్యతిరేకించి వెళ్లిపోతుంది. ఇలా రెండు వేర్వేరు లోకాల్లో జరిగే రెండు విభిన్న కథలు...ఒక చోట ముడిపడి...మలుపు తిరుగుతాయి. ఇంతకీ ఆ రెండు కథలు కలిసే చోటు ఎక్కడ...రెండు ప్రేమ కథలు ఏ విధంగా ముగింపుకి వచ్చాయి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సింది.

సాధారణంగా కొత్త కథను పాత అంటే తెలిసిన నేరేషన్ లో చెప్తే...ప్రేక్షకులు కన్ఫూజ్ కారు అంటారు. అయితే ఈ సినిమా లో కథ కొత్తగా కాదు కానీ వింతగా ఉంటుంది. అప్పుడు కాస్త అర్దమయ్యే నేరేషన్ లో చెప్తే బాగుండేది. ఇక మొదటే చెప్పినట్లు ఈ చిత్రం కథ చాలా చిత్రాతి చిత్రంగా సాగుతుంది. దర్శకుడు ఏంగిల్ ఏంటో ఓ పట్టాన అర్దం కాదు...తన మానాన ప్రేక్షకుడుని పట్టించుకోకుండా కథని నేరేట్ చేసుకుంటూ పోతూంటాడు. ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో...ఎవరు ఎందుకు తమకు తోచినట్లు మాట్లాడుతూంటారో తెలియదు. సెల్వరాఘవన్ ఏదో అనుకుని ఏదో డెలవరి చేసారేమో అనిపిస్తుంది. అలాగే రెండో లోకంలో ఆర్య, అనుష్క తప్ప మన దేశం వారు ఎవరూ కనపడరు. చివరకు ఆర్య తల్లి తండ్రులు కూడా వేరే(జార్జియా కాబోలు) ఉంటారు. లక్కీగా అనుష్క కి తల్లి తండ్రిని పెట్టలేదు కాబట్టి ఆ డౌట్ రాదు. షూటింగ్ లొకేషన్ కి ఇక్కడ నుంచి జనాలని తీసుకెళ్లటం ఖర్చు అనుకున్నారో ఏమో కానీ విదేశీయులను పూర్తిగా వేరే లోకం చూపెడుతుంటే కొంచెం కూడా నమ్మబుద్ది కాదు.

మిగతా రివ్యూ..స్లైడ్ షో లో..

మొదట నుంచీ అవాంతరాలే..

మొదట నుంచీ అవాంతరాలే..


ఈ సినిమా ప్రారంభం రోజు నుంచి బ్యాడ్ సిగ్నల్సే రన్ అవుతూ వస్తున్నాయి. ఈ సినిమా మదట కార్తీ, సంధ్య లతో అనుకున్నారు. అంతకు ముందు దగ్గుపాటి రానా దగ్గరకు వచ్చింది. బడ్జెట్ సమస్యతో ముందుకు వెళ్లలేదు. తర్వాత ధనుష్, ఆండ్రియా అనుకున్నారు. అయితే ఇవేమీ కార్య రూపం దాల్చలేదు. చివరకు ఆర్య,అనుష్క లతో క్రేజీ ప్రాజెక్టుగా బారీగా చేసాడు. దాదాపు 16 నెలలు పాట కష్టపడి చేసిన ఈ చిత్రం బూడిదల పోసిన పన్నీరు గా మిగిలిపోయింది.
.

సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్

సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్

ఈ సినిమా నిర్మాతే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. బారీ బడ్జెట్ తో ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదని అర్దమవుతుంది. జార్జియా లొకేషన్స్ కూడా అదిరిపోయాయి.

పెద్ద మైనస్

పెద్ద మైనస్

ఈ సినిమాకు అతి పెద్ద మైనస్ స్క్రిప్టే.. ఎక్కడా కథలో కానీ,కథనం లో కానీ కానిస్టెన్సీ ఉండదు. క్యారెక్టర్స్ కూడా దర్శకుడు ఆడించినట్లు ఆడుతూంటాయి. దర్శకుడు అనుకున్న కాన్సెప్టు ఏదీ తెరపైకి పూర్తిగా రాలేదని,అందుకే అర్దం పర్దం లేకుండా పోయింద ని అర్దమవుతుంది. టైమ్ ట్రావిలింగ్, దేవత,అమ్మ వంటి అంశాలు మరీ దారుణంగా అర్దం కాకుండా పోయాయి.

ఆర్య వంటి నటుడు కూడా...

ఆర్య వంటి నటుడు కూడా...

ఆర్య మంచి నటుడు..హీరో గా కన్నా అతని నటన కే ఎప్పుడూ మంచి మార్కులు పడుతూంటాయి. అలాంటి ఆర్య కూడా ఈ సారి చాలా సీన్స్ లో తడబడ్డాడు. దానికి స్క్రిప్టే కారణం కావచ్చు. ఏ ఎమోషన్ పలికించాలో ..ఎందుకు ఆ సమయంలో ఆ ఎమోషన్ పండించాలో తెలియని సిట్యువేషన్ లో ఏం చేయలేక చాలా సీన్స్ లో బిక్కమొహం పెట్టుకుని నిలబడి పోయాడు

అనుష్క అరణ్య రోదన

అనుష్క అరణ్య రోదన

అనుష్క ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నట్లుంది. మొదటి నుంచి ఈ సినిమాకు ఓ రకమైన హైప్ ఇచ్చింది. ఎక్కువ డేట్స్ ఇచ్చి మరీ చేసిన ఈ చిత్రం కథ ఆమెకయినా అర్దం అయిందో లేదో అని డౌట్ వస్తుంది. అలాగే ఈ లోకం పాత్రలో ఆమె ఆహార్యం ఆంటీలాగ ఉన్నా బాగా చేసింది. ఇక ట్రైబుల్ పాత్ర దగ్గరకు వచ్చే సరికి మరీ దారుణంగా మారిపోయింది.

స్లో నేరేషన్, నో ట్విస్ట్ లు

స్లో నేరేషన్, నో ట్విస్ట్ లు

మన సౌత్ ప్రేక్షకులు ఆశించే ఎంటర్టైన్మెంట్ ఎక్కడా కనపడదు. దానికి తోడు సినిమా మొత్తం స్లోగా సాగుతూంటుంది. ఇక ప్రేక్షకుడుని రంజింప చేసే ట్విస్ట్ లు అయితే అయితే ఎక్కడా ఉండవు. ఉన్న ఏకైక ట్విస్ట్ చూసేవాడికి విరక్తి కలిగిస్తుంది.

సింహం గ్రాఫిక్స్ ...

సింహం గ్రాఫిక్స్ ...

ఈ సినిమాలో సింహాన్ని హీరో చంపాల్సి వస్తుంది. అది గ్రాఫిక్స్ సింహం. దాని మొహం మనుష్యులు ది గా ఉంటుంది. దాని బలం అతీతం. ఆ సింహం చాలా అసహ్యంగా ఉంటుంది. ఆ లోకంలో మనుష్యులు, వాళ్లు వేసుకునే డ్రస్ లు,ఆహారం అన్ని ఈ లోకంలా ఉన్నప్పుడు ఆ చిత్రమైన సింహం గోలేంటో అర్దం కాదు. చిన్నపిల్లకు కూడా టప్పట్లు కొట్టరు.

యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎమోషన్ మిస్..

యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎమోషన్ మిస్..

సాధారణంగా ఫైట్స్ వంటి యాక్షన్ ఎపిసోడ్స్ కు ప్రేక్షకులు విజిల్స్, టప్పట్లు ఎప్పుడు పడతాయి..అన్యాయాన్ని ఎదిరిస్తూ మనం చేయలేని పనిని తెరపై హీరో లేదా హీరోయిన్ చేసినప్పుడు ఆ ఎమోషన్ కి కనెక్టు అయ్యి...ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా అలాంటి వాతావరణం కనపడదు. ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది.

టెక్నికల్ గా...

టెక్నికల్ గా...


సినిమాటోగ్రఫి రామ్ జీ ఇచ్చింది చాలా పూర్ గా ఉంది. ముఖ్యంగా మరో ప్రపంచంలో చాలా షాట్స్ మరి గ్రాఫిక్స్ కోసం బ్లూ మ్యాట్ చేసినప్పుడు చాలా బ్లర్ అయిపోయాయి. ఎడిటింగ్ కూడా మరింత షార్ప్ గా చేస్తే ప్రేక్షకులను కొంత రక్షించిన వారు అవుతారు.

సంగీతం...

సంగీతం...

ఈ సినిమాకు అన్నీ కలిసి వస్తున్నాయి. హ్యారిశ్ జైరాజ్ వంటి సంగీత దర్శకుడు ఇచ్చిన పాటల్లో ఒకటీ బాగోలేదు. వాటి కొరియోగ్రఫీ అయితే మరింత నీరసంగా, విసుగెత్తి పారిపోయేలా చేసింది. అయితే అనిరుద్ ఇచ్చిన రీ రికార్డింగ్ మాత్రం సినిమాకు ప్లస్ అయ్యింది.

కార్టూన్ ఫిలింలా..

కార్టూన్ ఫిలింలా..

ఈ సినిమా ఆడియో పంక్షన్ లో దర్శకుడు మాట్లాడుతూ... తనని కార్టూన్ ఫిలిం చేసుకోమని ఈ కథని విమర్శించారని బాధ పడ్డారు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ సలహా ఇచ్చినవారి ఆలోచన కరెక్టే అనిపిస్తుంది. తక్కువ ఖర్చులో తెమిలిపోయేది కూడాను.

ఎవరెవరు

ఎవరెవరు

బ్యానరు: పీవీపీ సినిమా
నటీనటులు: ఆర్య,అనుష్క మిగతా పాత్రల్లో తమిళ నటులు.
ఛాయాగ్రహణం: రామ్‌జీ,
సంగీతం: హారిస్‌ జైరాజ్
పాటలు: చంద్రబోస్
నేపధ్య సంగీతం: అనిరుధ్‌
ఎడిటింగ్: కోలా భాస్కర్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీ రాఘవ

ఫైనల్ గా ఈ చిత్రం అనుష్క వీరాభిమానులు కూడా భరించటం కష్టమే అనిపిస్తుంది. గ్రాఫీక్స్ సైడ్ కూడా గొప్పగా లేదు కాబట్టి బుల్లి తెరపై ఈ సినిమాని ప్రోత్సహించటం బెస్ట్ అని చెప్పవచ్చు. అప్పటికీ ఈ సినిమాని ఎలాగయినా ఎంకరేజ్ చేయాలని ఫిక్స్ అయితే మీ విరోధులకు ఈ టిక్కెట్స్ ఇచ్చి పంపటం ద్వారా ఒకే దెబ్బకు మూడు పిట్టలు..మీరు సినిమాని ఎంకరేజ్ చేయటం, మీ పగవారకి విరక్తి కలగటం.. మీరు దీని నుంచి తెలివిగా తప్పించుకోవటం జరుగుతాయి.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

Read more about: anushka
English summary
Varna is dubbed version of Tamil movie Irandam Ulagam, it is an romantic fantasy movie released today with flop talk. Arya and Anushka Shetty playing the main lead roles. Aadavari Matalaku Ardhalu Verule movie fame director Sri Raghava directing this movie under PVP Cinema banner. The music is composed by Harris Jayaraj and cinematography is handled by Ramji.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu