Appudo Ippudo Eppudo Review: అప్పుడో ఎప్పుడో ఇప్పుడో మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.25/5
నటీనటులు: నిఖిల్ సిద్దార్థ్, దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వసంత్, అజయ్, జాన్ విజయ్, సత్య, సుదర్శన్, వైవా హర్ష తదితరులు
దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: నరసింహ చారీ చెన్నోజు, నరసబాబు, బీవీఎస్ఎన్ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్ః
ఎడిటర్: నవీన్ నూలి
మ్యూజిక్: కార్తీక్, సన్నీ ఎంఆర్
బ్యానర్: ఎస్‌వీసీసీ, హైవే పిక్చర్స్ లిమిటెడ్, ఎల్ఎల్‌వీ
రిలీజ్ డేట్: 2024-11-08
లండన్‌లో ఉండే రిషి (నిఖిల్ సిద్దార్థ్) ఫార్ములా వన్ తరహా రేసింగ్‌లో కారు డ్రైవర్ రాణించాలనే కోరికతో ఉంటాడు. ముందు తార (రుక్మిణి వసంత్)ను ప్రేమిస్తాడు. ఆ తర్వాత లండన్‌లో ప్రమాదంలో ఉన్న తులసి (దివ్యాంశ కౌశిక్) రక్షించడమే కాకుండా ఆమెకు దగ్గరై ప్రేమలో పడుతాడు. ఆమె పీకల్లోతు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. తీరా పెళ్లీపీటల మీద నుంచి తులసి చెప్పపెట్టకుండా జంప్ అయి మోసగిస్తుంది. ఆ తర్వాత మళ్లీ రుక్మిణికి రిషి దగ్గరవుతాడు. ఇద్దరి ప్రేమలో ఇరుక్కుపోయిన రిషిని బద్రినాథ్ అలియాస్ బద్రి (జాన్ విజయ్) తన గ్యాంగ్‌తో వెంటాడుతుంటాడు.

తారను ఏ పరిస్థితుల్లో రిషి కాపాడాడు? అసలు తార ఎవరు? పెళ్లి మంటపం వద్ద రిషిని వదిలేసి ఎందుకు వెళ్లింది? మరోసారి రిషి జీవితంలోకి తార, తులసి ఎందుకు వచ్చారు. అసలు బద్రినాథ్ ఎవరు? తారను, రిషిని ఎందుకు వెంటాడుతున్నాడు? తారతో బద్రి పార్ట్‌నర్ (అజయ్) ఆడిన గేమ్ ఏమిటి? ఈ గేమ్ నుంచి రిషి ఎలా బయటపడ్డాడు అనే ప్రశ్నలకు సమాధానమే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ కథ.
స్వామిరారా లాంటి హిట్స్ ఇచ్చిన సుధీర్ వర్మపై అంచనాలు పెట్టుకొని వెళితే.. కార్తీకేయ 2 మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన నిఖిల్ సిద్దార్థ్‌తో కలిసి ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకొన్నాడో అర్ధం కాదు. బేసిగ్గా కథ లేకుండానే క్యారెక్టర్లతో మైండ్ గేమ్ ఆడించాలనే ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పాలి. అక్కడక్కడ కొన్ని సీన్లు ఫర్వాలేదనిపిస్తాయి. కానీ ఓవరాల్‌గా మూవీ డిజాపాయింట్ చేసిందనే చెప్పొచ్చు.

ఇక కార్ రేసింగ్ డ్రైవర్‌గా ఈ పాత్ర నిఖిల్‌కు ఉపయోగపడిందేమీ లేదనే చెప్పాలి. ఈ సినిమా ద్వారా కొత్తగా అనుభూతి పంచారా? అదే కనిపించదు. రొటీన్ డ్రామా, పేలవమైన స్క్రీన్ ప్లే కారణంగా రిషిగా నిఖిల్ తనకు తోచిన విధంగా ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. ఇద్దరు అందాల భామలు దివ్యాంశ కౌశిక్ గ్లామరతో అలరిస్తే.. సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి నిరాశపరిచిందనే చెప్పాలి.
సాంకేతిక అంశాలు విషయానికి వస్తే.. అంతగా గొప్పగా ఏమీ కనిపించవు. సినిమాటోగ్రాఫర్ పనితీరు బాగున్నా.. కథలో సన్నివేశాల్లో దమ్ము లేకపోవడం వల్ల ఆయన శ్రమ కూడా వృథా అయిందనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ ఫర్వాలేదనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ క్లాస్, రిచ్‌గా కనిపించాయి. కానీ సినిమాకు పెద్దగా ఉపయోగపడుతాయా? అంటే అదీ కష్టమే.

ఓవరాల్‌గా.. క్లాసీగా ఈ తరం ఆడియెన్స్‌కు నచ్చే నావెల్టీ ఈ కథలో ఉన్నా.. స్క్రిప్టుపరంగా ఆ ప్రయత్నం చేసినట్టు కనిపించదు. ఏ సమయంలో కూడా వేగంగా, ఉత్కంఠగా మూవీలో సన్నివేశాలు ఉన్నట్టు అనిపించదు. ఏదో మూవీ నడుస్తుందనే ఫీల్‌తో చూడాల్సిందే. అలాగే సత్య, సుదర్శన్, వైవా హర్ష కామెడీ కూడా పండకపోవడం మరో మైనస్. నిఖిల్ కెరీర్‌లో అప్పుడో.. ఎప్పుడో వచ్చిపోయిన సినిమాగానే చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











