twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    AR Rahman's 99 Songs మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: ఇహాన్ భట్, ఎడిసీ వర్గాస్, మనీషా కోయిరాలా, వారినా హుస్సేన్, లీసా రే
    Director: విశ్వేష్ కృష్ణమూర్తి

    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విశ్వేష్ కృష్ణమూర్తి
    కథ, నిర్మాత, మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
    రచయితలు: హుస్సేన్ దలాల్ (హిందీ), గౌతమ్ మీనన్ (తమిళం), కిరణ్ (తెలుగు)
    సినిమాటోగ్రఫి: తనయ్ సతమ్, జేమ్స్ కౌలీ
    ఎడిటింగ్: అక్షయ్ మెహతా, శ్రేయాస్ బెల్టాంగ్డీ
    బ్యానర్: ఐడియల్ ఎంటర్‌టైన్‌మెంట్, వైఎమ్ మూవీస్
    రిలీజ్: 2021-04-16

    99 సాంగ్స్ కథ ఏమిటంటే

    99 సాంగ్స్ కథ ఏమిటంటే

    మ్యూజిక్ జీవితాన్ని నాశనం చేస్తుందనే తండ్రి హెచ్చరికలు, బెదిరింపులను పక్కన పెట్టి సంగీతమే సర్వస్వంగా జయ్ (ఇహాన్ భట్) బతుకుతుంటాడు. సోఫియా సింఘానియా (ఎడిల్సీ వర్గాస్)తో ప్రేమలో పడుతాడు. సోఫియా తండ్రి సింఘానియా (రంజిత్ బారట్) ఇహాన్ భట్ ప్రేమను వ్యతిరేకిస్తాడు. సంగీతంతో ప్రపంచాన్ని మార్చేయాలనుకొంటున్న జయ్‌కి సవాల్ విసరుతాడు. నా కూతురును పెళ్లి చేసుకోవడానికి ముందు 100 పాటలకు కంపోజ్ చేయమని సవాల్ విసురుతాడు.

    మూవీలో మలుపులు ఇలా

    మూవీలో మలుపులు ఇలా

    బిజినెస్‌మ్యాన్ సింఘానియా విసిరిన సవాల్‌ను జయ్ ఎలా స్వీకరించాడు? 100 పాటలను పూర్తి చేయడానికి జయ్ ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? షిల్లాంగ్‌లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. డ్రగ్స్ కేసులో జయ్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? డ్రగ్ ఎడిక్ట్ అయ్యారనే ఆరోపణలతో జయ్‌ను హాస్పిటల్‌లో ఎందుకు చేర్పించారు? 99 పాటలు చేసిన తర్వాత 100 పాటకు స్పూర్తి ఏమిటి? తన తల్లి (వారినా హుస్సేన్) జీవితంలో జరిగిన విషయాలు జయ్‌కి ఎలా తెలిసాయి? 100వ పాట కోసం తల్లి నుంచి ఎలాంటి స్పూర్తిని తీసుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే 99 సాంగ్స్‌ సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

    99 సాంగ్స్ మూవీ విషయానికి వస్తే.. తొలి భాగం చాలా నీరసంగా, నిస్తేజంగా సాగుతుంది. జయ్‌కి సింఘానియా విసిరే ఛాలెంజ్, ఫ్రెండ్స్‌తో డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోవడం, తన సహచర గాయని (లీసారే) యాక్సిడెంట్‌లో మరణించడం అలాంటి అంశాలు కథలో కొంచెం చలనం కలిగించాయనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత కూడా కథనంలో ఎలాంటి వేగం పుంజుకొన్నట్టు కనిపించదు. తొలి భాగం సాదాసీదాగా ముగుస్తుంది.

     సెకండాఫ్‌లో ఎమోషనల్ పాయింట్స్

    సెకండాఫ్‌లో ఎమోషనల్ పాయింట్స్

    ఇక సెకండాఫ్‌లో కొన్ని ఫీల్ గుడ్ అంశాలు ప్రేక్షకుడిని థ్రిల్ గురి చేస్తాయి. మనీషా కోయిరాలతో ఇహాన్‌కు ఉన్న కొన్ని ఎపిసోడ్స్ ఆకట్టుకొనేలా ఉంటాయి. అలాగే తన తల్లికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు కీలకంగా మారుతుంది. చివర్లలో కథను దర్శకుడు విశ్వేష్ కృష్ణమూర్తి డీల్ చేసిన విధానం ప్రేక్షకుడిని సంతృప్తి పరిచేలా ఉంటుంది. పూర్తిస్థాయిలో దర్శకుడిగా విశ్వేష్ కృష్ణమూర్తి ఆకట్టుకోలేకపోయాడనే చెప్పవచ్చు.

    నటీనటులు పెర్ఫార్మెన్స్

    నటీనటులు పెర్ఫార్మెన్స్

    99 సాంగ్స్‌ మూవీలో ఇహాన్ భట్ పాత్ర తప్పితే మరే ఇతర క్యారెక్టర్లు ఏ మాత్రం ఆకట్టుకొనేలా ఉండవు. మనీషా కోయిరాలా, లీసారే, వారినా హుస్సేన్ పాత్రలు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. కథలో కీలకంగా మారే హీరోయిన్ ఎడిసీ వర్గాస్ పాత్ర కూడా బలంగా కనిపించదు. నటనకు కొత్తవాడైనా కీలక సన్నివేశాల్లో ఇహాన్ భట్ ఆకట్టుకొన్నాడు. కథలో మరో కీలక పాత్ర, జయ్ తండ్రికి అనుచరుడిగా కనిపించిన రాహుల్ రామ్ ఫర్వాలేదనిపించాడు.

    ఏఆర్ రెహ్మాన్ గురించి

    ఏఆర్ రెహ్మాన్ గురించి

    గత దశాబ్దాలుగా తన సంగీతంతో ప్రేక్షకులను, సంగీత అభిమానులును విశేషంగా ఆకట్టుకొంటున్న ఏఆర్ రెహ్మాన్ 99 సాంగ్స్‌ సినిమాతో నిర్మాతగా, రచయితగా మారారు. రిరీకార్డింగ్ పరంగా ఆయన ఆకట్టుకొన్నారు. పాటల పరంగా జ్వాలా ముఖి, ఆకాశ తారలతో, పూవా మల్లే పూసేవా పాటలు ఆకట్టుకొనేలా ఉంటాయి.

    సాంకేతిక అంశాలు గురించి

    సాంకేతిక అంశాలు గురించి

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. తనయ్ సతమ్, జేమ్స్ కౌలీ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ప్రేక్షకుడికి సన్నివేశాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఎడిటింగ్ పరంగా ఇంకా కొంత వర్కవుట్ చేయాల్సి ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. రచయితగా రెహ్మాన్ విషయానికి వస్తే కథలో కొన్ని లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. యాక్సిడెంట్లకు సంబంధించిన కథాపరమైన వివరణ ఎక్కడా కనిపించదు. ఇలాంటివన్నీ పక్కన పెడితే నిర్మాణ పరంగా ఉన్నత విలువలు పాటించారు.

    Recommended Video

    Prabhas Radhe Shyam Surprise on the occasion of Ugadi | Filmibeat Telugu
    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    99 సాంగ్స్‌ చిత్రం సగటు ప్రేక్షకుడి అభిరుచికి దూరంగా ఉన్నట్టు కనిపించే ఉన్నత విలువలతో కూడిన చిత్రం. మ్యూజిక్, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో సినిమాను రూపొందించారు. కానీ కథ, కథనాల పరంగా జాగ్రత్తలు తీసుకోకపోవడం సినిమాకు మైనస్‌గా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కనీస ముఖ పరిచయం లేని నటీనటులు ఉండటం మరో మైనస్ అని చెప్పవచ్చు. ఏఆర్ రెహ్మాన్ అభిమానులు, క్లాసికల్ లవ్‌స్టోరీలను ఆదరించే ప్రేక్షకులకు, మల్టీప్లెక్స్ ఆడియెన్స్ నచ్చే విధంగా 99 సాంగ్స్ మూవీ రూపొందిందని చెప్పవచ్చు. ఓవరాల్‌గా అన్ని వర్గాలకు కాకుండా కొన్ని వర్గాలకు చేరే విధంగా 99 సాంగ్స్ ఉందనే విషయాన్ని స్పష్టంగా తెర మీద కనిపిస్తుంది.

    English summary
    99 Songs is a musical romance film directed by Vishwesh Krishnamoorthy, and co-written and produced by A. R. Rahman. The film co-produced by Ideal Entertainment and distributed by Jio Studios, stars debutants Ehan Bhat and Edilsy Vargas in lead roles, alongside Aditya Seal, Lisa Ray and Manisha Koirala among others portray supporting characters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X