Arangetram Review ట్విస్టులతో సాగే సైకో థ్రిల్లర్.. అరంగేట్రం మూవీ ఎలా ఉందంటే?

Rating: 2.5/5

నటీనటులు: శ్రీనివాస్ ప్రభన్, పూజా, లయ, రోషన్, ముస్తఫా అస్కరి, తిరుపతి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస ప్రభన్
నిర్మాత: మహేశ్వరి
సహ నిర్మాత: విజయలక్ష్మీ
మ్యూజిక్ డైరెక్టర్: గిడియన్ కట్టా
సినిమాటోగ్రఫి: బురాన్ షా
ఎడిటర్: మధు
స్టంట్స్: స్టార్ మల్లి
ఆర్ట్: సురేష్ ఆర్
కో - డైరెక్టర్ , ప్రొడక్షన్ డిజైనర్ : రమేష్ బాబు (చిన్నా)
బ్యాన‌ర్‌: మ‌హి మీడియా వ‌ర్క్స్
రిలీజ్ డేట్: 2023-05-05

మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రభన్ (శ్రీనివాస ప్రభన్) పెయింటర్. ప్రతీ నెల అజయ్ అనే ఓ సైకో (ముస్తాఫ అస్కరి) ఎడమ చేతి వాటం కలిగిన అమ్మాయిని చంపేస్తుంటాడు. ఈ క్రమంలో వైష్ణవి అనే అమ్మాయిని చంపడానికి సైకో ప్లాన్ చేస్తాడు. హత్యలు చేయకుండా అజయ్‌ను పట్టుకొనేందుకు పోలీసులు వెంటాడుతుంటారు. ఆ క్రమంలో వైష్ణవి ఇంటిలో మరో నలుగురితో కలిసి సైకోను ప్రభన్ కలుస్తాడు.

Arangetram

వైష్ణవి ఇంటిలో ప్రభన్, మరో నలుగురు సైకోను ఎందుకు కలిశారు? ఆ ఇంటిలో ఉన్న ప్రభన్, మరో నలుగురిని సైకో బంధించి ఏం చేశాడు? ఇంట్లో ఉన్న ఆ నలుగురు ఎవరు? వైష్ణవినే సైకో అజయ్ ఎందుకు చంపాలని అనుకొన్నాడు? సైకో హత్యలను పోలీస్ ఆఫీసర్ లయ అడ్డుకొన్నదా? ప్రభన్ లైఫ్‌లోకి వచ్చిన ప్రియురాలు మేఘన కథ ఏమిటి? సైకో, ప్రభన్ పరిస్థితి చివరకు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే అరంగేట్రం సినిమా కథ.

సైకో చేసే మర్డర్‌తో అరంగేట్రం సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ప్రభన్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తూ ఏసీ రిపేరర్ (అనిరుధ్)తో నడిపిన డ్రామా బాగుంది. ఆ ఇంటిలో నలుగురు వ్యక్తులను బంధించి సైకోను ట్రాప్ చేసే అంశం సినిమాలో మంచి ట్విస్టుగా కనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సైకో అజయ్ ఫ్లాష్ బ్యాక్, అలాగే ప్రభన్ లవ్ స్టోరి భావోద్వేగానికి గురిచేస్తాయి. క్లైమాక్స్‌ను డీల్ చేసిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది.

Arangetram Review

సైకో నేపథ్యంగా సాగే అరంగేట్రం మూవీలో మర్డర్ మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను చక్కగా దర్శకుడు డిజైన్ చేసుకొన్నాడు. ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో రాసుకొన్న పాయింట్‌ను దర్శకుడు ప్రభన్ విస్తరించిన తీరు చాలా బాగుంది. కథకు తగినట్టుగా సాంకేతిక అంశాలను బలంగా సమకూర్చుకోవడం ఈ సినిమాకు మరింత పాజిటివ్‌గా మారింది.

శ్రీనివాస్ ప్రభన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతల్ని మోయడమే కాకుండా ప్రభన్ అనే కీలక పాత్రను పోషించి సినిమా భారాన్ని మొత్తం తానే మోయడం ఈ సినిమాకు విశేషంగా మారింది. ప్రభన్ నటనపరంగా తడబాటు గురైనప్పటికీ.. దర్శకుడిగా కథను పరుగులు పెట్టించాడు. మేఘనగా పూజా ఈ సినిమాకు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా నిలిచింది. గ్లామర్ పరంగానే కాకుండా మంచి నటనను ప్రదర్శించింది.

ఇక సైకో అజయ్ పాత్రలో నటించిన ముస్తాఫా అస్కరీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. విలన్ పాత్రలో ముస్తాఫా అస్కరీ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. ఫ్లాష్ బ్యాక్‌లో చిన్నప్పటి అజయ్ పాత్రను మాస్టర్ రోషన్ అద్బుతంగా చేశాడు. వయసుకు మించిన పరిణితిని తన పాత్రలో చూపించాడు. ఈ సినిమాలో నటించిన మిగితా వారందరూ తమ పాత్రల పరిథి మేరకు రాణించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. అరంగేట్రం సినిమాకు మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. గిడియన్ కట్టా రీరికార్డింగ్ సన్నివేశాలను మరింత బలంగా మార్చింది. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే పాట చాలా బాగుంది. ఈ సినిమాకు ఎడిటింగ్ మరో ఎట్రాక్షన్. సన్నివేశాలను సాఫీగా సాగేలా ఎడిటర్ తన ప్రతిభను చాటుకొన్నాడు. బురాన్ షా సినిమాటోగ్రఫి సినిమాను రిచ్‌గా మార్చింది. ఆర్ట్, ఇతర విభాగాలు తమ పరిధి మేరకు సినిమాకు ప్లస్ అయ్యారని చెప్పవచ్చు.

ట్విస్టులు, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సాగే అరంగేట్రం లాంటి కథను నమ్మిన తీరు చూస్తే.. నిర్మాత మహేశ్వరికి సినిమాపై వారికి ఉండే అభిరుచిని, ఫ్యాషన్‌ను తెలియజెప్పింది. సన్నివేశాలను, సినిమాను నిర్మించిన తీరు చూస్తే.. ఎక్కడా రాజీ పడలేదనే విషయం తెలుస్తుంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో సినిమాను ఆసక్తికరంగా మలిచారని చెప్పవచ్చు. స్టార్ వ్యాల్యూస్‌తో తీసి ఉంటే అరంగేట్రం మరింత పెద్ద సినిమా అయి ఉండేదనిస్తుంది. రమేష్ బాబు చిన్నం ప్రొడక్షన్‌ను డిజైన్ చేసిన విధానం బాగుండటమే కాకుండా ఈ సినిమాకు కో డైరెక్టర్‌గా వ్యవహరించారు.

మర్డర్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో సాగే సైకో బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన చిత్రం అరంగేట్రం. నూతన నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. సాంకేతిక విభాగాల పనితీరు అరంగేట్రం మూవీని మరింత మెరుగుపరిచింది. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. కొత్తవారు చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. లాజిక్స్ లేకుండా చూస్తే సినిమా మంచి అనుభూతిని పంచుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూసిన ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X