For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rana Daggubati's అరణ్య మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  రేటింగ్: 2.75/5
  నటీనటులు: రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పిలగావోంకర్, రఘుబాబు, అనంత్ మహాదేవన్ తదితరులు
  కథ, డైరెక్షన్: ప్రభు సాల్మన్
  డైలాగ్స్: వనమాలి
  మ్యూజిక్: శంతను మోయిత్రా
  సినిమాటోగ్రఫి: ఏఆర్ అశోక్ కుమార్
  ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
  బ్యానర్: ఎరోస్ ఇంటర్నేషనల్
  రన్‌టైమ్: 150 నిమిషాలు
  రిలీజ్ డేట్: 2021-03-26

  అరణ్య కథ

  అరణ్య కథ

  నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య (రానా దగ్గుబాటి) విశాఖకు సమీపంలోని అటవీ ప్రాంతానికి సంరక్షుడిగా వ్యవహరిస్తుంటాడు. అయితే జంతువులు స్వేచ్ఛగా తిరిగే దట్టమైన అడవిలో డీఎల్ఆర్ టౌన్‌షిప్‌ను నిర్మించాలనే లక్ష్యంతో మంత్రి కనకమేడల రాజగోపాల్ (అనంత్ మహాదేవన్) ప్రయత్నాలు మొదలుపెడుతాడు. మంత్రి ప్రయత్నాలకు అడ్డు తగిలిన అరణ్యను మతిస్థిమితం లేదనే కారణం చూపి జైల్లో వేస్తారు.

  అరణ్య మూవీలో ట్విస్టులు

  అరణ్య మూవీలో ట్విస్టులు

  విలువైన వృక్ష సంపద, అరుదైన జంతుజాలం ఉన్న అటవికి సంరక్షుడిగా అరణ్య ఎందుకు ఉన్నాడు? అసలు నరేంద్ర భూపతి పేరు అరణ్యగా ఎందుకు మారింది. అరణ్యను జైల్లో వేసిన తర్వాత అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులు, గ్రామస్థుల పరిస్థితి ఏమిటి? చివరకు మంత్రి రాజగోపాల్ తాను అనుకొన్న లక్ష్యాన్ని సాధించాడా? పర్యావరణానికి విరుద్ధమైన డీఎల్ఆర్ టౌన్‌షిప్‌ను ఆపడానికి అరణ్య ఎలాంటి దీక్షను చేపట్టాడు. ఈ వివాదంలో ప్రధాని జోక్యం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే అరణ్య సినిమా కథ.

  తొలి భాగం పరిస్థితి ఏమిటంటే

  తొలి భాగం పరిస్థితి ఏమిటంటే

  దేశంలోని వివిధ ప్రాంతాల్లో అటవీ సంపదను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్న కార్పోరేట్, రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలను ఆధారంగా చేసుకొని అరణ్యను రూపొందించారు. ఏనుగులు, సింహాలు, ఇతర పక్షులను కథలో భాగం చేసి సినిమా తొలిభాగాన్ని ఫీల్‌గుడ్‌గాను, ఎమోషనల్‌గా మార్చారు. అయితే కథలో నక్సలైట్ల ఎపిసోడ్‌ను సినిమాకు అతికించినట్టుగా అనిపిస్తుంది. కథలో వారి ప్రాధాన్యత ఏమిటో సరిగా చెప్పలేకపోవడం ఓ మైనస్. కాకపోతే సినిమాటోగ్రఫి లాంటి సాంకేతిక విలువలు, రానా పెర్ఫార్మెన్స్ తొలి భాగాన్ని ఫీల్‌గుడ్‌గా మార్చారు.

  సెకండాఫ్‌ ఎలా ఉందంటే..

  సెకండాఫ్‌ ఎలా ఉందంటే..

  ఇక సెకండాఫ్‌లో ఏనుగు చనిపోయే ఎపిసోడ్‌తో కథ మరో లెవెల్‌కు వెళ్తుందని ఊహించిన వారి ఉత్సాహంపై దర్శకుడు చప్పున నీళ్లు చల్లాడనిపిస్తుంది. అంతేకాకుండా సింఘ (విష్ణు విశాల్) పాత్రను అర్ధాంతరంగా కనుమరుగయ్యేలా చేయడం కొంత అసహనంగా అనిపిస్తుంది. ఇక అరుంధతిగా రిపోర్టర్ పాత్రను పోషించిన శ్రీయ పిల్గాంకర్ పాత్ర ఏమిటో ఎవరికీ అర్ధం కాదు. ఫోటోలు, వీడియోలు తీయడం వరకే సరిపోయింది. ప్రధాని సమాచారం చేయడమనే నాసిరకం ఐడియాతో పాత్రకు జస్టిఫికేషన్ చేశాడనిపిస్తుంది. చివరి 20 నిమిషాలు నడిచే డ్రామా సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చింది.

  దర్శకుడు ప్రభు సాల్మన్ ప్రతిభ

  దర్శకుడు ప్రభు సాల్మన్ ప్రతిభ

  దర్శకుడు ప్రభు సల్మాన్ ఎత్తుకొన్న పాయింట్ సభ్య సమాజాన్ని ఆలోచింప చేసేలా ఉంటుంది. కానీ ఆ కథను సరైన పంథాలో నడిపించుకోవడానికి చేసిన ఎత్తుగడ ఆకట్టుకోలేకపోయింది. కథలో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయనే అనిపించేంతలోపే మరో నాసిరకమైన సీన్ ఆ ఫీలింగ్‌ను చల్లబరుస్తుందనే ఫిలింగ్ కలుగుతుంది. ఏది ఏమైనా ఒక సందేశాన్ని ప్రజలకు, సమాజానికి అందించిన తీరుకు అభినందించాల్సిందే. రానాను సరికొత్తగా చూపించడంలో సఫలమయ్యాడని చెప్పవచ్చు. కథకు అవసరమైన బలమైన పాత్రలు లేకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారిందని చెప్పవచ్చు.

  రానా దగ్గుబాటి సరికొత్తగా

  రానా దగ్గుబాటి సరికొత్తగా

  అరణ్యగా రానా దగ్గుబాటి నటన తెరపై సరికొత్తగా అనిపిస్తుంది. ఎన్‌బీటీ‌లో ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లిన సమయంలో వచ్చే యాక్షన్ సీన్‌లో రానా చెలరేగిపోయాడనిపిస్తుంది. కథ, సన్నివేశాల్లో సరకు ఉన్నంత వరకు రానా తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. క్లైమాక్స్‌లో ఆయన నటన మరోస్థాయిలో ఉంటుంది. రానా కెరీర్‌లో ఓ మంచి అటెంప్ట్ అని చెప్పవచ్చు.

  సపోర్టింగ్ క్యారెక్టర్స్ గురించి

  సపోర్టింగ్ క్యారెక్టర్స్ గురించి

  శ్రియ, విష్ణు విశాల్, అనంత్ మహదేవన్ పాత్రలు కథలో భాగంగా కొనసాగుతాయే తప్ప బలంగా ప్రభావం చూపించిన దాఖలాలు కనిపించవు. పాన్ ఇండియా మూవీ కావడం వల్ల నటీనటులు తెలుగు ప్రేక్షకులకు తెలియని వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. వారి నటనకు, పాత్రలకు కనెక్ట్ కావడం కాస్త కష్టమే అనే ఫీలింగ్ కలుగుతుంది. రఘుబాబు ఫర్వాలేదనిపించారు. రవి కాలే లాంటి కొన్ని సీన్లలో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఫుల్ మార్కులు కొట్టేశారు. ప్రతీ సీన్‌ను అందమైన కాన్వాస్‌లో మార్చారని చెప్పవచ్చు. శంతను రీరికార్డింగ్ చాలా సీన్లు హైలెట్ కావడానికి ఉపయోగపడింది. ఎడిటర్ భువన్ శ్రీనివాస్ ఒకే అనిపించారు. ఎరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  రానా దగ్గుబాటి
  సినిమాటోగ్రఫి
  రీరికార్డింగ్
  కాన్సెప్ట్

  మైనస్ పాయింట్స్
  విలనిజం, సపోర్టింగ్ యాక్టర్స్
  పూర్తిస్థాయిలో ఎమోషన్స్ పండకపోవడం

  Recommended Video

  Rana Daggubati చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న Yasaswi Kondepudi | Sarigamapa Finale
  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  పర్యావరణం, జంతు సంరక్షణ, మానవీయ విలువలను చాటిచెప్పే చిత్రంగా అరణ్య రూపొందింది. పిల్లలు, కుటుంబంతోపాటు చూడదగిన చిత్రమే అనిచెప్పవచ్చు. కాకపోతే కథా, కథనాలపరంగా, పాత్రల తీరుతెన్నుల, ఇతర లోపాలు సినిమాకు ప్రతీకూలంగా మారాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే కమర్షియల్‌గా మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది.

  English summary
  Tollywood hunk Rana Daggubati latest movie Aranya released on March 26th. Rana Daggubati, Vishnu Vishal, Pulkit Samrat, Zoya Hussain, Shriya Pilgaonkar, Anant Mahadevan are in lead roles. Produced by Eros International, Directed by Prabhu Solomon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X