For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అరవింద సమేత తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |
  Aravinda Sametha Movie Review అరవింద సమేత సినిమా రివ్యూ

  Rating:
  3.5/5
  Star Cast: ఎన్టీ రామారావు, పూజా హెగ్డే, ఇషా రెబ్బా, జగపతి బాబు, సునీల్, సుప్రియా పాథక్
  Director: త్రివిక్రమ్ శ్రీనివాస్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న అరవింద సమేత.. వీర రాఘవ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్ రూపొందించిన గత చిత్రం ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడం ఓ వైపు. జైలవకుశ విజయంతో ఎన్టీఆర్ ఓ ఊపులో ఉండటం ఈ సినిమా ఎలా ఉంటుందో అనే విషయం మరింత ఆసక్తిని పెంచింది. పూజా హెగ్డే, ఇషా రెబ్బా గ్లామర్ పాత్రల్లో, సితార, బాలీవుడ్ నటి సుప్రియా పాథక్ భావోద్వేగమైన పాత్రలో కనిపించడం ప్రేక్షకుల్లో మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. జగపతిబాబు, సునీల్ పాత్రలపై భారీగానే చర్చ జరిగింది. ఇలాంటి బలం, ప్రత్యేకతతో అక్టోబర్ 11న అరవింద సమేత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకొందో అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  అరవింద సమేత కథ

  రాయలసీమలోని ఓ గ్రామంలో బసిరెడ్డి (జగపతిబాబు), నారపరెడ్డి (నాగబాబు) కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఫ్యాక్షన్ ఉంటుంది. నారపరెడ్డి కుమారుడు వీర రాఘవరెడ్డి (ఎన్టీఆర్( విదేశాలకు వెళ్లి స్వగ్రామానికి వచ్చిన సమయంలో జరిగిన దాడుల్లో నారపరెడ్డి చనిపోతాడు. తండ్రి మరణంతో పుట్టెడు దు:ఖంలో మునిగిన వీర రాఘవరెడ్డికి నాన్నమ్మ (సుప్రియా పాథక్) శాంతి మంత్రాన్ని ఉపదేశం చేస్తుంది. దాంతో ఫ్యాక్షన్ గొడవకు ముగింపు పలకాలని రాఘవరెడ్డి నిర్ణయం తీసుకొంటాడు. చివరకు రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలకు ముగింపు పలికే విషయంలో వీర రాఘవరెడ్డి ఎలా సఫలమయ్యాడు? అందర్ని ఎలా మెప్పించాడు అనేది చిత్ర కథ.

  అరవింద సమేత ట్విస్టులు

  అరవింద సమేతలో హైదరాబాద్‌లో ఫ్యాక్షన్ గొడవలపై రీసెర్చ్ చేసే అరవింద (పూజా హెగ్డే)కు వీర రాఘవరెడ్డికి మధ్య ఎలా ప్రేమ పుట్టింది. బసిరెడ్డి, నారపరెడ్డిల మధ్య జరిగిన ఐదు రూపాయాల ఫ్యాక్షన్‌‌కు అసలు కారణమేంటి? రాయలసీమలో కక్షలు, పగ, ప్రతీకారానికి ముగింపు పలకడానికి వీర రాఘవ రెడ్డి ఎలాంటి ఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే అరవింద సమేత.. వీర రాఘవ సినిమా.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  అరవింద సమేత సినిమా హైఎండ్ ఇంటన్సిటీతో త్రివిక్రమ్ స్టయిల్‌కు విరుద్ధంగా ప్రారంభమవుతుంది. మొదటి 20 నిమిషాలు త్రివిక్రమ్ తన టేకింగ్‌తో అల్లాడించేస్తాడు. ఎన్టీఆర్ ఎనర్జీని చక్కగా వాడుకొని ప్రేక్షకుడికి చక్కటి అనుభూతిని కలిగించేలా మొదటిభాగాన్ని తీర్చిదిద్దాడు. ముఖ్యంగా ఆకు తిను.. పోక తిను లాంటి సున్నితమైన హాస్యాన్ని అందిస్తూనే కథలోని తీవ్రతను గురి తప్పకుండా ముందుకు తీసుకెళ్లాడు. స్కూల్‌లో ఓ పిల్లాడిని రక్షించే ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ సత్తాను మరోసారి చూపించి ఇంటర్వెల్ బ్యాంగ్ వేసేశాడు త్రివిక్రమ్.

  సెకండాఫ్ అనాలిసిస్

  ఇక సమరమే అనే ఇంటర్వెల్‌ కార్డుతో యాక్షన్ మూడ్‌లో వెళ్లిన ప్రేక్షకుడికి డిఫరెంట్ ట్రీట్‌మెంట్‌ను అందించాడు. ఊహించని విధంగా మాస్, మసాలను పక్కన పెట్టి కథ, కథనాలనే నమ్మకొన్నాడు. సెకండాఫ్‌లో ఎమోషనల్ కంటెంట్‌కు పెద్ద పీట వేయడం సినిమా డిఫరెంట్ అనే ముద్ర పడింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే రావు రమేష్ ఎపిసోడ్‌తో ప్రతీ సన్నివేశానికి సినిమా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్లింది. ఇక ప్రీ క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే రెండు ఎపిసోడ్‌లు చూస్తే త్రివిక్రమ్‌లో కొత్త దర్శకుడు కనిపిస్తాడు. ఓవరాల్‌గా రెండో భాగం భావోద్వేగాలు ప్రేక్షకుడి గుండె తడిని టచ్ చేస్తాయి.

  త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్

  ఒక్క ఫ్లాప్‌తో సత్తా తగ్గుతుందని అనుకొంటే పొరపాటే అనే విధంగా అరవింద సమేతను త్రివిక్రమ్‌ తెరకెక్కించాడు. ప్రతీ ఫ్రేమ్‌లో ఓ కసి కనిపిస్తుంది. ఫ్యాక్షన్ దాడి అనంతరం కారులో ఎన్టీఆర్ నటనను ఎలివేట్ చేసిన విధానం, సుప్రియా, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్లు, ఇషా రెబ్బాతో భార్యలు పడే బాధను చెబుతూ పెనిమిటి పాటను చిత్రీకరించిన తీరు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఇక సెకండాఫ్‌లో రావు రమేష్ సీను, బసిరెడ్డి కుమారుడితో మాట్లాడే సన్నివేశం, క్లైమాక్స్‌లో జగపతిబాబుతో వాగ్వాదం, క్లైమాక్స్‌లో ఈశ్వరీభాయ్ ఎపిసోడ్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. పాలిచ్చే వాళ్లకు పాలించడం తెలియదా? యుద్ధం చేసే సత్తాలేని వాడికి శాంతి గురించి మాట్లాడే హక్కులేదు అనే డైలాగ్స్ ఆలోచింపచేస్తాయి.

  ఎన్టీఆర్ నటనా ప్రతిభ

  ఎన్టీఆర్ నటనకు అరవింద సమేత చిత్రం మరో గీటురాయి. ఎన్టీఆర్‌లో మరొక్క మారు పరిణితి చెందిన నటుడు కనిపిస్తాడు. పాటల్లో ఎప్పటి మాదిరి స్టయిలే కనిపించినా.. యాక్షన్ల సీన్లలో కొత్తరకమైన ఎన్టీఆర్‌ను చూస్తాం. కీలక సన్నివేశాల్లో ఎన్టీఆర్ హావభావాలు ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. హీరో, నటుడికి మధ్య జరిగిన సంఘర్షణలో ఎన్టీఆర్ నటుడిగానే విజయం సాధించారని అరవింద సమేత చెబుతుంది. చివరి 20 నిమిషాల్లో ఎన్టీఆర్ యాక్టింగ్ మ్యాజిక్ సినిమా రేంజ్‌ను పెంచడానికి ఉపయోగపడ్డాయనే ఫీలింగ్ కలుగుతుంది.

  పూజా హెగ్డే గ్లామర్

  ఓ వైపు గ్లామర్ ఒలకబోస్తూనే కథకు అవసరమైన మార్గదర్శకత్వాని చూపించడంలో పూజా హెగ్గే అరవింద పాత్రలో ఒదిగిపోయింది. కథలోని సీరియస్ ఇంటెన్సిటీని తన పాత్ర ద్వారా చెప్పాలనుకొన్న దర్శకుడి విజన్‌కు అనుగుణంగా పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చింది. మరోసారి పూజా హెగ్డే ప్రేక్షకుడు గుర్తుంచుకొనే పాత్రలో మెరిసింది.

  కరుడు గట్టిన ఫ్యాక్షనిస్టుగా జగపతి

  బసిరెడ్డిగా జగపతిబాబు మరోసారి కరడు గట్టిన ఫ్యాక్షనిస్టుగా కనిపించాడు. క్రూరత్వంతో కూడిన నటనను ప్రదర్శించడంలో అరవింద సమేతలో మరీ రాటుదేలిపోయాడు. సినిమా ఆరంభంలో ఫ్యాక్షన దాడి ఘటన, తన కొడుకును చంపే సీన్లలో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. బసిరెడ్డి కొడుకుగా నవీన్ చంద్ర‌లో కొత్త కోణాన్ని చూస్తాం. హీరోగా రొమాంటిక్‌గా కనిపించే నవీన్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించాడు. ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు అతిథి పాత్రకే పరిమితం అయ్యాడు. నరేష్ కాసేపు వినోదాన్ని పంచాడు.

  సుప్రియా పాథక్, ఈశ్వరీభాయ్ నటన

  మిగితా పాత్రల విషయానికి వస్తే బాలీవుడ్ నటి సుప్రియా పాథక్ కథను ముందుకు నడిపించే సత్తా ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. పూజా హెగ్డే చెల్లెలిగా ఇషారెబ్బా సహాయ పాత్రలో కనిపించింది. పెద్దగా నటనకు స్కోప్ ఉన్న పాత్రేమీ కాదు. ఇక ఈశ్వరీభాయ్ రెండు, మూడు సీన్లలో కనిపించినా గుర్తుండిపోయే పాత్రనే దక్కించుకొన్నది. సితార, దేవయాని పాత్రలో కథలో భాగంగా కనిపిస్తాయి.

  హైలెట్‌గా తమన్ మ్యూజిక్

  అరవింద సమేత చిత్రానికి తమన్ సంగీతం వెన్నముక అని చెప్పవచ్చు. ప్రధానమైన ఎపిసోడ్స్‌ను తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అల్లాడించాడు. పెనిమిటి, రుధిరం పాటలు గుండెను పిండేసాల ఉంటాయి. సినిమా ఆరంభంలో వచ్చే సీన్లు, రావు రమేష్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర మధ్య వచ్చే సీన్లకు తమన్ తన మ్యూజిక్‌తో ప్రాణం పోశాడు. క్లైమాక్స్‌లో బీజీఎం ప్లే చేయడంలో ట్రిక్స్ ఆకట్టుకొనేలా ఉంటాయి. ఓవరాల్‌గా సినిమాలో అత్యున్నత టెక్నికల్ వ్యాల్యూస్ కనిపిస్తాయి.

  ప్రతీ సన్నివేశం రిచ్‌గా

  అరవింద సమేత చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. యాక్షన్ సీన్లను, రొమాంటిక్, ముఖ్యంగా ఎమోషన్ సీన్లలో అద్భుతమైన క్వాలిటీ కనిపిస్తుంది. గ్రామీణ, పట్ణణ వాతావారణాన్ని బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన విధంగా అలరిస్తుంది. సినిమా ఆరంభంలో ఫ్యాక్షన్ ఎపిసోడ్స్‌ చిత్రీకరణ వాస్తవికతను చెబుతాయి. నవీన్ నూలి ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. సన్నివేశాలు శాంతంగా ప్రవహించే నదిలా సాగిపోవడానికి నవీన్ ప్రతిభ నూరుశాతం ప్లస్ అయిందని చెప్పవచ్చు.

  నిర్మాణ విలువలు

  నిర్మాత చిన్నబాబు నిర్మాణ సారథ్యంలో హరిక అండ్ హాసిని క్రియేషన్ ఇప్పటికే కుటుంబ పరమైన, వినోదాత్మకమైన చిత్రాలను రూపొందించాయి. కథాబలానికి తగినట్టుగా సినిమాను రిచ్‌గా రూపొందించడంలో ఈ నిర్మాణ సంస్థ అనుసరిచే తీరు పంథా ప్రత్యేకమైనది. కమర్షియల్ హంగులతోపాటు అరవింద సమేతను అన్నివర్గాలను ఆకట్టుకొనే విధంగా తెరకెక్కించారు.

  ఫైనల్‌గా

  రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసిన మరో మ్యాజిక్ అరవింద సమేత. ఎన్టీఆర్ ఇమేజ్, యాక్టింగ్ స్టామినాకు తగినట్టుగా త్రివిక్రమ్ చేసిన ప్రయోగానికి ప్రతిరూపం ఈ చిత్రం. భావోద్వేగమైన కథ, ఆసక్తికరంగా కథనం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. రొటీన్‌కు భిన్నంగా కథ చెప్పడంలో త్రివిక్రమ్ సక్సెస్ సాధించడాని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో ఈ చిత్రానికి ఆదరణ విశేషంగా లభించే అవకాశం ఉంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కెరీర్‌లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించే సత్తా అరవింద సమేతకు ఉందడనంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

  బలం, బలహీనతలు

  ఎన్టీఆర్ యాక్టింగ్
  పూజా హెగ్డే గ్లామర్
  త్రివిక్రమ్ టేకింగ్
  ఫస్టాఫ్‌లో ఆరంభం
  సెకండాఫ్‌లో ఫినిషింగ్

  మైనస్ పాయింట్స్
  స్లో నేరేషన్

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: ఎన్టీ రామారావు, పూజా హెగ్డే, ఇషా రెబ్బా, జగపతి బాబు, సునీల్, సుప్రియా పాథక్, నాగేంద్రబాబు, రావు రమేష్, నవీన్ చంద్ర, సితార, బ్రహ్మాజీ తదితరులు
  కథ, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
  నిర్మాత: ఎస్ రాధాకృష్ణ
  సంగీతం: ఎస్ఎస్ థమన్
  సినిమాటోగ్రాఫర్: పీఎస్ వినోద్
  ఎడిటింగ్: నవీన్ నూలి
  బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
  రిలీజ్: 2018-11-10
  నిడివి: 167 నిమిషాలు

  English summary
  NTR, Trivikram Srinivas's Aravinda sametha has huge expectations. This movie's teaser, First Look got good response from fans. This movie set to release on October 11th. NTR acting performance, Trivikram Srinivas taking become talk of the town. In this occassion, Telugu Filmibeat bring exclusive movie review.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more