twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ardha Shathabdham మూవీ రివ్యూ అండ్ రేటింగ్: ఆలోచింప జేసే కథలో ఆకట్టుకొన్న పాత్రలు

    |

    Rating:
    2.5/5
    Star Cast: కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్, ఆమని
    Director: రవీంద్ర పుల్లె

    సమాజంలో కుల, మతాల మధ్య అసమానతలు, వివక్ష నేపథ్యంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రతీ చిత్రం ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాయి. అలా విభిన్నమైన కథ, విలక్షణమైన పాత్రలతో ఆవిష్కృతమైన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పటికీ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అలాంటి కోవలో వచ్చిన అర్ధ శతాబ్దం చిత్రం ఎలాంటి కోణంలో వచ్చిందనే విషయాన్ని చర్చించుకోవాలంటే ముందు కథ, కథనాలను తెలుసుకోవాల్సిందే...

    అర్ధ శతాబ్దం కథ ఏమిటంటే

    అర్ధ శతాబ్దం కథ ఏమిటంటే

    సిరిసిల్లా గ్రామంలో మాజీ నక్సలైట్ రామన్న (సాయికుమార్) కూతురు పుష్ప (కృష్ణ ప్రియ)ను బాల్యం నుంచే కృష్ణ (కార్తీక్ రత్నం) ప్రేమిస్తూ ఉంటాడు. కానీ తన ప్రేమను ఆమెతో పంచుకోలేకోపోతాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా పుష్ప అంటే ప్రాణం కంటే మిన్నగా చూసుకొంటుంటాడు. పుష్పపై ఉన్న ప్రేమ కారణంగా కృష్ణ చేసిన ఓ పనికి ఊరంతా గొడవలు, కొట్లాటలతో అట్టుకుడుకుతుంది. ఈ క్రమంలో ఎస్ఐ రంజిత్ (నవీన్ చంద్ర)తోపాటు పోలీసులు రంగ ప్రవేశం చేస్తారు. ఊర్లో చెలరేగిన మంటలను ఎంజాయ్ చేస్తూ రాజకీయ వేత్త (శుభలేఖ సుధాకర్) చలి కాచుకొనే ప్రయత్నం చేస్తాడు.

    కథలో ట్విస్టులు...

    కథలో ట్విస్టులు...

    కృష్ణ కారణంగా ప్రారంభమైన ఊరి గొడవలకు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి? కృష్ణ చేసిన పని ఏమిటి? కూతురు కోసం రామన్న ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? వీరన్న (రాజ రవీంద్ర) గొడవలకు ఎందుకు ఆజ్యం పోసాడు? రాజకీయ నాయకుడు ఈ గొడవను స్వప్రయోజనాలకు వాడుకోవాలని చూశాడు? రాజకీయవేత్త తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ ఎస్పీ (అజయ్) ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకొన్నాడు? కృష్ణ, పుష్ప ప్రేమ ఈ గొడవలను ఆపిందా? అనే ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానమే అర్ధశతాబ్దం.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

    అర్ధశతాబ్దం కథలో కృష్ణ, పుష్ప పాత్రలను హైలెట్‌గా డిజైన్ చేయడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నాడు. అయితుే కృష్ణ, పుష్ప ప్రేమను ఎంటర్‌టైనింగ్, ఫీల్‌గుడ్‌ నోట్‌లో ప్రారంభమైనప్పటికీ.. అసలు సమస్యను చెప్పడానికి లవ్ ట్రాక్‌ను సాగదీశాడనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథలో బలమైన పాయింట్‌గా మారిన కుల వివక్షను వివరంగా, బలంగా చెప్పడంలో దర్శకుడు ట్రాక్ మిస్ అయ్యాడనిపిస్తుంది. అనేక రకాల పాత్రలను కథలో బలంగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడనిపిస్తుంది.

    సెకండాఫ్‌ గురించి

    సెకండాఫ్‌ గురించి

    కాకపోతే సెకండాఫ్‌లో సమాజంలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తే పాయింట్‌ను ఎలాంటి వివాదానికి తావివ్వకుండా చెప్పడంలో దర్శకుడు రవీంద్ర పుల్లె సఫలమయ్యాడనిపిస్తుంది. అంతేకాకుండా కర్ర విరగకుండా పాము చావకుండా.. కొంత డిఫెన్సివ్ మోడ్‌లో కథ చెప్పడానికి ప్రయత్నించారనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. తొలి భాగంలో సన్నివేశాలు పేలవంగా ఉంటే.. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తాయి.

    కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ యాక్టింగ్ గురించి

    కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ యాక్టింగ్ గురించి

    కృష్ణగా కార్తీక్ రత్నం, పుష్పగా కృష్ణ ప్రియ పాత్రలో వారు ఒదిగిపోవడమే కాకుండా.. కథకు ప్రాణంగా నిలిచారు. కార్తీక్ పాత్ర ఫస్టాఫ్‌లో లవర్ బాయ్‌గా జోష్‌గా కనిపిస్తే.. సెకండాఫ్‌లో భావోద్వేగమైన నటనను ప్రదర్శించాడు. కృష్ణ ప్రియ విషయానికి వస్తే.. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు తన టాలెంట్‌తో ఆకట్టుకొన్నారు. కృష్ణ ప్రియ చిన్నప్పటి క్యారెక్టర్ వేసిన చిన్నారి కూడా బాగా ఆకట్టుకొన్నారు.

    మిగితా పాత్రల పెర్ఫార్మెన్స్

    మిగితా పాత్రల పెర్ఫార్మెన్స్

    మిగితా పాత్రల్లో రామన్నగా సాయి కుమార్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ కథకు వెన్నముకగా మారారు. ఇక శుభలేఖ సుధాకర్ రాజకీయ వేత్త పాత్రతో సినిమాకు కేంద్ర బిందువుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తమ నటనను ప్రదర్శించాడు. ఆమని కూడా తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. పవిత్ర లోకేష్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు. ఈ పాత్రలన్నీ ఇంకా బలంగా చెప్పడానికి అవకాశం ఉన్నప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నం చేయలేరనే ఫీలింగ్ కలుగుతుంది. మిగితా పాత్రల్లో నటులు ఓకే అనిపించారు.

    టెక్నికల్ విభాగాల పనితీరు

    టెక్నికల్ విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగం నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి విభాగంలో అష్కర్, వేణు ఈజే, వెంకట్ ఆర్ శాఖమూరి పనితనం బాగుంది. పాటల, బతుకమ్మ సీన్లలో లైటింగ్, సీన్ల ఎలివేషన్ బాగుంది. నవాఫల్ రాజా అసి మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ కూడా బాగుంది. చాలా చోట్ల డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. రాధా కృష్ణ, చిట్టి కిరణ్ రామోజు నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలు, పాత్రల డిజైన్‌పై మరింత దృష్టిపెట్టాల్సి ఉంటే బాగుండేదేమోననిపిస్తుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    అగ్ర కులాలు, అణగారిన కులాలు వివక్షను మరోసారి ఎత్తి చూసే ప్రయత్నం చేసే చిత్రం అర్ధ శతాబ్దం రూపొందింది. నిద్ర మత్తులో ఉన్న సమాజాన్ని తట్టిలేపే బలమైన కథ ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయిలో తన అస్త్రాన్ని ఉపయోగించలేదనే లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నక్సలైట్ల ఉద్యమం, విధి నిర్వాహణలో పోలీసుల వైఫల్యం, గ్రామీణ రాజకీయాలు, నిరుద్యోగం, చేతి వృత్తుల ఇలా అనేక అంశాలను టచ్ చేసేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం. సామాజిక చైతన్యం నేపథ్యంగా వచ్చే సినిమాలను ఆదరించే వారికి అర్ధ శతాబ్దం తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడటానికి సినిమాలో ఉపయోగించిన బూతులు కొంత ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంది.

    English summary
    Ardha Shathabdham movie is directed by Rawindra Pulle. Produced by Chitti Kiran Ramoju. Karthik Rathnam, Krishna Priya, Naveen Chandra, Sai Kumar, Aamani, Dayanand Reddy, TNR in lead roles. This film Hit the AHA OTT on June 11th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X