Ari Movie Review: అరి తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: వినోద్ వర్మ, సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేఖ సుధాకర్, పురిమెట్ల సూర్య, సురభి ప్రభావతి తదితరులు
రచన, దర్శకత్వం: జయశంకర్
సమర్పణ: రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి
నిర్మాతలు: శ్రీనివాస్ రామిరెడ్డి, డీ శేషురెడ్డి మారంరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి
సహ నిర్మాత: లింగ గుణపనేని
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
ఎడిటర్: జీ అవినాష్
సినిమాటోగ్రఫి: శివశంకర్ వర ప్రసాద్, జీ శివ కుమార్
ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్
కొరియోగ్రఫి: భాను, జితు
బ్యానర్: ఆర్వీ సినిమాస్
రిలీజ్ డేట్: 2025-10-10
ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా పనిచేసే వ్యక్తి (వినోద్ వర్మ) తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును అని ప్రకటన ఇస్తాడు. దాంతో ఓల్డ్ సిటీలోని షాదాబ్ హోటల్‌లో ఇరానీ ఛాయ్ చేసే అముల్ కుమార్ (వైవా హర్ష) తనకు సన్నీలియోన్ అంటే ఇష్టం. ఒక్కరాత్రికి గడిపే ఛాన్స్ కావాలి అంటూ కోరిక కోరుతాడు. ఇక ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే ఆత్రేయి (అనసూయ భరద్వాజ్) తన సహ ఉద్యోగి అందంపై ఈర్ష్య పడుతుంది. అపర కోటీశ్వరుడు విప్రనారాయణ పాశ్వాన్ (సాయికుమార్) తన జీవితంలో అన్నీ ఉన్నా అసంతృప్తికి గురవుతాడు. నిధిని అన్వేషించి బాగా డబ్బు సంపాదించాలనే ఇన్స్‌పెక్టర్ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్), మరణించిన తన భర్తను బతికించాలని లక్ష్మీ (సురభి ప్రభావతి) అనే మహిల, కుటుంబీకుల ఆస్తి తనకు దక్కాలనే దురాశపరుడైన గుంజన్ (శుభలేఖ సుధాకర్), దొంగ తనాలు చేసే సూర్య (పురిమెట్ల సూర్య) అందరూ లైబ్రేరియన్‌ను సంప్రదిస్తారు. అయితే వారికి చాలా తీవ్రమైన టాస్క్‌లు అప్పగించి వాటిని పూర్తి చేస్తే.. మీ కోరికలు నెరవేరుతాయని చెబుతాడు.

అసలు లైబ్రేరియన్ ఎవరు? ఆయన ఫోర్బ్స్, ఇతర పత్రికలు, ఇన్స్‌టాగ్రామ్‌లో కోరికలు తీర్చబడును అని ఎందుకు ప్రకటన ఇచ్చాడు? ఒకరికి యాసిడ్ పోయమని, మరోకరిని రేప్ చేయమని, హోటల్‌లో బాంబు పెట్టమని .. ఇలా విధ్వంసకరమైన సలహాలు ఎందుకు ఇచ్చాడు? ఇలాంటి సలహాలను పాటించడానికి ప్రయత్నించిన వారికి జీవితంలో ఏం జరిగింది? అనే ప్రశ్నలకు అధ్యాత్మికపరమైన సమాధానమే అరి సినిమా కథ.
భారతీయ పురాణాల్లో కామం, క్రోధం, మదం, మోహనం, లోభం, మాత్సర్యాలు అనే అరిషడ్వార్గాలను ఆధారంగా చేసుకొని దర్శకుడు జయశంకర్ సృష్టించిన పాత్రలు, వాటికి కోసం రాసుకొన్న కథ ఆలోచింప చేసే విధంగానే కాకుండా.. జీవిత సత్యాలను తెలుసుకోవడానికి అవకాశం ఉండేలా సినిమాగా తెరకెక్కించిన విధానం బాగుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థికపరమైన బంధాలు, కోరికలు అనేక కష్టాలకు కారణం అనే ఇతివృత్తంతో పలువురు వ్యక్తుల జీవితాలను తెర మీద ఆవిష్కరించిన తీరు చాలా కొత్తగా ఉంది. ఇలాంటి కాన్సెప్ట్‌కు కృష్ణ తత్వాన్ని జోడించి క్లైమాక్స్‌ను నడిపించిన విధానం ఎక్సలెంట్‌గా ఉంది. దర్శకుడు జయశంకర్ విజన్, ఇతిహాసాల సారాన్ని సాధారణ ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో చెప్పాలనే ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కమర్షియల్ విలువలను జోడించి హిందూ పురాణాలను ఆడియెన్స్ చెప్పాలనే పంథా, అనుసరించిన స్క్రీన్ ప్లే హైలెట్‌గా ఉంది. స్టార్ వాల్యూ యాడ్ చేసి ఉంటే.. ఇలాంటి కథలకు ఇంకా ఎక్కువ రీచ్ ఉండేదనే ఫీలింగ్ కలిగింది.

ఫస్టాఫ్‌ను ప్రారంభించిన విధానం ఆసక్తికరంగా ఉండటంతో త్వరగా ఆడియెన్స్ కథలోకి వెళ్లడానికి వీలు కలిగేలా ఉంది. అయితే ఎక్కువగా డైలాగ్ డ్రామా, రిపీట్ సీన్స్ ఉండటం వల్ల కథలోని ఇంటెన్సిటీ, ఎమోషన్స్ మిస్ అయ్యాయా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓపెనింగ్ ఫీల్‌గుడ్‌గా, క్యూరియాసిటీతో మొదలై.. మధ్యలో కొంత తడబాటుకు గురైనప్పటికీ.. ఇంటర్వెల్ తర్వాత కృష్ణ తత్వం, కృష్ణుడి ఆగమనం, చివరి 30 నిమిషాలు సినిమాను నిలబెట్టేలా చేసిందని చెప్పవచ్చు. పురాణాలను ముడిపెట్టి సోషల్ డ్రామాలను రూపొందించే ట్రెండ్‌ను దర్శకుడు అద్బుతంగా ఫాలో అయ్యాడు. మంచి అనుభూతిని పంచే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమా కథలో విప్రనారాయణ పాశ్వాన్‌గా సాయికుమార్, గుంజన్‌గా శుభలేఖ సుధాకర్, ఆత్రేయిగా అనసూయ, భర్తను దక్కించుకోవాలనే మహిళగా సురభి ప్రభావతి, ఇతర పాత్రల్లో శ్రీకాంత్ అయ్యంగార్, పురిమెట్ల సూర్య అందరూ చక్కగా నటించారు. ఇక ఈ సినిమాలో హై ఎమోషన్స్ పడించే బాధ్యతను వైవా హర్ష తీసుకొని డీసెంట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. యాంకర్ అంజలి పోషించిన పాత్ర సినిమాను నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతూనే ఉంటుంది. అంజలి కొద్ది క్షణాలే ఉన్నా.. సినిమాకు హై ఎమోషన్స్ జోడించింది. అందరూ ఈ సినిమాలో భావోద్వేగాలను పండించడంలో తలా ఓ చేయి వేశారని చెప్పాలి. సురభి ప్రభావతి, సాయికుమార్, శుభలేఖ సుధాకర్ పాత్రలు స్పూర్తిదాయకంగా ఉన్నాయి.
అరి సినిమాలో కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా.. టెక్నికల్‌గా కొన్ని సీన్లు బ్రిల్లియెంట్ చిత్రీకరించారు. కృష్ణ భగవానుడి కాన్సెప్ట్‌తో వచ్చే సన్నివేశాలకు ఉపయోగించిన వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. అనూప్ రూబెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఇక కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమాలోని సన్నివేశాలను జీ అవినాష్ అందంగా పేర్చినట్టు చేసి కథను మంచి ఫ్లోలో చెప్పారు. ఆర్వీ సినిమాస్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
భారతీయ పురాణాలు, ఇతిహాసాలు జోడించి వచ్చిన హనుమాన్, మిరాయ్, కార్తికేయ లాంటి సినిమాల కోవలో చెందిన చిత్రం అరి. ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సినిమాను చూసి అధునిక భగవద్గీత అని వ్యాఖ్యనించడం ఈ సినిమా డెప్ట్‌ను తెలియజేసింది. సమాజాన్ని ఆలోచింపచేసే కథ, భావోద్వేగాలు పుష్కలంగా ఉన్న ఫీల్ గుడ్ సినిమా. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ వారాంతంలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చూడాలనుకొనే వారు.. ఈ మూవీని మిస్ చేసుకోకండి.


Click it and Unblock the Notifications











