»   » అదరగొట్టాడు (‘అర్జున్ రెడ్డి’ రివ్యూ)

అదరగొట్టాడు (‘అర్జున్ రెడ్డి’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5
'అర్జున్ రెడ్డి'.... ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్ మరే సినిమాకు రాలేదు. దీనిపై భారీ అంచనాలు ఏర్పడటానికి కారణం టీజర్, ట్రైలర్. వాటి ద్వారా మా సినిమాలో స్టార్లు లేక పోయినా మంచి కంటెంటు ఉందని ప్రేక్షకుల్లో నమ్మకం కలిగించారు.

3 నిమిషాల నివిడితో కట్ చేసిన ట్రైలర్‌ ద్వారా.... ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచారు. ఆ ఇంపాక్ట్ టాలీవుడ్ ప్రేక్షకులపై ఏ రేంజిలో పడిందంటే..... సినిమా రిలీజ్ ముందు రోజు రాత్రి హైదరాబాద్‌లో 60కిపైగా స్పెషల్ షోలు వేస్తే అవన్నీ హౌస్ ఫుల్ అయ్యేంతలా.

అసలు అర్జున్ రెడ్డి కాన్సెప్టు ఏమిటి? ఎలాంటి సినిమా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది అనేది రివ్యూలో చూద్దాం.

అర్జున్ రెడ్డి లవ్ స్టోరీ

అర్జున్ రెడ్డి లవ్ స్టోరీ

డాక్టర్ అర్జున్ రెడ్డి(విజయ్ దేవరకొండ) మంగుళూరులోని సెయింట్ మేరీ కాలేజీ ఫైనలియర్ మెడికల్ స్టూడెంట్. టాప్ ఆఫ్ ది క్లాస్, టాపర్ ఆఫ్ ది యూనివర్శిటీ. అయితే యాంగర్ మేనేజ్మెంటులో జీరో. కోపం వస్తే ఆదుపుచేసుకోలేడు. ఓ చిన్న గొడవలో క్షమాపణ చెప్పడం ఇష్టం లేని అర్జున్ రెడ్డి కాలేజీ వదిలి వెళ్లివెళ్లేందుకు సైతం సిద్ధమవుతాడు. అదే సమయంలో ఫస్టియర్లో కొత్తగా జాయినైన ప్రీతి(శాలిని)ని చూసి మనసు పారేసుకుంటారు. కాలేజీ వదిలి వెళ్లాలనే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఇద్దరి మధ్య లవ్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ స్థాయికి వెళ్లిపోతుంది.

"Arjun Reddy" movie Review
తన కోపమె తనకు శత్రువు

తన కోపమె తనకు శత్రువు

అర్జున్ రెడ్డి, ప్రీతి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే కులాలు వేరు కావడం వల్ల ప్రీతి తండ్రి నుండి నిరాకరణ ఎదురవుతుంది. ఈ క్రమంలో ప్రీతి తండ్రితో గొడవ పడ్డ అర్జున్ రెడ్డి తాను కావాలో, తండ్రి కావాలో తేల్చుకోవాలని.... 6 గంటల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గొడవపడి వచ్చేస్తాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మత్తుమందు తీసుకుంటాడు. అయితే అప్పటికే ఫుల్లుగా మందు కొట్టడంతో రెండు రోజుల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు.

కళ్లు తెరిచేలోపు అంతా శూన్యం

కళ్లు తెరిచేలోపు అంతా శూన్యం

అపస్మారక స్థితి నుండి బయటపడి అర్జున్ రెడ్డి కళ్లు తెరిచే లోపు ప్రీతికి ఇంట్లోవాళ్లు బలవంతంగా పెళ్లి చేస్తారు. అంతా అయిపోయాక అర్జున్ వెళ్లి గొడవపడినా ఫలితం లేకుండా పోతోంది. పైగా ప్రీతి బంధువుల నుండి తన్నులు తిని వస్తాడు. తన పరువు తీశావనే కోపంతో అర్జున్ రెడ్డిని తండ్రి ఇంటి నుండి గెంటేస్తాడు. ప్రీతి జ్ఞాపకాల నుండి బయట పడలేక తాగుడుకు, డ్రగ్స్‌కు బానిసైపోతాడు, చివరకు పిచ్చోడిలా రోడ్డున పడేస్థాయి వస్తాడు.... ఆ తర్వాత కథ థియేటర్లో చూస్తేనే బావుంటుంది.

విజయ్ దేవరకొండ పెర్పార్మెన్స్ అదుర్స్

విజయ్ దేవరకొండ పెర్పార్మెన్స్ అదుర్స్

‘అర్జున్ రెడ్డి' పాత్రలో విజయ్ దేవరకొండ సూపర్బ్‌గా నటించాడు. నటనలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరచుకున్న విజయ్ ‘అర్జున్ రెడ్డి' పాత్రలో మెప్పించాడు. కోపం కంట్రోల్ చేసుకోలేని సీన్లు, ఎమోషనల్ సీన్లు, సెంటిమెంటల్ సీన్లు దేనికదే సూపర్బ్‌గా చేశాడు. టాలీవుడ్లో విజయ్ దేవరకొండ ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హీరోయిన్, ఇతర నటీనటులు

హీరోయిన్, ఇతర నటీనటులు

హీరోయిన్ శాలిని పెద్ద అందత్తె కాకపోయినా.... 19 ఏళ్ల ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో బాగా సెట్టయింది. క్యూట్ లుక్ తో, విజయ్ దేవరకొండకు తగిన జోడీగా పేరు తెచ్చుకుంది. అర్జున్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్ శివ పాత్రలో రాహుల్ రామకృష్ణ, సినిమాలో కనిపించే ప్రతినటుడు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

హీరో క్యారెక్టరైజేషన్ సూపర్

హీరో క్యారెక్టరైజేషన్ సూపర్

‘అర్జున్ రెడ్డి' సినిమా హీరో క్యారెక్టరైజేషన్‌ను బేస్ చేసుకుని తెరకెక్కించారు. దర్శకుడు ‘అర్జున్ రెడ్డి' పాత్రను ప్రజంట్ చేసిన తీరు సూపర్ గా ఉంది. ఆయా సందర్భాల్లో అర్జున్ రెడ్డి పాత్ర రియాక్ట్ అయిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దర్శకుడు సందీప్

దర్శకుడు సందీప్

దర్శకుడు సందీప్ రెడ్డి తొలి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు. అతడు ఎంచుకున్న కథాంశం కామన్ లవ్ స్టోరీనే అయినప్పటికీ దాన్ని నేరేట్ చేసిన విధంగా ప్రేక్షకుడిగా బాగా ఎక్కింది. అక్కడక్కడ కాస్త లాగినట్లు అనిపించినా.... మంచి పనితనం చూపించాడు.

రియాల్టీకి దగ్గరగా

రియాల్టీకి దగ్గరగా

‘అర్జున్ రెడ్డి' సినిమా చూస్తుంటే కథ రియల్ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అర్జున్ రెడ్డికి కనెక్ట్ అయిపోతారు. 3 గంటల సినిమా అయినా మొదటి నుండి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు స్క్రీన్ ప్లే రన్ చేసిన తీరు బావుంది.

రొమాన్స్ సూపర్

రొమాన్స్ సూపర్

విజయ్ దేవరకొండ, శాలిని మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. సినిమాలో దాదాపు 25 ముద్దు సీన్లు ఉన్నాయంటే రొమాన్స్ డెప్త్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు

బూతులు

బూతులు

సినిమాను రియలిస్టిక్‌గా తీయడం కోసం.... సందర్భానుసారంగా నిజజీవితంలో ఉపయోగించే కొన్ని బ్యాడ్ వర్డ్స్, తిట్లు, బూతు పదాలు కూడా వాడారు. అయితే సెన్సార్ బోర్డు చాలా చోట్ల వాటికి కత్తెర వేసింది.

పెద్దలకు మాత్రమే...

పెద్దలకు మాత్రమే...

‘అర్జున్ రెడ్డి' పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమా. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు, డైలాగులు ఫ్యామిలీస్‌తో కలిసి చూడలేం.

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

సినిమాటోగ్రఫీ బావుంది. సందర్భానుసారంగా వచ్చే పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డైలాగులు బావున్నాయి. నిర్మాణ విలువలు ఇంప్రెసివ్.

కొన్ని సీన్లు మరీ పచ్చిగా

కొన్ని సీన్లు మరీ పచ్చిగా

ప్రేక్షకులు యాక్సెప్టు చేస్తారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా తన సినిమా రియాల్టీకి దగ్గరగా ఉండాలనే తపనతో దర్శకడు సందీప్ రెడ్డి సినిమాలోని కొన్ని సీన్లు పచ్చిగా చూపించారు. ఇలాంటి సీన్లపై మిశ్రమ స్పందన వస్తోంది.

క్లైమాక్స్

క్లైమాక్స్

ఏ సినిమా అయినా క్లైమాక్స్ అదిరిపోతేనే ప్రేక్షకుడు ఆనందంగా, మంచి సినిమా చూసిన ఫీలింగుతో బయటకు వస్తాడు. అర్జున్ రెడ్డి మూవీ క్లైమాక్స్ ఆకట్టుకునే విధంగా, ప్రేక్షకులు సంతృప్తి చెందేలా ఉంది.

ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్
సినిమా నేరేషన్ రియలిస్టిక్‌గా ఉండటం
హీరో క్యారెక్టరైజేషన్
దర్శకుడి పని తీరు

మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్

సినిమాలో చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ ఏమీ లేవు, సెకండాఫ్‌ కాస్త సాగదీసినట్లు ఉంటుంది.

చివరగా...

చివరగా...

‘అర్జున్ రెడ్డి' సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే మూవీ. ఫ్యామిలీ ప్రేక్షకులకు రికమండ్ చేసే సినిమా మాత్రం కాదు.

తారాగణం, టెక్నీసియన్స్

తారాగణం, టెక్నీసియన్స్

విజయ్ దేవరకొండ, శాలిని, రాహుల్ రామకృష్ణ, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, ప్రియదర్శి, అదితి మ్యూకల్, జియా శర్మ తదితరులు. సంగీతం: రాధన్, సినిమాటోగ్రఫీ: రాజు తోట, నిర్మాణం: భద్రకాళి పిక్చర్స్, నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ.

English summary
Arjun Reddy movie review and rating. The film written and directed by Sandeep Reddy Vanga and Tejpaul as asst. Director and produced by Pranay Reddy Vanga for Bhadrakali Pictures. The soundtrack is composed by Radhan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu