Arjun S/O Vyjayanthi First Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫస్ట్ రివ్యూ
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మాతలు అశోక్ వర్దన్ ముప్పా, సునీల్ బలసు నిర్మాణంలో శ్రీనివాస్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లో 21వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రివ్యూ వివరాల్లోకి వెళితే..
విభిన్నమైన కథతో తెరకెక్కిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా, బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్, చరణ్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, సీ రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రం రిలీజ్ నేపథ్యంలో సెన్సార్ అధికారులు ఈ మూవీని ఇటీవల సమీక్షించారు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి తల్లిగా, ఆమెకు కుమారుడిగా కల్యాణ్ రామ్ పవర్‌ఫుల్ పాత్రల్లో నటించారు. వారి పాత్రల మధ్య ఎమోషనల్ బాండింగ్ బాగుంటుంది. ఈ సినిమాకు సెకండాఫ్ హైెలట్, తల్లి, కొడుకుల మధ్య బాండింగ్ నేపథ్యంగా సాగే కథ అందర్నీ ఆకట్టుకొంటుంది. విజయశాంతి, కల్యాణ్ రామ్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా ఉంటాయి అనే విషయం సెన్సార్ పూర్తయిన తర్వాత అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది.
ఇక ఈ చిత్రంలో క్లైమాక్స్ తెలుగు సినిమా రంగంలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని విధంగా ఉంటుంది. ఈ ప్రీ క్లైమాక్స్ నుంచి శుభం కార్డు వరకు వచ్చే కథలో ఉన్న ట్విస్టులు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. చివరి సన్నివేశం వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయి కూర్చుని చూసే విధంగా సీన్లు ఉంటాయి అని తెలిసింది.
ఇక నూతన దర్శకుడు ప్రదీప్ చిల్కూరి డీల్ చేసిన విధానం ఈ మూవీకి ప్లస్ పాయింట్. సీ రాంప్రసాద్ సినిమాటోగ్రఫి, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాను మరింత రిచ్‌గా, ఉన్నత ప్రమాణాలున్న సినిమాగా మార్చింది అనే విషయం సెన్సార్ సందర్భంగా చర్చకు వచ్చింది.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను చూసిన తర్వాత చిత్ర యూనిట్‌ను సెన్సార్ అధికారులు ప్రశంసించారు. ఎమోషన్స్, తల్లి కొడుకుల సెంటిమెట్ అన్ని వర్గాలను ఆలరిస్తుంది. విజయశాంతి, కల్యాణ్ రామ్ తమ పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. కథలోని భావోద్వేగాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి అని అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా నిడివి సుమారుగా 2 గంటల 24 నిమిషాలపాటు ఉంటుంది. మదర్ సెంటిమెంట్‌తో సాగే సినిమాలో కొన్ని సన్నివేశాలు గ్రిప్పింగ్‌గా ఉండటమే కాకుండా హృదయానికి తాకేలా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ అయ్యే సినిమాపై అందించే రివ్యూ కోసం ఫిల్మీబీట్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











