Arjun S/O Vyajayanthi Twitter Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ

నందమూరి కల్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మాతలు అశోక్ వర్దన్ ముప్పా, సునీల్ బలసు నిర్మించారు.

శ్రీనివాస్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించి యూఎస్ ప్రీమియర్ల తర్వాత నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

Arjun Son of Vyajayanthi Twitter Review

అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫస్టాఫ్ అయిపోయింది. మూవీ యావరేజ్‌గా ఉంది. మదర్, సన్ మధ్య కథ మంచి సెటప్‌ మొదలైంది. కొన్ని సీక్వెన్సెస్ బాగున్నాయి. ఆ తర్వాత రొటీన్ కథ, కథనాలతో హీరో టెంప్లెట్ సినిమాగా మారిపోయింది. మ్యూజిక్, బీజీఎం పెద్ద మైనస్. ఎలివేషన్స్‌ ఇవ్వడంలో అజనీష్ ఫెయిల్ అయ్యాడు. సెకండాఫ్ బాగుంటే తప్పా ఈ సినిమా హిట్ అవుతుందనే ఫీలింగ్ కలిగింది అని ఓ రివ్యూవర్ కామెంట్ చేశాడు.

ఓవర్సీస్ షోలు పడిన తర్వాత బ్లాక్‌బస్టర్ టాక్ వినిపిస్తున్నది. పోలీస్ రోల్‌లో చాలా రోజు తర్వాత కల్యాణ్ రామ్ కనిపించాడు. కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. కల్యాణ్ రామ్‌కు కంగ్రాట్స్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫస్టాఫ్ ఇప్పుడే అయిపోయింది. రెగ్యులర్ ఫార్మూలా సినిమా. జనతా గ్యారేజ్ కాన్సెప్ట్‌ను మరోసారి రుద్దారు. కొన్ని చోట్ల సీన్లు బాగున్నాయి. మ్యూజిక్ పర్వాలేదు. కానీ పాటలు బాగాలేవు. కెమెరా వర్క్ కూడా అంతంత మాత్రమే. యాక్టర్ల క్లోజప్ షాట్స్ బాగాలేవు. విజయశాంతిని మరోసారి పోలీస్ పాత్రలో చూడటం బాగుంది. ఆమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. ఇక సెకండాఫ్ ఎలా సాగుతుందో అనే ఆసక్తి ఏర్పడింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఓవర్సీస్ షోల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్టులు వస్తున్నాయి. బెస్ట్ ఎమోషన్స్ ఉన్నాయి. మాస్ యాక్షన్, పీక్ క్లైమాక్స్, ఎక్సలెంట్ బీజీఎం, కల్యాణ్ రామ్‌కు కమ్ బ్యాక్ సినిమా అవుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా గురించి నందమూరి అభిమాని ఉత్సాహంగా ట్వీట్ చేశారు. ఈ సినిమా హిట్ కావడం తథ్యం. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకు బలంగా నిలవడమే కాకుండా అదరగొట్టేలా ఉంటాయి. ఈ సినిమా గురించి పూర్తి రివ్యూ 9 గంటల తర్వాత చెబుతాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

తల్లి, కొడుకుల మధ్య అనుబంధంతో వచ్చే సినిమాలకు ఎప్పుడు స్పెషల్ బాండింగ్ ఉంటుంది. ఈ సినిమా కూడా అందరి అభిరుచులకు దగ్గరగా ఉంటుందని భావిస్తున్నాను. మళ్లీ చాలా రోజుల తర్వాత లేడీ సూపర్ స్టార్‌ విజయశాంతిని చూడటం చాలా సంతోషంగా ఉంది. విజయశాంతి, కల్యాణ్ రామ్‌కు భారీ సక్సెస్ లభించాలని కోరుకొంటున్నాను అని హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా రిలీజ్ సందర్భంగా యూఎస్ ప్రేక్షకులకు కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రత్యేకంగా మెసేజ్ అందజేశారు. అమెరికా ప్రీమియర్లు గ్రాండ్‌గా మొదలు కాబోతున్నాయి. ఈ సినిమాను హిట్ చేయాలని కోరారు అని యూఎస్ డిస్టిబ్యూటర్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X