అర్జున్ సురవరం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5
Star Cast: నిఖిల్, లావణ్య, వెన్నెల కిషోర్, సత్య, నాగినీడు, ప్రగతి తదితరులు
Director: టీ సంతోష్

హ్యాపీ డేస్ చిత్రంతో అందరికీ దగ్గరైన హీరో నిఖిల్. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి వరుస విజయాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నిఖిల్... ఓ సినిమా చేస్తున్నాడంటే.. ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నాడనే నమ్మకాన్ని కలిగించాడు. అయితే మధ్యలో కేశవ, కిరాక్ పార్టీ చిత్రాలతో నిరాశ పరిచాడు. తాజాగా ప్రేక్షకులను ఎలాగైనా సరే మెప్పించాలనే ప్రయత్నంతో అర్జున్ సురవరం అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. మరి ఈ చిత్రం నిఖిల్‌కు ఆశించిన విజయాన్ని అందించిందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.

కథ

కథ

అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్) బీబీసీ చానెల్‌లో పని చేయాలనే ఆశయంతో ఉంటాడు. అప్పటి వరకు లోకల్ ఛానెల్‌లో పని చేస్తూ యువత పక్కదోవ పట్టడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటి వాటిపై రిపోర్టింగ్ చేస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో బీబీసీ నుంచి అర్జున్‌కు ఫోన్ వస్తుంది. చివరకు తన జీవిత ఆశయం నెరవేరుతోందన్న సంతోషంలో ఉండగా.. ఫేక్ సర్టిఫికేట్స్‌తో బ్యాంకులను మోసం చేశాడన్న కారణంతో అర్జున్‌ను అరెస్ట్ చేస్తారు.

కథలో ట్విస్ట్‌లు..

కథలో ట్విస్ట్‌లు..

నకిలీ సర్టిఫికేట్ల కుంభకోణంలో అర్జున్ ఎలా ఇరుక్కున్నాడు? అర్జున్ మెడకు ఈ కుంభకోణం చుట్టుకోవడానికి గల కారణాలేంటి? ఈ స్కామ్ వెనుక ఉన్న ముఠా ఎవరు? నకిలి సర్టిఫికెట్ల కుంభకోణానికి కారణమైన బయటకు ఎలా తీసుకొచ్చాడు? ఈ కుంభకోణంలో అర్జున్ నిర్దోషిగా తేలాడా? చివరకు ఈ కేసు నుంచి అర్జున్ ఎలా బయటపడ్డాడన్ననే ప్రశ్నలకు సమాధానమే అర్జున్ సురవరం.

ఫస్టాఫ్ అనాలిసిస్..

ఫస్టాఫ్ అనాలిసిస్..

తన తండ్రికి తెలియకుండా అర్జున్ రిపోర్టర్ జాబ్ చేస్తుండటం, బీబీసీలో వర్క్ చేస్తున్నానని కావ్య (లావణ్య త్రిపాఠి)కు చెప్పడం, వారిద్దరికి పరిచయం పెరగడం లాంటి సన్నివేశాలతో కొంత బోర్ కొట్టించినా.. వెన్నెల కిషోర్, సత్య పాత్రలతో కామెడీ ట్రాక్ నడిపించడంతో ఫర్వాలేదనిపిస్తుంది. బీబీసీ నుంచి ఫోన్ రావడం, అక్కడ ఇచ్చిన ఒక కేసును అర్జున్ పరిష్కరించే సీన్ అదిరిపోతుంది. అప్పటి వరకు అసలు కథలోని తీసుకెళ్లని దర్శకుడు.. ఒక్కసారి కథను మెయిన్ ట్రాక్ ఎక్కించడంతో ఆసక్తికరంగా మారుతుంది. నకిలి సర్టిఫికెట్లను సృష్టించి ఎడ్యుకేషన్‌లోన్ పేరిట బ్యాంకులను మోసం చేశాడని అరెస్ట్ చేయడం, అతనితో పాటు మరో నలుగురు కుర్రాళ్లను పోలీసులు లాక్కెడంతో కథ మలుపు తిరుగుతుంది. అందులో కార్తీక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ఈ స్కామ్‌కు సంబంధించిన డాట్ కన్సల్టెన్సీని పట్టుకోవడం, అక్కడి నుంచి అతని వేట కొనసాగించడం, దాని కోసం వెన్నెల కిషోర్‌ను ఎరగా వేయడం, భారీ యాక్షన్ సీన్‌తో సాగే ప్రథమార్థం అందర్నీ మెప్పించేలానే ఉంది.

సెకండాఫ్ అనాలిసిస్..

సెకండాఫ్ అనాలిసిస్..

నకిలీ సర్టిఫికెట్ల స్కామ్‌ వెనకున్న దురా సర్కార్ (తరుణ్ అరోరా ) కొడుకును అర్జున్ చంపడంతో అతనితో కోసం వెతకడం మొదలుపెట్టడం, అదే సమయంలో ఈ స్కామ్ వెనకున్న వ్యక్తి కోసం అర్జున్ ప్రయత్నించే సన్నివేశాలతో ద్వితీయార్థం బాగానే అనిపిస్తాయి. అయితే హీరో వాటిని చేదించడం మరీ అంతగా ఆకట్టుకోవు. ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసేశామన్న ఫీలింగ్ కలగవచ్చు. ప్రథమార్థం సగభాగం తరువాత ఉండే ఆత్రుత.. ద్వితీయార్థంలోకి ఉండదు. తదుపరి సన్నివేశాలు ఏంటన్నది ప్రేక్షకుడు ఊహించడం, దానికి తగ్గట్టే కథనం ముందుకు సాగడంతో సెకండాఫ్ ఆసక్తిని రేకెత్తించదనిపిస్తుంది. చివరకు క్లైమాక్స్‌ కూడా ఏంటో ముందే అర్థమవ్వడం, ఏదో ఇక తప్పదు క్లైమాక్స్ ముగించేయాలన్నట్లు చకచకా చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటులు..

నటీనటులు..

నిఖిల్ మంచి నటుడన్న విషయం అందరికీ తెలిసిందే. మరోసారి అర్జున్ లెనిన్ సురవరం పాత్రలో చక్కగా నటించాడు. ఈ చిత్రంలో యాక్షన్ మోతాదు పెంచేశాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ నిఖిల్ ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఈ చిత్రాన్ని తన భుజాన మోసి.. ఒడ్డుకు తీసుకొచ్చాడు. కావ్యగా నటించిన లావణ్య త్రిపాఠి లుక్స్ పరంగానే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లోనూ బాగానే నటించింది. గ్యాప్ తరువాత వచ్చిన ఈ హీరో హీరోయిన్లకు ఈ చిత్రం కలిసి వచ్చేలానే ఉంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ నవ్వించడమే కాదు.. ఎమోషనల్ సీన్‌లో ఏడ్పించేశాడు. కెమెరామెన్ రాంబాబు పాత్రలో సత్య ఎప్పటిలానే నవ్వించేశాడు. కానిస్టేబుల్ పాత్రలో సుబ్బారావ్‌గా పోసాని కూడా చక్కని నటన కనబర్చాడు. నిజాయితీ గత పోలీస్ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. నెగెటివ్ రోల్ చేసిన తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ఆ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. మిగతా పాత్రల్లో నాగినీడు, ప్రగతి, విద్యుల్లేఖ లాంటి వారు తమ పరిధి మేరకు నటించారు.

దర్శకుడి పనితీరు

దర్శకుడి పనితీరు

ఓ భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో తెరకెక్కించడం అంటే కత్తి మీద సామే. ఉన్నది ఉన్నట్లు తెరక్కిస్తే నచ్చదనే అభిప్రాయం కొందరికి ఉండగా.. నేటివిటీ అంటూ కథలో ఇష్టమొచ్చినట్టు మార్పులు చేస్తే ఫీల్ దెబ్బతింటుందని మరికొంత మంది వాదన. ఇదే సూత్రం ఈ సినిమాకు కూడా వర్తిస్తుంది. ఒరిజినల్ మూవీ (కణిథన్) చూస్తే కలిగే ఆసక్తి, ఉత్కంఠగా అర్జున్ సురవరంను చూస్తూ కలగకపోవచ్చు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో చాలానే మార్పులు చేశాడు దర్శకుడు టి సంతోష్. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చేసిన మార్పులు కూడా ఫర్వాలేదనిపిస్తాయి. ద్వితీయార్థాన్ని మరింత ఆసక్తికరంగా మలిచితే బాగుండేదేమోనన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలగవచ్చు. క్లైమాక్స్‌ను కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా రాసుకుంటే ఫలితం ఇంకోలా ఉండేదేమో.

సాంకేతిక నిపుణుల పనితీరు

సాంకేతిక నిపుణుల పనితీరు

అర్జున్ సురవరం చిత్రానికి సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శ్యామ్ సీ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం బాగానే ఉన్నాయి. పాటలను అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేయకపోవడం కలిసొచ్చే అంశం. సినిమాటోగ్రఫీ కూడా సినిమా చక్కగా కుదిరింది. ద్వితీయార్థాన్ని ఇంకాస్త పదునుగా ఎడిట్ చేస్తే బాగుండేది. ఆర్ట్ విభాగం, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టున్నాయి.

 ఫైనల్‌గా..

ఫైనల్‌గా..

ఎన్నో వాయిదాల తరువాత వచ్చిన అర్జున్ సురవరం ప్రేక్షకులను బోర్ కొట్టించడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటాడన్న దాని మీదే.. అర్జున్ సురవరం విజయం ఆధారపడి ఉంటుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువైతే అర్జున్ సురవరం చిత్రం కమర్షియల్‌గా మెరుగైన ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్
నిఖిల్
కథ
ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్
ఊహకందేలా సాగే ద్వితీయార్థం
క్లైమాక్స్

Recommended Video

#CineBox : RGV Changed 'Kamma Rajyamlo Kadapa Redlu' Movie Title !
 తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: నిఖిల్, లావణ్య, వెన్నెల కిషోర్, సత్య, నాగినీడు, ప్రగతి తదితరులు
దర్శకత్వం: టీ సంతోష్
నిర్మాత: రాజ్ కుమార్
మ్యూజిక్: శ్యామ్ సీ
సినిమాటోగ్రఫి: సూర్య
ఎడిటింగ్: నవీన్ నూలీ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X