అశోక్‌

By Staff

Ashok
-జోశ్యుల సూర్యప్రకాష్‌
సినిమా: అశోక్‌
విడుదల తేదీ: 13-7-2006
నటీనటులు: ఎన్టీఆర్‌, సమీరారెడ్డి, ప్రకాష్‌రాజ్‌, సంజయ్‌ సూరి,
రాజీవ్‌ కనకాల, వేణుమాధవ్‌, హరిబాబు తదితరులు
సంగీతం: మణిశర్మ
కెమెరా: సెంతిల్‌ కుమార్‌
దర్శకుడు: సురేందర్‌ రెడ్డి
నిర్మాత: వల్లూరిపల్లి రమేష్‌

తెలుగు సెంటిమెంట్‌తో 'కిల్‌బిల్‌' తరహా యాక్షన్‌ ఎపిసోడ్లతో తయారైన మాస్‌ చిత్రం 'అశోక్‌'. కథగా ఎన్నోసార్లు తెరకెక్కిందే అయినా కథనంలో కొద్దిగా ప్రత్యేకత చూపుతూ చేసిన ప్రయత్నమిది. పూర్తిగా ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ చిత్రంలో పాటలు బాగుండకపోవడం, మితిమీరిన హింస, ఎంటర్‌టైన్‌మెంట్‌ కొద్దిగా కూడా లేకపోవడంతో మైనస్‌గా మారింది. సెంటిమెంట్‌ పట్టితే బి,సి సెంటర్లలో ఆడే అవకాశముంది. 'అశోక్‌'గా ఎన్టీఆర్‌ తనదైన శైలిలో చూపిన భావోద్వేగాలు అభిమానులను అలరిస్తాయి.‌

అశోక్‌ (ఎన్టీఆర్‌) సబ్‌ రిజ్రిస్టార్‌ ప్రకాష్‌రాజ్‌ కొడుకు. సమాజంలో జరిగే అన్యాయాలకు ఆవేశపడి, క్రమశిక్షణతో ఉండే తండ్రికి దూరమవుతాడు. ఓ పాట పాడుతుండగా పరిచయమైన సమీరారెడ్డితో ప్రేమలో పడతాడు. పాత బస్తీలో ఆటోమొబైల్‌ దుకాణం నడుపుకునే అతని ఆప్త మిత్రుడు రాజీవ్‌ (రాజీవ్‌ కనకాల). ఓ రోజు చెల్లితో బయటకు వెళ్తుంటే, సిటీలో పేరుబడ్డ గూండా కెకె (సోనూ సూద్‌) అనుచరులతో అనుకోకుండా తలపడాల్సివస్తుంది. ఆ గొడస పెద్దదవుతున్న సమయంలో కొద్ది రోజులకు కెకె కన్ను సమీరాపై పడుతుంది. విలన్‌, హీరో ఇద్దరూ ఒకే అమాయి కోసం పోరాటం మొదలు పెడతారు. 'ఒక్కడు'లా అశోక్‌ విజృంభిస్తాడు. అది తట్టుకోలేని కెకె ప్రకాష్‌రాజ్‌ని పిలిచి వార్నింగ్‌ ఇస్తాడు. అప్పటివరకు కొడుకుతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని ఆ తండ్రి పిలిచి ప్రేమగా మాట్లాడుతాడు. కుటుంబంతో సంబంధాలు ఇలాగే కొనసాగాలంటే ఢిల్లీ వెళ్ళి ఉద్యోగంలో చేరమంటాడు. కాదనలేక అశోక్‌ వెళ్ళిపోతాడు. కెకె మనుషులు సమీరాను పెళ్ళి చేసుకోమని వేధిస్తుంటే రాజీవ్‌ అడ్డుపడి 'మాస్‌'లో సునీల్‌లా మరణిస్తాడు. ఆ విషయం తెలిసిన అశోక్‌ ప్రతిస్పందన ఏమిటి? కెకె ఎలా బుద్ధి చెప్పాడన్నది తెర మీద చూడాల్సిందే.‌

'తమ్ముడు', 'గౌతం, ఎస్‌ఎస్‌సి', 'ఒక్కడు', 'వర్షం' కలగలిపినట్టున్న ఈ కథ తెలిసిందే అయినా ఓపెనింగ్‌ సీక్వెన్స్‌, ఇంటర్వల్‌ ఫైట్‌ బాగున్నాయి. కానీ ఆ కథలు తెలిసినవే కావడంతో కథనం ప్రేక్షకులు ఊహించేవిధంగానే సాగింది. 'అతనొక్కడే'ను గుర్తు చేస్తూ సీన్‌ వచ్చాక వెనక్కి వెళ్ళి అంతకు ముందు ఏం జరిగిందో ఫ్లాష్‌కట్‌లో పదే పదే చూపడం బోరే. స్క్రీన్‌ప్లే ఫస్టాఫ్‌ కథ, సెటప్‌తో కాలం గడిపి సెకండాఫ్‌లో యాక్షన్‌లోకి తెచ్చారు. కథలో బలమైన బీట్స్‌ అయిన నాయనమ్మ చనిపోవడం, హీరోయిన్‌తో ప్రేమను పూర్తిగా ఎస్టాబిష్‌ చేయకపోవడం కథా లోపం. విపరీతమైన హింసను చూపించడం హర్షణీయం కాదు. వినోదం మిస్‌ అయిన ఈ సినిమాలో మరుధూరి మాటలు కొంత ఓదార్పు. దర్శకత్వపరంగా హీరో విలన్‌ ఇంట్రడక్షన్‌ సీన్లు మెచ్చుకోదగిన రీతిలో ఉన్నాయి.‌

పాటల ప్లేస్‌మెంట్‌ సరిగా లేకపోవడంతో కథనానికి అడ్డుపడ్డాయి. రీ రికార్డింగ్‌ బాగుంది. కెమెరా కొన్ని చోట్ల హాలివుడ్‌ను తలపించడం బాగుంది. సోనూ సూద్‌ కథకు అనుగుణంగా మంచి విలనిజం ప్రదర్శించారు. సినిమాలో పెద్ద క్రెడిట్‌ స్టంట్స్‌ కంపోజ్‌ చేసిన స్టన్‌ శివదే. జీవా, రఘుబాబు ఎపిసోడ్‌ బాగుంది. 'ఏం పీక్కుంటారో పీక్కోండి ' ఆంటూ చిన్న పిల్లాడితో పెద్ద డైలాగులు చెప్పించడం హర్షణీయం కాకపోయినా రెస్పాన్స్‌ బాగుంది. సమీరారెడ్డి నుంచి కుర్రకారు ఆశించే అందాల ప్రదర్శన అంతగా లేదు. మాస్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమా బి.సి సెంటర్లలో మాత్రమే ఆడే అవకాశముంది.‌

గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X