Don't Miss!
- News
రామానుజాచార్యులవారి బ్రహ్మోత్సవాలు- 12 రోజుల పాటు: కంప్లీట్ షెడ్యూల్ ఇదే..!!
- Lifestyle
మొదటి నెలల్లో గర్భస్రావం జరగడానికి కారణాలు, ఈ చిట్కాలతో సేఫ్‌గా ఉండొచ్చు
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Ashoka Vanamlo Arjuna Kalyanam movie review ఆకట్టుకొన్న విశ్వక్ సేన్.. కానీ మూవీ పరిస్థితే?
తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన శైలిలో రాణిస్తున్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఇటీవల కాలంలో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రముఖ మీడియా చానెల్‌తో జరిగిన వివాదంతో విశ్వక్ సేన్ మూవీపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందంటే..

సినిమా కథ ఏమిటంటే?
తెలంగాణలోని సూర్యాపేట్‌కు చెందిన వడ్డీవ్యాపారి అర్జున్ (విశ్వక్ సేన్). 32 ఏళ్లు దాటినా పెళ్లికాని ప్రసాద్‌గా ఉంటాడు. ప్రతీసారి ఏదో కారణంతో పెళ్లి వాయిదాలు పడుతుంటాయి. అయితే చివరకు ఆంధ్రాలోని అశోక్ పురానికి చెందిన మాధవి (రుక్సార్ థిల్లాన్)తో పెళ్లిచూపులు జరుగుతాయి. పెళ్లి చూపుల తర్వాత కొన్ని కారణాల వల్ల మాధవి ఇంటిలోనే అర్జున్ కుటుంబం ఉండిపోవాల్సి వస్తుంది. తొలి చూపులోనే అర్జున్ మనసు దోచుకొన్న మాధవి మరో యువకుడు (అశోక్ సెల్వన్)తో లేచిపోతుంది.

కథ, కథనాల్లో ట్విస్టులు
పెళ్లిచూపులు జరిగిన తర్వాత అర్జున్ కుటుంబం మాధవి గ్రామంలోనే ఎందుకు ఉండిపోయింది? ఏ పరిస్థితుల్లో ఎవరికి చెప్పపెట్టకుండా మాధవి లేచిపోయింది? వసుధ (రితికా నాయక్)కు అర్జున్‌కు సంబంధం ఏమిటి? చివరకు అర్జున్ పెళ్లి జరిగిందా? పెళ్లి జరిగితే ఎవరితో జరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ కథ.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే?
అర్జున్ పెళ్లి కష్టాలు, పెళ్లి చూపులతో సినిమా చాలా నిదానంగా మొదలవుతుంది. కథలోకి వెళ్లే ముందు డిటెయిలిటీ కాస్త ఎక్కువ కావడంతో బోర్‌గా ఉంటుంది. కథలో ఫన్ గానీ, ఎమోషనల్ సన్నివేశాలు పెద్దగా లేకపోవడం వల్ల కథ, కథనాలు రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌కు 10 నిమిషాల ముందు కథ, కథనాలు కాస్త ఊపును కలిగిస్తాయి. అలా ఈ సినిమా తొలి భాగం ఎలాంటి కొత్తదనం లేకండా సాదాసీదాగా సాగుతుంది.

సెకండాఫ్ ఎలా ఉందంటే?
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా సెకండాఫ్ విషయానికి వస్తే.. వసుధ క్యారెక్టర్ ఎలివేషన్ కావడంతో కథ ఫీల్‌గుడ్‌గా మారుతుంది. అలాగే మార్కెట్‌లో ఫైట్ తర్వాత కథ మరింత ఎమోషనల్‌గా ఉంటుంది. చివరి 20 నిమిషాల్లో విశ్వక్ సేన్ యాక్టింగ్, రితికా నాయక్ ఫెర్ఫారెన్స్ ఆకట్టుకొంటాయి. దాంతో సినిమా ఓకే.. చివరకు బాగుంది అనే ఫీలింగ్ కలిగిస్తుంది.

మెప్పించిన విశ్వక్ సేన్
విశ్వక్ సేన్ ఇప్పటి వరకు రకరకాల పాత్రలతో మెప్పించ ప్రయత్నం చేశాడు. అశోకవనంలో అర్జున కల్యాణం విషయానికి వస్తే.. గతంలో పోషించిన పాత్రలకంటే డిఫరెంట్‌గా లుక్‌పరంగా, యాక్టింగ్ పరంగా కనిపించాడు. సెకండాఫ్‌లో విశ్వక్ సేన్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో బాడీ లాంగ్వేజ్ బాగుంది. యాక్టర్‌గా విశ్వక్ డిఫరెంట్‌గా కనిపించాడు.

రితికా గ్లామర్ అదుర్స్
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. రుక్సర్ థిల్లాన్ మెయిన్ హీరోయిన్‌గా అనిపించినా.. మంచి మార్కులు రితికా నాయక్ కొట్టేసింది. రుక్సర్ థిల్లాన్ ఫస్టాఫ్'లో తన మార్క్ నటనను ప్రదర్శించింది. కానీ రితికా నాయక్ మాత్రం గ్లామర్ పరంగా, నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా నటించింది. రితికా నాయక్ చాలా అందంగా కనిపించడమే కాకుండా అభినయంతో మెప్పించింది. మిగితా క్యారక్టర్లలో కాదంబరి కిరణ్ కుమార్, రమణ తదితరులు ఒకే అనిపించారు.

యావరేజ్‌గా టెక్నికల్ టీమ్ పనితీరు
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. పవి కే పవన్ సినిమాటోగ్రఫి బాగుంది. సెకండాఫ్‌లో డైలాగ్స్ ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ఎడిటింగ్‌కు స్కోప్ ఉంది. మ్యూజిక్ కొన్ని సీన్లను బాగా ఎలివేట్ చేసింది. పాటలు అంతగా ఆకట్టుకొలేకపోయాయి. సాంకేతిక విభాగాల పనితీరు యావరేజ్‌గానే ఉంది. బాపినీడు బీ, సుధీర్ ఎడారా పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?
అశోకవనంలో అర్జున కళ్యాణం మంచి వినోదానికి, ఫీల్‌గుడ్‌కు స్కోప్ ఉన్న చిత్రంగా అనిపిస్తుంది. కానీ దర్శక, నిర్మాతలు ఆ దిశగా ఆలోచించినట్టు కనిపించలేదు. ఎమోషనల్ అంశాలు తోడైన ప్రేమకథకు ఫన్, కామెడీ మరింత జోడించి ఉంటే డెఫినెట్‌గా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయి ఉండేది. ఆ అవకాశం చేజారిందనే విషయం స్పష్టంగా కనిపించింది. ఓటీటీలో ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకొనే అవకాశాలు బాగానే ఉన్నాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణుల
నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సర్ ధిల్లాన్, రితికా నాయక్, అశోక్ సెల్వన్, గోపరాజు రమణ తదితరులు
దర్శకత్వం: విద్యాసాగర్ చింతా
నిర్మాతలు: బాపినీడు బీ, సుధీర్ ఎడారా
మ్యూజిక్ డైరెక్టర్: జయ్ క్రిష్
సినిమాటోగ్రఫి: పవి కే పవన్
ఎడిటర్: విప్లవ్ నైషాద్యం
రిలీజ్ డేట్: 2020-05-06