twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిఫరెంటుగా ఉంది... (అసుర రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5

    హైదరాబాద్: నారా రోహిత్. ఏదో ఒక స్టోరీ ఎంచుకుని నాలుగు కమర్షియల్ అంశాలు జొప్పించి...అందరూ నడిచే దారిలోనే సదాసీదా సినిమాలు తీద్దామనే రకం కాదు. తొలి సినిమా ‘బాణం' దగ్గర నుండి రోహిత్ విభిన్నమైన కథలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. నారా రోహిత్‌ ఈ సారి 'అసుర'లో సిన్సియర్‌ జైలర్‌ ధర్మతేజగా మరోమారు ఖాకీ డ్రెస్‌లో కనిపించాడు. సినిమా ఎలా ఉందనే దానిపై ఓ లుక్కేద్దాం..

    Asura Movie Review

    కథ విషయానికొస్తే...
    జైలర్ ధర్మతేజ (నారా రోహిత్). సిన్సియర్ ఆఫీసర్. తన జైలును అహర్నిశలు రక్షించడానికే ఉంటాడు. ఉద్యోగంలో పని రాక్షసుడుగా పేరు సంపాదిస్తాడు. రూల్స్ కన్నా రిజల్సే ముఖ్యం అనుకుంటాడు. జైలుకి చంద్రశేఖర్ అలియాస్ చార్లీ(రవి వర్మ) అనే కొత్త ఖైదీ వస్తాడు. సంపన్నుడైన దిలీప్ కొఠారికి మొదటి భార్యకొడుకు. తండ్రి చనిపోవడంతో రెండవభార్య భారతీదేవి(రూపాదేవి) ని చేరువ కానివ్వకపోగా ఆమె ముగ్గురుపిల్లల్ని చంపేస్తాడు. చార్లీకి పడ్డ ఉరిశిక్షకు క్షమాభిక్ష దొరకదు. ఎలాగైనా జైలునుండి తప్పించుకోవాలని మరో ఖైదీ పాండూ సహాయంతో బయటవున్న ముత్యంనాయుడు, దయ గ్యాంగ్ తో సంబంధం పెట్టుకుంటాడు. వారి సహాయంతో ధర్మ ప్రియురాలిని (ప్రియా బెనర్జీ), మేజిస్ర్టేట్‌ కొడుకును, ఉరి తీసే తలారి తల్లిని కిడ్నాప్‌ చేయిస్తాడు. ఆ తర్వాత కథ ఆసక్తికరంగా సాగుతుంది.

    పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే... నారా రోహిత్ గత సినిమాలకు భిన్నంగా ఉంటాడు. గత సినిమాలకు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. హీరోయిన్ ప్రియా బెనర్జీ ఉన్నంతలో ఆకట్టుకుంది. చార్లీ గా రవివర్మ, అతనికి బయట నుండి సాయపడే గ్యాంగ్‌ లీడర్‌ గా మధు సింగంపల్లి, భారతీదేవి పాత్రలో రూపాదేవి వారి పాత్రలకు న్యాయం చేసారు.

    దర్శకుడు కృష్ణ విజయ్ ఎంచుకున్న కాన్సెప్టు బావుంది. కొత్తవాడైనా దర్శకత్వంలో పరిణితి కనిపించింది. స్క్రీన్ ప్లే ఫర్వాలేదు. అయితే ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడంలో విఫలం అయ్యాడు. సాయికార్తీక్‌ సంగీతం, ఎస్‌.వి. విశ్వేశ్వర్‌ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. అయితే ఎడిటింగ్ లో కొన్ని లోపాలున్నాయి.

    నారా రోహిత్ పెర్ఫార్మెన్స్, ఎంచుకున్న కథ, స్క్రీన్ ప్లే ఫర్వాలేదనిపించినా... సినిమా చాలా స్లోగా సాగడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చినా పెద్దగా ఆకట్టుకునే విధంగా ఏమీ లేదు. అయితే రెగ్యులర్ కమర్షియల్ మసాలా సినిమాలు ఇష్టపడే వారికి ఏమో కానీ, డిఫరెంటు కాన్సెప్టులు ఇష్టపడేవారికి ఈ సినిమా ఓకే అనిపించొచ్చు.

    English summary
    Nara Rohit, who always comes up with an interesting script, has been said to be trying out his luck with yet another promising film. Let us see if his film Asura, lives up to those promises he has made before release. On the whole, Asura is an intense thriller with a good interval bang and an amazing warp at the wrap. It's ideal run time would be make it a perfect watch and Nara Rohit did keep up his words and passion for the craft.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X