పరమ డొక్కు...(అతడు ఆమె ఓ స్కూటర్.. రివ్యూ)

By Bojja Kumar

హైదరాబాద్ : కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా లక్ష్మణ్ గంగారపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అతడు ఆమె ఓ స్కూటర్'. ప్రియాంక చాబ్రా హీరోయిన్‌గా పరిచయమైన ఈచిత్రాన్ని జగదీష్ చంద్ర, అమరేందర్ రెడ్డి నిర్మించారు. చిన్ని కృష్ణ సంగీతం అందించారు. హీరో హీరోయిన్లు విత్ స్కూటర్‌తో ప్రేక్షకులకు వినోదం పంచడంలో దర్శకుడు ఏ మేరకు సక్సెస్ అయ్యాడో చూద్దాం...

Athadu Aame O Scooter

కథ విషయానికొస్తే...భీమవరం బుల్లోడైన గోవిందరాజు(వెన్నెల కిషోర్) బిఏ పాసైనా ఏ పనీ చేయకుండా వారసత్వంగా వచ్చిన డొక్కు స్కూటరేసుకుని గాలి తిరుగుడు తిరుగుతుంటాడు. దీంతో గోవిందరాజు మామ తన కూతురును వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. దీన్ని అవమానంగా ఫీలైన గోవిందరాజు.....నీ కూతురు కంటే అందమైన అమ్మాయని పెళ్లి చేసుకుని ముందుగా పిల్లల్ని కంటానని మామకు సవాల్ చేస్తాడు.

ఈక్రమంలో ఆ తర్వాత ఫ్రెండ్ రాజేష్(తాగుబోతు రమేష్) తో కలిసి హైదరాబాద్ ప్రయాణమవుతాడు. అక్కడ గోవిందరాజుకి లక్కీ(ప్రియాంక చాబ్రా)తో పరిచయం అవుతుంది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే లక్కీ పెట్టిన కొన్ని కండీషన్ల వల్ల తాను అనుకున్నది చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అపుడు గోవిందరాజు ఏం చేసాడు? అనేది తర్వాతి కథ.

పెర్ఫార్మెన్స్ పరంగా వెన్నెల కిషోర్ ఓకే. దర్శకుడు అతన్ని సరిగా వాడుకుని ఉంటే మరింత బాగా చేసే వాడేమో. గ్లామర్ పరంగా హీరోయిన్ ప్రియాంక చాబ్రా గ్లామర్ పరంగా ఓకే కానీ నటనలో మాత్రం వీక్. తాగుబోతు రమేష్‌ అక్కడక్కడా నవ్వించాడు. ధన్ రాజ్ చేసిన కామెడీ సీన్ బాగుంది. సినిమాలో కనిపించే స్కూటరే కాదు కథ కూడా పరమ డొక్కు రొటీన్ స్టోరీలైన్. స్క్రీన్ ప్లే కూడా ప్రేక్షకులకు విసుగు తెచ్చే విధంగా ఉంది. టెక్నికల్ అంశాల పరంగా చూస్తే సినిమాటోగ్రఫీ ఒక్కటే కాస్త ఫర్వాలేదు అనే విధంగా ఉంది. ఇక ఏ సాంకేతిక విభాగం కూడా బాగుందని చెప్పే విధంగా పనితీరు కనబర్చలేదు.

పేరుకు కామెడీ సినిమానే కానీ సినిమాలో కామెడీ సీన్లు రెండు మూడు చోట్ల తప్ప ఎక్కడా నవ్వించలేదు. రెండు మూడు చోట్ల డైలాగులు బాగున్నాయి. ఓవరాల్‌గా 'అతడు ఆమె ఓ స్కూటర్' పరమ బోరింగ్ సినిమా.

తారాగణం : వెన్నెల కిషోర్, ప్రియాంక చాబ్రా, తాగుబోతు రమేష్, ధన్ రాజ్
నిర్మాత : అమరేందర్ రెడ్డి, జగదీష్ చంద్ర
సంగీతం : చిన్ని కృష్ణ
దర్శకత్వం : లక్ష్మణ్ గంగారపు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X