Athidhi Web Series Review దెయ్యం ఎవరు? ఇంటెన్స్ రోల్‌తో వేణు.. అతిథి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Rating: 2.75/5

నటీనటులు: వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా, వెంకటేష్ కాకుమాను, అదితి గౌతమ్, రవివర్మ, భద్రం తదితరులు
దర్శకత్వం: వైజీ భరత్
నిర్మాత: ప్రవీణ్ సత్తారు
మ్యూజిక్: కపిల్ కుమార్
సినిమాటోగ్రఫి: మనోజ్ కాటసాని
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్
ఎపిసోడ్స్: 6 (ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాలు)
ఓటీటీ రిలీజ్ డేట్:

అతిథి వెబ్ సిరీస్ కథ: రవి వర్మ (వేణు తొట్టెంపూడి) రచయిత కథలు రాస్తుంటాడు. పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్న భార్య సంధ్య (ఆదితి గౌతమ్)కు సపర్యలు చేస్తూ దట్టమైన అడవిలోని గెస్ట్ హౌస్‌లో ఆమెతో కలిసి జీవిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ వర్షం కురిసిన రాత్రి మాయ (అవంతిక మిశ్రా) ఆశ్రయం కోసం రవివర్మ గెస్ట్ హౌస్ తలుపు తడుతుంది. ఆ తర్వాత దెయ్యాలపై వీడియోలు తీసే యూట్యూబర్ సవారీ (వెంకటేష్ కాకమాను) ఆ ఇంటిలోకి వస్తాడు.

Athidhi Telugu Web Series Review and Rating

అతిథి వెబ్ సిరీస్‌లో ట్విస్టులు: రవివర్మ గెస్ట్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మాయ, సవారీ మధ్య ఏం జరిగింది? మాయ మనిషా? దెయమ్యా? మాయ విషయంలో యూట్యూబర్‌ సవారీకి రవి వర్మకు జరిగిన ఘర్షణ ఏమిటి? ఆ ఘర్షణ ఎలాంటి పరిస్థితికి దారి తీసింది? ఈ నేపథ్యంలో ఆ ఇంటిలోకి వచ్చిన పోలీస్ ఆఫీసర్ (రవివర్మ).. సవారీ, రవి వర్మను ఎలా? ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారు? రవి వర్మ ఇంటిలో ఉన్న అసలు దెయ్యం ఎవరు? అలా ఆత్మగా మారడానికి కారణాలు ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే అతిథి వెబ్ సిరీస్ కథ.

దర్శకుడి ప్రతిభ, టేకింగ్: దర్శకుడు వైజీ భరత్ ఎంచుకొన్న పాయింట్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కథ బాగుంది. కానీ ఆ కథను ఇంకా ఎమోషనల్‌‌గా చెప్పే అవకాశం ఉంది. ఆ ఛాన్స్‌ను దర్శకుడు మిస్ చేసుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ కథ చెప్పడం మొదలు పెట్టిన విధానం బాగుంది. క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేసిన తీరు, ఆ క్యారెక్టర్ల మధ్య నడిపించిన డ్రామా తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరుగుతందనే క్యూరియాసిటీని కలిగించడంలో భరత్ సక్సెస్ అయ్యాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఉన్న డెప్త్‌కు తగినట్టు సన్నివేశాలను మరింత ఎమోషనల్‌గా మలిచి ఉంటే సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ జోనర్‌లో మంచి వెబ్ సిరీస్ అయి ఉండేదనిపిస్తుంది.

Venu Thottempudi lives upto the Character

వేణు ఇతర నటీనటులు ఫెర్ఫార్మెన్స్: లవర్ బాయ్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేణు అందరికి సుపరిచితులు. అతిథిలో రవి వర్మ పాత్ర విషయానికి వస్తే.. ఇంటెన్స్, ఎమోషనల్ కంటెంట్ ఉన్న రోల్‌ను చక్కగా ఎలివేట్ చేశారు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా క్యారెక్టర్‌‌లో హుందాగా కనిపించారు. వయసు తగిన పాత్రలో బాగా మెచ్యురిటీని చూపించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఇంకా బెటర్ చేయడానికి స్కోప్ ఉందనిపించింది. మాయగా అవంతిక, సంధ్యగా అదితి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వెంకటేష్ కాకమాను కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది. రవివర్మ విలనిజం కథకు తగినట్టుగా ఉంది. రవి వర్మకు ఇది కొంత రొటిన్ రోల్‌గానే కనిపించింది.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?: అతిథి మూవీ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కపిల్ కుమార్ తన వంతుగా వెబ్ సిరీస్‌కు సపోర్టుగా నిలిచారు. మనోజ్ సినిమాటోగ్రఫి బాగుంది. తొలి మూడు ఎపిసోడ్స్‌లో సన్నివేశాలకు తగినట్టుగా మూడ్ క్రియేట్ చేయడంలో అతడు ఉపయోగించిన లైటింగ్ బాగుంది. ధర్మంధ్ర ఎడిటింగ్ ఒకే. ప్రవీణ్ సత్తారు షో రన్నర్‌గా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

Athidhi Telugu Web Series

ఫైనల్‌గా అతిథి ఎలా ఉందంటే?: తెలుగు ఇండస్ట్రీలో దెయ్యం కథలతో ఇంతకు ముందు చాలా మంది దర్శకులు విభిన్నంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఘోస్ట్ బ్యాక్ డ్రాప్‌తో రాజ వంశం, రాజుల పాలనతో కుట్రలు, కుతంత్రాలు, ప్రేమ లాంటి అంశాలను చెప్పే ప్రయత్నం అతిథి వెబ్ సిరీస్‌లో ఆకట్టుకొనే అంశాలు. తక్కువ మంది ఆర్టిస్టులు, బడ్జెట్‌తో గ్రాండియర్‌గా వెబ్ సిరీస్ కనిపిస్తుంది. ఘోస్ట్ కథలతో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే వారికి అతిథి వెబ్ సిరీస్ నచ్చుతుంది. డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. కాబట్టి తీరిక వేళలో మంచి మూడ్ సెట్ చేసుకొని చూడండి.. తప్పకుండా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X