సగటు 'అతిథి'- సమీక్ష

By (కవుటూరి శేషు)
Athidi
Rating
సినిమా: అతిథి
విడుదల తేదీ: అక్టోబర్ 18, 2007
బ్యానర్: కృష్ణ ప్రొడక్షన్స్
నటీనటులు: మహేష్ బాబు, అమృతారావు, ఆశిష్ విద్యార్ధి, వేణు మాధవ్,
సునీల్, బ్రహ్మానందం, నాజర్, రాజీవ్ కనకాల, కోట శ్రీనివాసరావు, అజయ్
సంగీతం: మణిశర్మ
స్టంట్స్: స్టన్ శివ
నిర్మాత: జి. రమేష్ బాబు (మహేష్ బాబు అన్న)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి. సురేందర్ రెడ్డి

అతిధి (మహేష్ బాబు) ఒక అనాధ. ఏడేళ్ళ వయసులో ఢిల్లీలో ఒక జంట అతడిని అక్కున చేర్చుకుని, అల్లారు ముద్దుగా పెంచుతారు. ఆ జంటను ఒక దుర్మార్గుడు పెద్ద కారణం లేకుండానే చంపుతాడు. అతను అతిధి చేతిలో రివాల్వర్ ఉంచి పరారవుతాడు. ఆ దంపతుల సొంత కుమార్తె చిన్నారి అమృత ( అమృతారావు) తన తలిదండ్రులను అతిథే చంపాడని అనుకుంటుంది.

పద్నాలుగేళ్ళ తర్వాత అతిధి జైలు నుంచి విడుదల అవుతాడు. తనను పెంచుకున్న జంటను కాల్చి చంపిన వారిని పట్టుకోవడం అతని ధ్యేయం. అతని వద్ద హంతకుడి ఫోటో మాత్రమే ఉంటుంది. ఇతర క్లూలు ఏమీ ఉండవు. పనిలో పనిగా హీరోగారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన అమృతకు నోటి ద్వారా ఆక్సిజన్ పంప్ చేసి రక్షిస్తాడు.తనను పెంచుకున్న జంట కుమార్తే ఈ అమృత అని అతిధి తెలుసుకుంటాడు. అదే సమయంలో అమృతను చంపడానికి కైజర్ (కొత్త నటుడు) అనే మాఫియా డాన్ ప్రయత్నిస్తూ ఉంటాడు. తన తలిదండ్రులను చంపిన వాడే ఈ అతిధి అని తెలుసుకోడానికి అమృతకు ఎంతో సమయం పట్టదు. ఈ దశలో సినిమా మంచి రసపట్టులో పడుతుంది. కైజర్ ను అంతమొందించడం హీరోగారి పరమ లక్ష్యంగా మారుతుంది. లక్ష్య సాధనలో హీరో ఎన్ని ఇబ్బందులు పడి, చివరికి ఎలా విజయం సాధిస్తాడో తెరమీద చూడాల్సిందే.

మహేష్ బాబు ఎప్పటి లాగే అద్భుతంగా నటించాడు. సినిమా ఫస్టాఫ్ లో కొంత బోర్ కొట్టించినా సెకండాఫ్ లో పాత్రల మధ్య సంఘర్షణ కారణంగా రక్తి కట్టింది. కథ పాతది. పోకిరి చాయలు ఇందులో కన్పించడం పెద్ద మైనస్ పాయింట్.మహేష్ బాబు సినిమా మొత్తాన్ని త్న భుజాన వేసుకుని నడిపించాడు. కొత్త నటుడిని విలన్ గా పరిచయం చేయడం, అతను త్న పాత్రకు న్యాయం చేయడం గొప్ప విశేషం.

హీరోయిన్ అమృతారావు అందంగా, అమాయకంగా, పదహారణాల తెలుగు అమ్మాయిలా నటించింది. మహేష్ బాబుకు ఆమే సరైన జోడి అన్నట్టుగా ఉంది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ సరిగా పండలేదు. ఫస్టాఫ్ లో మాత్రమే కన్పించిన వేణు మాధవ్ కామెడీ సో సో గా ఉంది. సెకండాఫ్ లో సునీల్ కామెడీ కొంత మెరుగ్గా ఉంది. మొత్తమ్మీద సినిమాలో కామెడీలైన్ బలహీనంగా ఉంది. కథ అందరూ ఊహించుకునేదే. దర్శకుడు ఫస్టాఫ్ ను ప్రధాన స్రవంతి లోకి తేకుండా వృధా చేశాడు. ఇంటర్వల్ బ్యాంగ్ లో ఉలికిపడే మలుపును చూపించడంలో మాత్రం డైరెక్టర్ విజయవంత మయ్యాడు. అక్కడక్కడా కథలో టిస్ట్ లు ఉండబట్టి సరిపోయింది.

ఈ సినిమాకు స్టంట్స్ ప్రాణం పోశాయి. మహేష్ బాబు డైనమిజానికి తగినట్టు స్టన్ శివ ఫైట్లను డిజైన్ చేసుకున్నాడు. అయితే మితిమీరిన హింస ( సురేందర్ రెడ్డి మార్కు) జుగుప్స కలిగిస్తుంది. సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్లను దర్శకుడు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. పాటలు బయట వినడానికి బాగున్నా చిత్రీకరణ బాగుండలేదు. విదేశాల్లో చిత్రీకరించిన ఒకటి రెండు పాటలు ఫర్వాలేదు.

మహేష్ బాబు స్టైలిష్ నటన సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. కానీ బలహీనమైన కథ, పేలవమైన హాస్యం, మితిమీరిన హింస సినిమాను దెబ్బతీశాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఫరవాలేదనిపించే ఈ సినిమా మామూలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. ఇది యావరేజ్ చిత్రంగా మిగిలిపోతుంది.

(గమనిక: వినోదం అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు,కథన నైపున్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది. సినిమా జయాపజయాలకు మా రేటింగ్ కు సంబందం ఉండనవసరం లేదు)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X