Athiradi First Review: అతిరధి మలయాళం మూవీ ఫస్ట్ రివ్యూ

మలయాళం స్టార్ హీరో టొవినో థామస్, యంగ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ నటించిన తాజా చిత్రం అతిరధి. ఈ చిత్రంలో వినీత్ శ్రీనివాసన్, రియా శిబు, షాన్ రెహ్మాన్, దర్శన రాజేంద్రన్, జరీన్ షాహబ్, విష్ణు అగస్త్య, వినీత్ తట్టిల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అరుణ్ అనిరుధన్ దర్శకత్వం వహించారు. అనంతు ఎస్, బాసిల్ జోసెఫ్ నిర్మాతలుగా వ్యవహరించారు. సహ నిర్మాతలుగా టొవినో థామస్, సమీర్ తాహర్ వ్యవహరించారు.

ఇక ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. అరుణ్ అనిరుధన్, పౌల్సన్ స్కారియా రచనా సహకారం అందించారు. విష్ణు విజయ్ మ్యూజిక్, శామ్యుల్ హెన్నీ సినిమాటోగ్రఫి, ఛమన్ ఛాకో ఎఢిటర్‌గా, మానవ్ సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. బాసిల్ జోసెఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, అనంతు ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రం మలయాళంలో మే 14వ తేదీన, తెలుగు రాష్ట్రాల్లో మే 18వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా సెన్సార్ టాక్ ఏమిటి? ఈ చిత్రం రన్‌టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Athiradi Review by Censor Board

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా కథ కాలేజీ నేపథ్యంగా సాగుతుంది. కాలేజీ ఫెస్టివల్ సెలెబ్రేషన్స్‌‌పై నిషేధం కొనసాగితే.. సామ్ కుట్టి (టొవినో థామస్) ఆ నిషేధాన్ని ఎత్తి వేయించి ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. కానీ విద్యార్థుల గ్రూపులుగా విడిపోయి గొడవలకు దిగుతారు. ఓ గ్రూపుకు సామ్ కుట్టి, మరో గ్రూపుకు నాయకుడిగా (బాసిల్ జోసెఫ్) అమీతుమీ తేల్చుకొనేందుకు రెడీ అవుతారు. దాంతో కాలేజీలో గందరగోళం నెలకొంటుంది. అయితే ఆ గొడవలను సద్దుమణిగేలా చేసి సామ్ కుట్టి ఎలా కాలేజీ ఫెస్టివల్‌ను నిర్వహించాడనేది ఈ సినిమా కథ.

పక్కా వినోదాత్మకంగా, యూత్‌ఫుల్‌గా రూపొందిన ఈ చిత్రంలో ముఖ్యంగా కేరళ నేటివిటి ప్రతిబింబించేలా చిత్రీకరించారు. మలయాళ చిత్ర రంగంలోని ప్రమాణాలకు అనుగుణంగా ఈ సినిమాను కంటెంట్ ప్రధానంగా రూపొందించారు. అయితే ఈ సినిమాలోని కంటెంట్‌పై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. స్వల్ప మార్పులతో ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక ఈ సినిమాలో అభ్యంతరాలు చెప్పడానికి ఎలాంటి వివాదాస్పదమైన అంశాలు లేకపోవడంతో యూ (U) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రాన్ని ఎవరైనా ఎలాంటి అభ్యంతరం లేకుండా వయోపరిమితి లేకుండా చూడొచ్చు అని తెలిపారు. ఈ సినిమాకు రన్ టైమ్ మధ్యస్థంగా ఉండేలా చూసుకొన్నారు. ఈ సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు. అంటే ఈ చిత్రం 157 నిమిషాల రన్‌టైమ్‌తో సాగుతుంది అనే విషయం సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ద్వారా స్పష్టమైంది.

ఈ చిత్రంలో స్టూడెంట్ ఎమోషన్స్, యాక్షన్, ఫ్రెండ్‌షిప్ అంశాలు కీలకంగా ఉంటాయి. టొవినో థామస్, బాసిల్ జోసెఫ్ పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు మంచి పేస్‌తో చకచకా సాగిపోతుందనే టాక్ సెన్సార్ రివ్యూ తర్వాత బయటకు వచ్చింది. గత త కొద్దికాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న టొవినోకు మంచి ఫలితం అందేలా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం గురించి మరిన్నీ అప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Read more about: tovino thomas basil joseph
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X