Avatar: Fire and Ash Movie Review: అవతార్ 3 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

మూవీ: అవతార్: ఫైర్ అండ్ యాష్
నటీనటులు: సామ్ వర్తింగ్డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, ఊనా చాప్లిన్ తదితరులు
దర్శకత్వం: జేమ్స్ కామెరాన్
నిర్మాతలు: జేమ్స్ కామెరాన్, జాన్ లండావు
సినిమాటోగ్రఫి: రస్సెల్ కార్పెంటర్
మ్యూజిక్: సైమన్ ఫ్రాంగ్‌లెన్
ఎడిటింగ్: స్టీఫెన్ రివికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరాన్
రిలీజ్ డేట్: 2025-12-19

జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) దంపతులు తమ కుమారుడు నెతేయమ్ మరణంతో తీవ్రమైన విషాదంలో కూరుకుపోతారు. ఈ నేపథ్యంలో వారు మాత్రం హ్యుమన్ కాలనీలపై ఎదురు దాడికి సిద్దమవుతారు. నేవి తెగ యుద్ధ వ్యూహాన్ని మరింత ఉధృతంగా ప్లాన్ చేస్తారు. ఆ సమయంలోనే నేవి తెగపై మానవులతో కలిసి మాంగ్‌క్వాన్ అనే తెగకు చెందిన యాష్ పీపుల్ దాడికి దిగుతారు. యాష్ తెగకు వారంగ్ (ఊనా చాప్లిన్) నాయకత్వంలో నేవి తెగపై దండెత్తుతారు.

కుమారుడి మరణంతో జేక్, నేతిరి ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యారు? తదుపరి యుద్ద ప్రణాళికలో వారి వ్యూహాన్ని ఎలా కొనసాగించాలని అనుకొన్నారు? వారంగ్ నాయకత్వంలో మంగ్‌క్వాన్ తెగ ఎలాంటి వ్యూహాలను రచించింది. నేవి, మంగ్‌క్వాన్ తెగ మధ్య పోరు ఎలా సాగింది? వారంగ్ లీడర్‌షిప్‌ను జేక్, నేతిరి ఎలా ఎదురించారు? పండోరా ప్రపంచంలో సవాల్ ఎదురైన నేవి తెగకు ఎలాంటి ఫలితం లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా కథ.

Avatar  Fire and Ash Movie Review

అవతార్ 1, అవతార్ 2 సినిమాల సంచలన విజయాల కారణంగాను, అలాగే జేమ్స్ కామెరాన్ పాపులారిటీ, సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కారణంగా అంచనాలు ఎప్పటిలానే భారీగానే ఉంటాయి. అలాంటి అంచనాలతో అవతార్ 3 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తన గత చిత్రాలకు భిన్నంగా, ఎక్కడా పొంతన లేని విధంగా జేమ్స్ కామెరాన్ ఈ సినిమాలో కథ, కథనాలు ఎంచుకోవడం కొంత ఆశ్చర్యంగాను, మరికొంత షాకింగ్‌గాను ఉంటాయి. తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఫస్టాఫ్‌లో కథ చెప్పిన తీరు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. మొదటి భాగంలో కథ లేకుండానే ఎక్కువగా ఎమోషన్స్‌పై దృష్టి పెట్టడం. యాక్షన్ కంటే డైలాగ్ డ్రామాపైనే ఆధారపడటం వల్ల మూవీ నత్త నడకతో సాగుతుంది. గంటన్నరకు నిడివి ఉన్న ఫస్టాఫ్ ప్రేక్షకులకు ఊపిరిసలపకుండా చేస్తుంది.

ఇక సెకండాఫ్‌లోనైనా జేమ్స్ కామెరాన్ మ్యాజిక్ చేస్తారా? అనే విషయానికి వస్తే.. ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ఎప్పటిలానే జేమ్స్ కామెరాన్ మాత్రం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్‌తో అల్లాడించాడు. కానీ కథలో ఎమోషన్స్ తేలిపోయాయి. పేలవమైన సన్నివేశాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచలేకపోయాయి. ఇక చాలా ఎపిసోడ్స్, సన్నివేశాలు రిపీట్ మోడ్‌లో తెరపైకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. దాంతో ఈ సినిమాలో కొత్తదనం కనిపించకపోవడంతో జేమ్స్ కామెరాన్ కెరీర్‌లోనే అత్యంత సాధారణ సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అవతార్ 2 సినిమాలో చూసిన సీన్లే అవతార్ 3లో మళ్లీ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సామ్ వార్తింగ్టన్, జో సల్దానా ఎప్పటిలానే ఈ ఫ్రాంచైజీలో తమ ఉనికిని చాటుకొన్నారు. తమ పాత్రలో జీవించడమే కాకుండా వైవిధ్యం చూపించేందుకు ప్రయత్నించారు. ఇక ప్రేక్షకులకు కొత్తగా పరిచయమైన వారంగ్ పాత్రలో చార్లీ చాప్లిన్ మనవరాలు ఊనా చాప్లిన్ విలన్ షేడ్స్‌తో అదరగొట్టారు. కథలో బలం లేకపోయినా తమ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను సినిమాకు కనెక్ట్ అయ్యేలా ప్రయత్నించారు. రోనల్ పాత్రలో కేట్ విన్స్‌లెట్ తన వరకు అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు ట్రై చేశారు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు వారి పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. రస్సెల్ కాప్పెంటర్ సినిమాటోగ్రఫి, సైమన్ ఫ్రాగ్లెన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్. ముఖ్యంగా విజువల్ పరంగా గ్రాఫిక్స్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఎడిటింగ్ విభాగం పనితీరు ఇంకా బెటర్‌గా ఉండాల్సిందనే అభిప్రాయం కలుగుతుంది. కథ, కథనాల్లో లోపాలు పక్కన పెడితే.. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో మరో మాట చెప్పడానికి వీలు లేకుండా జేమ్స్ కామెరాన్ అనుసరించిన పంథా బాగుంది.

ఈ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే?.. అవతార్, జేమ్స్ కామెరాన్ అనే పేర్లు సాధారణ ప్రేక్షకులకే కాకుండా సినీ ప్రముఖులకు, ఫిల్మ్ మేకర్స్‌కు ఓ మ్యాజిక్‌లా అనిపిస్తాయి. అాలాంటి మ్యాజిక్ చూడటానికి భారీ అంచనాలు, ఉత్సాహంతో రావడం అత్యంత సహజం. గత రెండు పార్టులు ప్రేక్షకులకు వినోదపరంగా, టెక్నికల్‌గా పండుగ భోజనాన్ని వడ్డించాయి. కానీ అవతార్ 3 మాత్రం కొత్తదనం లోపించడం, కొత్తగా ఫైర్ అండ్ యాష్ వరల్డ్ ఇంపాక్ట్‌ఫుల్‌గా లేకపోవడం వల్ల జేమ్స్ కామెరాన్ మ్యాజిక్ నిజంగా మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి లోపాలన్నీ పక్కన పెట్టి జేమ్స్ కామెరాన్ కోసం ఓ సారి అవతార్ 3 మూవీపై ఓ లుక్ వేయొచ్చు.

More from Filmibeat

Read more about: avatar 3 james cameron avatar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X