Avatar: Fire and Ash First Review: అవతార్: ఫైర్ అండ్ యాష్ ఫస్ట్ రివ్యూ

ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ డైరెక్షన్‌లో రూపొందిన అవతార్: ఫైర్ అండ్ యాష్. అవతార్ సినిమా సీక్వెల్‌లో మూడో చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరాన్, జాన్ లండావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సామ్ వర్తింగ్డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, ఊనా చాప్లిన్ తదితరులు నటిస్తున్నారు.

అవతార్3 సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫిని, సైమన్ ఫ్రాంగ్‌లెన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు స్టీఫెన్ రివికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.400 మిలియన్ల డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా వరల్డ్ ప్రీమియర్‌ను హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో డిసెంబర్ 1వ తేదీన ప్రదర్శించారు. ఈ సినిమా గురించి ఫస్ట్ పబ్లిక్ టాక్ ఏమిటనే విషయాల్లోకి వెళితే..

Avatar  Fire and Ash Review By Censor Board

అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా కథ విషయానికి వస్తే.. జేక్ సల్లీ, నేతిరి తన కుమారుడు నెతెయమ్ మరణ విషాదం తర్వాత జరిగే కథ. దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ మూవీ ద్వారా నేవి తెగలో మంగ్‌క్వాన్ అనే యాష్ పీపుల్ తెగను పరిచయం చేయబోతున్నారు. ఈ తెగ కరిగిన రాక్స్, పొగలో జీవించే తెగ ఇది. కల్నల్ క్వారిట్జ్ నాయకత్వంలో వారి తరఫున అరవీర భీకరుడైన వారంగ్ నేవి తెగపై పోరాటం చేస్తుంటాడు. ఈ పోరాటంలో గెలుపు ఎవరిదనేది ఈ సినిమా కథ.

అవతార్ 3 గా చెప్పుకొంటున్న ఈ సినిమా యాక్షన్, అడ్వంచరస్, ఫాంటసీ మూవీగా తెరకెక్కింది. ఇండియన్ వెర్షన్‌లో ఈ సినిమా 2డ, ఎంఎక్స్ 4డీ, 3డీ, ఐమాక్స్ 3డీ, డాల్బీ సినిమా 3డీ వెర్షన్లలో రిలీజ్ అవుతున్నది. ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు యూఏ 16+ సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే ఈ సినిమా 16 ఏళ్లకుపైబడిన వారందరూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. 16 ఏళ్ల లోపు చిన్నారులు తల్లిదండ్రుల సంరక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు.

ఇక అవతార్ సినిమా నేవి తెగలో రెండు వర్గాలు చేసే పోరాటం. యాష్ పీపుల్ కొత్తగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీలో మంగ్‌క్వాన్ తెగ చెప్పుకొనే వారి గురించి కథను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సమయం తీసుకోవడం, అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా భారీగా ఉండటంతో నిడివి పెరిగిపోయింది. ఈ సినిమా నిడివి మొత్తంగా 3 గంటల 17 నిమిషాలు అంటే.. 197 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు అని సెన్సార్ సర్టిఫికెట్ వెల్లడించింది.

లాస్ ఎంజెలెస్‌లో ప్రదర్శించిన ప్రీమియర్ అనంతరం ఈ సినిమా గురించి ఆడియెన్స్ చెబుతూ విజువల్ ఫీస్ట్. ఊహించని విధంగా, అంచనాలకు అందని విధంగా కథ సాగుతుంటుంది. జేమ్స్ కామెరూన్ విజన్, టేకింగ్ చూస్తే కొన్ని సీన్లు నమ్మశక్యంగా ఉండవు. ఇప్పటి వరకు వచ్చిన సీక్వెల్స్‌లో ది బెస్ట్ అని ఆడియెన్స్ ఫస్ట్ రియాక్షన్ ద్వారా తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X