Avatar: Fire and Ash Twitter Review: అవతార్: ఫైర్ అండ్ యాష్ ట్విట్టర్ రివ్యూ
అవతార్... ఈ పేరు గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సెల్యూలాయిడ్‌పై ఆవిష్కరించిన ఆవిష్కరించిన అద్భుతం ఈ సినిమా. ప్రపంచమే కాదు.. భారతదేశంలోనూ ఈ సినిమా బాగా పాపులర్. అంతేకాదు... మన స్టార్ హీరోలను మించి వసూళ్లను రాబట్టింది. అవతార్ నుంచి గతంలో రెండు భాగాలు వచ్చి ప్రేక్షకుల నీరాజనాలు పొందాయి. ఇప్పుడు వాటికి సీక్వెల్‌గా అవతార్ 3 విడుదల కానుంది. అదే అవతార్: ఫైర్ అండ్ యాష్.
అవతార్ సినిమా సీక్వెల్‌లో మూడో చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరాన్, జాన్ లండావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సామ్ వర్తింగ్డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, ఊనా చాప్లిన్ తదితరులు నటిస్తున్నారు. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫిని, సైమన్ ఫ్రాంగ్‌లెన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు స్టీఫెన్ రివికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో అవతార్ 3 సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఈ భారీ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో డిసెంబర్ 1వ తేదీన ప్రీమియర్స్ పడ్డాయి. జర్మనీ, ఫిలిప్పీన్స్‌లో డిసెంబర్ 17వ తేదీన అవతార్ 3 రిలీజ్ అయ్యింది. అమెరికా సహా మిగిలిన దేశాలలో డిసెంబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

స్టన్నింగ్ విజువల్స్, మంచి సన్నివేశాలు, అగ్ని తెగ చాలా అద్భుతంగా ఉంది. అయితే దానిపై మరింత దృష్టి పెట్టి ఉండాల్సింది. క్వారించ్ ఎప్పటిలాగే బాగున్నాడు. అయితే అతనిని ఎక్కువగా వాడుకున్నట్లు అనిపిస్తోంది. మనకు కొత్త విలన్ అవసరం, వరాంగ్ మెయిన్ విలన్‌గా ఉంటే బాగుండేది అని ఓ ట్విట్టర్ యూజర్ రివ్యూ ఇచ్చాడు.
AvatarFireandAsh నిడివి లెంగ్తీగా ఉన్నప్పటికీ, ఇందులో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన విజువల్స్ ఉన్నాయి. సినిమా మధ్యలో సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ ఎగ్జయిటింగ్‌గా, ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథలో బలమైన ఎమోషనల్ బీట్స్ ఉన్నాయి. మరో సరదా సమయం అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
ఐమ్యాక్స్‌లో అవతార్ ఫైర్ అండ్ యాష్ చూశాను. విజువల్స్ నమ్మశక్యం కానీ విధంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ సజీవంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం మీరు పండారో గ్రహం మీద ఉన్నారా అన్న అనుభూతిని కలిగిస్తుంది. ది ఫైర్ అండ్ యాష్ ప్రపంచం మీపై గట్టి ప్రభావం చూపుతుంది. స్కేల్, మరో ప్రపంచం, పీక్స్ సినిమా ఫైర్‌లా అనిపిస్తాయని ఒకరు రివ్యూ ఇచ్చారు.
జేమ్స్ కెమెరూన్ మరోసారి అద్భుతం చేశాడు. అవతార్ 3 ఒక సినిమా కాదు... ఇది సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్. ఈసారి పండోరా మరింత చీకటిగా, అగ్నిగోళంగా మారుతుంది. మనుగడ, త్యాగం, భావోద్వేగాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఫస్టాఫ్‌లో కొంత లాగ్ అనిపించి నిడివి ఎక్కువగా ఉన్నట్లుగా ఉంటుంది. కానీ సెకండాఫ్ మాత్రం బాగుంది. చివరి 40 నిమిషాలు మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేస్తాయి. టాప్ రేంజ్ విజువల్స్, సీజీ, సౌండ్ మైండ్ బ్లోయింగ్‌లా అనిపిస్తాయి అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.
అవతార్ 3 స్టోరీ పండోర గాథను చీకటి, ఇంటెన్సిటీలోకి తీసుకెళ్తుంది. కథ మరింత పొరలుగా, భావోద్వేగాలతో నిండి ఉంది. అవతార్ ఫ్రాంచైజీలోనే ఇంతకుముందు ఎన్నడూ చేయని విధంగా సంఘర్షణ, మనుగడ, నైతిక అస్పష్టతను అన్వేషిస్తుంది. ఫస్టాఫ్ విజువల్స్‌పరంగా ఉత్కంఠభరితంగా, భావోద్వేగపరంగా లీనమయ్యేలా ఉంది. పండోరాలోని కొత్త ప్రాంతాలు, కొత్త తెగలు, లోతైన పాత్ర క్షణాలతో ఈ ప్రపంచ నిర్మాణం మరో స్థాయిలో ఉంది. కథనం వేగం స్థిరంగా ఉంటుంది.. కొన్నిచోట్ల కథనం నెమ్మదిగా ఉంటుంది. కానీ కథలోని వాయిస్ దానిని కనిపించనివ్వదు.
సెకండాఫ్ నిజంగా అద్భుతంగా ఉంటుంది. కథనంలో పదును పెరుగుతుంది. పరిస్థితులు నాటకీయంగా మారతాయి, భావోద్వేగం పెరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలు గ్రాండ్‌గా, రాగా, ప్రభావవంతంగా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ ఇంటెన్సిటీతో అస్సలు ఊహించలేం. ఇది సినిమాను తీవ్రమైన భావోద్వేగం, నైతిక సంఘర్షణ దిశగా తీసుకెళ్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. క్లైమాక్స్ భారీగా, బోల్డ్‌గా, ఎమోషనల్‌గా బరువెక్కిస్తుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. త్యాగం, భవిష్యత్‌లో రాబోయే చిత్రాలకు సెటప్‌లా ఉంది. కామెరాన్ క్లైమాక్స్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సంగీతం విజువల్స్‌కు తగినట్లుగా సరిపోయింది. భావోద్వేగం సన్నివేశాలను మరింత రక్తి కట్టిస్తుంది. యాక్షన్ సన్నివేశాలను మరింత బలంగా చూపించింది. సౌండ్ డిజైన్ వరల్డ్ క్లాస్ స్థాయిలో ఉంది. జేమ్స్ కామెరాన్ తాను అద్భుతమైన చిత్ర నిర్మాతని అని మరోసారి నిరూపించుకున్నాడు. అతని విజన్, కథనం, స్కేల్, భావోద్వేగాలపై నియంత్రణ సాటిలేనివి. చక్కటి కథనంతో ముఖ్యంగా అవతార్ 3 ద్వితీయార్ధంలో ఉత్కంఠభరితంగా ఉంది. సంభాషణలు అర్ధవంతంగా ఉన్నాయి. మనుపటి భాగాలతో పోలీస్తే పాత్రలు పరిణితి చెందినట్లుగా అనిపిస్తున్నాయి.
అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ కేవలం విజువల్ ఫీస్ట్ మాత్రమే కాదు. ఇది భావోద్వేగభరితంగా, గాఢంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు బిగ్ స్క్రీన్‌పై చూస్తే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ మీ సొంతం. ఓవరాల్‌గా ఈ సినిమాకు నా రేటింగ్ 4/5 అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.
జేమ్స్ కామెరాన్ మరో సినిమా నాకౌట్‌ను అందించాడు. ఈ చాప్టర్‌లో పండోరాను మరింత తీవ్రమైన స్పేస్‌లోకి తీసుకెళ్తుంది. ఈసారి మరింత రాగా, గ్రిప్పింగ్‌గా, లోతైన ఎమోషనల్‌గా ఉంటుంది. ఇది చూడటానికి అద్భుతం మాత్రమే కాదు.. ఈసారి మిమ్మల్ని చుట్టేస్తుంది. కథ చాలా బలంగా, పర్సనల్‌గా అనిపిస్తుంది. బలమైన భావోద్వేగాలతో ముందుకు సాగుతుంది. ఈసారి నష్టం, ధైర్యం, మనుగడం వంటి ఎలిమెంట్స్‌ను చాలా బరువుగా ఎక్స్‌ప్లోర్ చేశారు.
అవతార్ 3 నిజానికి ద్వితీయార్ధంలోనే పతాక స్థాయికి చేరుకుంటుంది. చివరి ఘట్టం భావోద్వేగాలను రేకెత్తించేలా, దృశ్యపరంగా ఒక శాశ్వతమైన ముద్ర వేస్తుంది. అత్యాధునిక విజువల్స్, లీనమయ్యే సౌండ్, ఉర్రూతలూగించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వరకు, ఈ సాంకేతిక నైపుణ్యం భారీ బడ్జెట్ సినిమాలకు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. ఎపిక్ వంటి కథను చెప్పడంలో కామెరాన్‌కు ఉన్న పట్టును అవతార్ 3 మరోసారి నిరూపిస్తుంది. సాధ్యమైనంత వరకు పెద్ద స్క్రీన్‌పై చూస్తే సినిమాటిక్ అనుభూతి లభిస్తుంది అని ఓ నెటిజన్ ఈ చిత్రానికి 4.5 రేటింగ్‌తో రివ్యూ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











