Don't Miss!
- News
శ్రీనగర్ లాల్‌చౌక్‌లో రేవంత్ రెడ్డి- భరతమాత ముద్దుబిడ్డగా అది నా బాధ్యత
- Sports
IND vs NZ: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు! భారత్ టార్గెట్ ఏక్‌సౌ!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Avatar: The Way of Water movie review అవతార్ + టైటానిక్ = అవతార్ 2.. వెండితెర దృశ్యకావ్యంగా!
నటీనటులు: సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, సీగుర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, క్లిఫ్ కర్టీస్, జో డేవిడ్ మూర్ తదితరులు
రచన, స్క్రీన్ ప్లే, కథ, నిర్మాత, దర్శకత్వం: జేమ్స్ కామెరాన్
సహ నిర్మాత: జాన్ లాడావు
సినిమాటోగ్రఫి: రస్సెల్ కార్పంటర్
ఎడిటింగ్: స్టెఫాన్ ఈ రివ్కిన్, డేవిడ్ బ్రెన్నెర్, జాన్ రెఫీవా
మ్యూజిక్: సైమాన్ ఫ్రాగ్లెన్
బ్యానర్: లైఫ్‌స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్, టీఎస్జీ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్: 2022-12-16

అవతార్ 2 కథేమిటంటే?
యూఎస్ ఆర్మీలో పనిచేసే జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్) నావీగా మారడం, తిరుగుబాటు చేయడాన్ని సహించలేని అధికారులు.. పండోరా గ్రహంలోని నావీ తెగపై ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటారు. ఆర్మీ నుంచి తప్పించుకోవడానికి అటవీ ప్రాంతం నుంచి సముద్రంలోకి నావీ తెగ సభ్యులు మకాం మారుస్తారు. సముద్ర జలాల్లో ఉన్న జేక్ సల్లీ, నేత్రీ (జో సల్దానా) ఫ్యామిలీని, నావీ తెగను టార్గెట్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్‌లో భాగంగా జేక్ సల్లీ పిల్లలను కిడ్నాప్ చేస్తారు.

అవతార్ 2లో ట్విస్టులు
నావీ తెగపై దాడి చేయాలనుకొన్న ఆర్మీపై జేక్ సల్లీ వర్గం ఎలా ఎదురు దాడి చేసింది? ఆర్మీ అధికారి కుట్రలను ఎలా జేక్, నేత్రి తిప్పికొట్టారు. కిడ్నాప్ గురై ఆర్మీ చెరలో ఉన్న పిల్లలను ఎలా రక్షించుకొన్నారు? ఆర్మీ దాడిలో ప్రాణాలు కోల్పోయిన తన కొడుకు నేతేయం (జామీ ఫ్లాటర్) మరణానికి జేక్, నేత్రీ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నారు. ఆర్మీ అధికారి పెంపుడు కొడుకు స్పైడర్ (జాక్ ఛాంపియన్) జేక్, నేత్రికి ఎలా సహకారం అందించాడు? నావీ తెగ చేసే వనవాసంలో ఎలాంటి సమస్యలు జేక్ సల్లీ ఎదుర్కొన్నాడు? పండోరా గ్రహాన్ని ఆక్రమించి నావీ తెగను నాశనం చేయాలనే కుట్రను జేక్ సల్లీ ఎలా అడ్డుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే అవతార్ 2 (Avatar: The Way of Water) సినిమా కథ.

అవతార్ 2 ఫస్టాఫ్ ఎలా ఉందంటే?
అటవీ ప్రాంతంలో నివసించే తమపై ఆర్మీ బాంబుల వర్షం కురిపించిన నేపథ్యంలో తమ మనుగడను చాటుకోవడానికి నావీలు సముద్ర జలాల్లోకి వెళ్లడం.. వారి ఆచూకీని తెలుసుకొని ఆర్మీ ఆయుధాలు, యుద్ద విమానాలతో సముద్ర ప్రాంతానికి వెళ్లడంతో కథ మొదలవుతుంది. సముద్ర జలాల్లో జేక్, నేత్రీ, వారికి చెందిన నలుగురు పిల్లలతో కూడిన కుటుంబం గురించి ఎమోషనల్‌గా సన్నివేశాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఫస్టాఫ్‌లో కథను ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ సమయాన్నే తీసుకొన్నాడనిపిస్తుంది. సముద్రంలోని సొరచేపలు, తిమింగలల్లాంటి భారీ చేపల కథను కనెక్ట్ చేయడం అత్యంత ఆసక్తిగా కనిపిస్తుంది. జేక్ పిల్లలతో చేపల అనుబంధాన్ని కథకు లింక్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది. కొంత స్లో నేరేషన్ కారణంగా ఫస్టాఫ్ అక్కడక్కడ బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది.

అవతార్ సెకండాఫ్ హై ఎమోషనల్‌గా
అవతార్ 2 సినిమా సెకండాఫ్ విషయానికి వస్తే.. రెండో భాగంలో కథను బలంగా రాసుకొన్నాడని చెప్పవచ్చు. ఆర్మీతో జేక్ సల్లీ తలపడే విధానం, అలాగే కుటుంబాన్ని రక్షించుకోవడానికి నేత్రీ, ఆమె కొడుకు, కూతుళ్లు చేసే పరిస్థితి భావోద్వేగంగా ఉంటుంది. సెకండాఫ్‌లో ఆర్మీని ప్లాన్స్‌ను తిమింగలాలు ధ్వంసం చేయడం సినిమాకు హైలెట్‌గా మారుతుంది. ఇక జేక్, నేత్రీ కొడుకు మరణానికి సంబంధించిన ఎపిసోడ్ కంటతడి పెట్టించేలా సీన్లను ఎమోషనల్‌గా జేమ్స్ కామెరాన్ రాసుకొన్నాడు. సెకండాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్, టైటానిక్ నేపథ్యంలోని కొన్ని సీన్లను జోడించి కథను పరుగులు పెట్టించాడు. ప్రేక్షకుడిని ఓ కొత్త అనుభూతికి గురిచేయడంలో జేమ్స్ కామెరాన్ మరోసారి సఫలమయ్యారు.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ గురించి
నావీగా మారిన ఆర్మీ ఆఫీసర్ జేక్ సల్లీగా సామ్ వర్తింగ్టన్ మరోసారి అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడని చెప్పవచ్చు. యాక్షన్ సన్నివేశాల్లోను, ఎమోషనల్ సీన్లను అద్బుతంగా పండించాడు. సినిమా కథను తన భుజాలపై మోసి.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడని చెప్పవచ్చు. జేక్ సల్లీ భార్యగా నావీ తెగకు చెందిన యువతిగా నేత్రీ పాత్రలో జో సల్దానా మరోసారి తన నటనతో ఆకట్టుకొన్నారు. కన్నబిడ్డలను కాపాడుకొనేందుకు భర్తతో కలిసి వీరనారిగా మారిన తీరు పాత్రకు జో సల్దానా తన నటనతో శోభ తెచ్చారు. కిరి పాత్రలో సిగోర్ని వీవర్, ఆర్మీ కమాండర్‌గా స్టెఫాన్ లాంగ్, ఆర్మీ ఆఫీసర్ దత్తపుత్రుడు స్పైడర్‌గా జాక్ ఛాంపియన్, తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫి అద్బుతం. ప్రతీ సన్నివేశాన్ని వెండితెరపై దృశ్య కావ్యంగా మలిచాడు. వీఎఫ్ఎక్స్ పనితీరు అద్బుతంగా ఉంది. సముద్రంలోని ఎపిసోడ్స్, చేపలను, ఇతర జంతువులను డిజైన్ చేసిన తీరు అద్బుతంగా ఉంటుంది. అయితే 3డీ ఎఫెక్ట్స్ పెద్దగా థ్రిల్లింగ్‌గా ఉండదు కానీ.. సీన్లు ఫీల్‌గుడ్‌గా ఉండటానికి దోహదపడింది. సైమన్ ఫ్రాగ్లేన్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. జేమ్స్ కామెరాన్ స్వీయ నిర్మాణంలో లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుసరించిన ప్రమాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?
లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, టెక్నాలజీ అంశాలతో జేమ్స్ కామెరాన్ దృశ్యకావ్యంగా మలిచిన చిత్రం అవతార్: ది వే ఆఫ్ వాటర్. అవతార్‌కు కొనసాగింపుగా.. టైటానిక్ సినిమాను గుర్తుతెచ్చే విధంగా ఈ సినిమాను మలిచారు. ఫస్టాఫ్‌లో కొంత నిదానంగా సాగితే.. సెకండాఫ్ హైఎమోషనల్‌గా, అనుక్షణం థ్రిల్లింగ్‌గా అనిపించే విధంగా అవతార్ 2 ఉంటుంది. ప్రేక్షకుడు పెట్టే ప్రతీ పైసాకు రెండుమూడింతల థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. అవతార్, టైటానిక్ సినిమాలను చూస్తే ఎంత అనుభూతి కలుగుతుందో.. అవతార్ 2 చూస్తే ఆ రేంజ్ కంటే ఎక్కువగా ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. సగటు ప్రేక్షకుడు తప్పకుండా చూడాల్సిన సినిమా అవతార్: ది వే ఆఫ్ వాటర్.