Average Student Nani Review: యావరేజ్ స్టూడెంట్ నాని మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: పవన్ కుమార్ కొత్తూరి, షహీబా బసిన్, స్నేహా మాల్వియా, రాజీవ్ కనకాల, వివియా సంత్ తదితరులు
రచన, నిర్మాత, దర్శకత్వం: పవన్ కుమార్ కొత్తూరి, బిషాలి గోయల్
సినిమాటోగ్రఫి: సాజీష్ రాజేంద్రన్
ఎడిటర్ : ఎస్.బి.ఉద్దవ్
సంగీతం: కార్తీక్ కొడకండ్ల
బ్యానర్: శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి
రిలీజ్ డేట్: 2024-08-02
నాని (పవన్ కుమార్ కొత్తూరి) యావరేజ్ స్టూడెంట్. చదువు విషయంలో కేర్‌లెస్‌గా ఉండటం, బాధ్యత లేకుండా ప్రవర్తించడం పట్ల తల్లిదండ్రులు (ఝాన్సీ, రాజీవ్ కనకాల) బాధపడుతుంటారు. అయితే కాలేజీలో తన సీనియర్ సారా (షహీబా బాసిన్)తో ప్రేమలో పడుతాడు. తనకంటే పొడవైన అమ్మాయి, రిచ్ గర్ల్‌తో అఫైర్ కొనసాగిస్తున్న సమయంలో సారాతో బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత అను (స్నేహా మాల్వియా)తో లవ్‌లో పడుతాడు.

ఎడ్యుకేషన్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటాడు? తండ్రిని ఎదురించి ఎందుకు మాట్లాడుతాడు? ఇంటి నుంచి బయటకు వెళ్లిన నాని ఆరు నెలలు ఎక్కడికి వెళ్లాడు? సారాతో అతడి అఫైర్ ఎలా కొనసాగింది? నానిని ఎందుకు సారా రిజెక్ట్ చేసింది? బ్రేకప్ తర్వాత నానితో ఎందుకు రిలేషన్ కొనసాగించాలని చూసింది? నాని బ్రేకప్ తెలిసిన తర్వాత కూడా అను అతడితో ఎందుకు ప్రేమలో పడింది? చివరకు యావరేజ్ స్టూడెంట్ అయిన నాని ఏం సాధించాడు? తల్లిదండ్రులను తల ఎత్తుకొనేలా ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా కథ.
యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా విషయానికి వస్తే.. యూత్‌ఫుల్ కంటెంట్‌తో కూడిన రొమాంటిక్ మూవీ. నేటితరం ఆలోచనలు, విద్యార్థుల లైఫ్ స్టయిల్, అఫైర్, డేటింగ్ వ్యవహారాలకు అద్దం పట్టే సినిమాగా కనిపిస్తుంది. పవన్ కుమార్ కొత్తూరి ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియగా కనిపిస్తాడు. రొమాంటిక్ సన్నివేశాలను, ఎమోషనల్ కంటెంట్‌ను కలిపి చూపించిన విధానం బాగుంది. సినిమా అంతా ఒకే టోన్‌తో రొమాంటిక్ కంటెంట్ ఎక్కువ కావడం కొంత మైనస్‌గా చెప్పొచ్చు. ఫ్యామిలీ డ్రామాకు ఎక్కువ స్కోప్ తీసుకొన్నప్పటికీ.. దానిని హైలెట్ చేయకలేకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
పవన్ కుమార్ కొత్తూరి నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా, నటుడిగా అన్ని పాత్రలను బ్రహ్మడంగా పోషించారు. తన రూపంలో ఉండే మైనస్ పాయింట్స్‌ను పాజిటివ్‌గా క్యారెక్టర్ రాసుకొని అందులో నటించిన ఆయన కాన్పిడెన్స్‌కు ఫిదా అవ్వాల్సింది. అలాంటి గట్స్‌ను అభినందించాలి. దర్శకుడిగా టేకింగ్ బాగుంది. నిర్మాతగా సినిమాను రిచ్‌గా చూపించిన విధానం ఇంకా బాగుంది. ఖర్చుకు వెనుకాకుండా క్వాలిటీతో సినిమాను అందించారు.

సారాగా షహీబా, అనుగా స్నేహ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి నటించారు. గ్లామర్ పరంగా కాకుండా యాక్టింగ్ పరంగా ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అందం, అభినయంతో మెప్పించే ప్రయత్నం చేశారు. రాజీవ్ కనకాల, ఝాన్సీ సగటు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే తల్లిదండ్రుల పాత్రలను ప్రతిబింబించేలా నటించారు.
యావరేజ్ స్టూడెంట్ నాని సినిమాకు సాజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫి బాగుంది. కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ మరో స్పెషల్ ఎట్రాక్షన్, ఉద్దవ్ ఎడిటింగ్ విభాగం ఇంకాస్త కత్తెరకు పదును పెట్టి కఠినంగా వ్యవహరించాల్సి ఉందనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓటీటీకి కరెక్ట్‌గా సరిపోయే మూవీ. థియేట్రికల్‌గా కూడా చాలా కమర్షియల్ అంశాలు ఉన్నాయి. యూత్‌ఫుల్ రొమాంటిక్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











