twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అ! సినిమా రివ్యూ అండ్ రేటింగ్: నాని కొత్త ప్రయత్నమే.. కానీ గందరగోళం

    By Rajababu
    |

    Recommended Video

    అ! సినిమా రివ్యూ అండ్ రేటింగ్

    Rating:
    2.5/5
    Star Cast: కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ప్రియ దర్శి, ఈషా
    Director: ప్రశాంత్ వర్మ

    తెలుగు సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా మారారు హీరో నాని. ఆ తర్వాత వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాని నిర్మాతగా మారి అ! అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో కాజల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు. వైవిధ్యమైన చిత్రంగా ప్రచారం జరిగిన చిత్రానికి దర్శకుడిగా ప్రశాంత్ వర్మ వ్యవహరించారు. ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    అ! కథ

    అ! కథ

    బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురైన కాళి (కాజల్ అగర్వాల్) మానసిక క్షోభకు గురవుతుంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతుంది. తన జీవిత ప్రయాణంలో అనేక వ్యక్తులతో ట్రావెల్ అవుతుంది. సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అవుతుంది. అలా మానసిక క్షోభకు గురైన కాజల్ జీవితానికి ముగింపు ఏమిటనేది అ! చిత్ర కథ.

    మూవీ కథలో చెఫ్

    మూవీ కథలో చెఫ్

    అ! మూవీ కథలో చెఫ్ (ప్రియదర్శి), హోటల్ యజమాని (ప్రగతి), హోటల్‌లో పనిచేసే బేరర్ (రెజీనా కసండ్రా), హోటల్‌కు వచ్చిన పిల్లతో ఛాలెంజ్‌కు దిగిన మెజిషియన్ (మురళీశర్మ), టైమ్ మిషిన్ తయారు చేసి తల్లిదండ్రులను కలుసుకోవాలనే సైంటిస్టు (అవసరాల శ్రీనివాస్), లైంగిక వేధింపులకు గురై పురుషులంటే అసహ్యభావం పెంచుకొన్న ఇషా రెబ్బా మానసిక వైద్యురాలు కృష్ణవేణి (నిత్యమీనన్‌)తో ప్రేమలో పడటం ఇలాంటి క్యారక్లర్లు కథలో భాగమవుతాయి. ఆ రెస్టారెంట్‌లో జరిగిన సన్నివేశాలు కాజల్ అగర్వాల్ జీవితానికి ఎలా ముడిపడ్డాయి? అనేది తెర మీద పాత్రలు చేసే మ్యాజిక్ అ! చిత్రం.

     స్కిప్ట్, డైరెక్షన్ అనాలిసిస్

    స్కిప్ట్, డైరెక్షన్ అనాలిసిస్

    పాత్రలు, కొత్తదనం కనిపించే స్క్రిప్ట్‌తో రూపొందిన కాన్సెప్ట్ చిత్రం అ!. ఒక్కపాత్ర జర్నీ ఒక్కో ఎపిసోడ్‌గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం. కాకపోతే సగటు ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా ఉండటం అ! చిత్రంలో ఓ లోపం. కథలో ఆసక్తికరంగా సాగే ఎపిసోడ్స్‌లో లెస్బియన్స్ ఇషా రెబ్బా, నిత్యామీనన్ పెళ్లి చేసుకొనే సీన్, చెఫ్‌ ప్రియదర్శి ఉండే ఎపిసోడ్స్ అ! అనే విధంగా ఆసక్తికరంగా ఉంటాయి. మిగితా క్యారెక్టర్లలో అంతగా బలం కనిపించదు. స్క్రీన్‌‌పై మ్యాజిక్ చేయాలనే ఆలోచనను నింపుకొన్న సినిమాకు గుండెకాయ లాంటి అసలు పాయింట్‌ను బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే మరింత బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    ఫస్టాఫ్‌లో

    ఫస్టాఫ్‌లో

    ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయంతో ఆరంభమై చివరకు ఆ పాత్రలను కనెక్ట్ చేస్తూ ఇంటర్వెల్‌ బ్యాంగ్ వేయడం ఆసక్తికరంగా ఉంటుంది.
    సినిమా మొదటి భాగంలో ప్రియదర్శి, చేప (నాని) మధ్య జరిగే సన్నివేశాలు సరదాగా సాగుతాయి. అయితే మిగితా ఎపిసోడ్స్ అంతగా ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉండకపోవడం కొంత ఇబ్బందికి గురిచేస్తుంది.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    రెండో భాగంలో మెజిషియన్ మురళీశర్మ ఎపిసోడ్ కాస్తా కాలక్షేపంగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ వేగం పుంజుకొని ప్రేక్షకుడిలో ఆసక్తిని రేపుతుంది. అయితే క్లైమాక్స్‌లో ప్రధాన పాయింట్‌ను ఆదరాబాదరాగా ముగించే ప్రయత్నం కనిపించింది. అయితే ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం బాగా ఉందనిపించినా క్లారిటీ మిస్ కావడం, కథలో కన్‌ఫ్యూజన్ ప్రేక్షకుడి బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాజల్ పాత్రను మరింత బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే సినిమాకు ప్రాణంగా మారేదని చెప్పవచ్చు.

    కాజల్ అగర్వాల్ యాక్టింగ్

    కాజల్ అగర్వాల్ యాక్టింగ్

    అ! చిత్రంలో కాజల్ చుట్టే కథ తిరుగుతుంది. కానీ ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్టు కనిపించదు. తన పాత్రకు డైలాగ్స్ పెద్దగా ఉండవు. యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ కనిపించదు.

     తనదైన హస్యంతో ప్రియదర్శి

    తనదైన హస్యంతో ప్రియదర్శి

    వంటవాడిగా ప్రియదర్శి మరోసారి ప్రతిభను చాటుకొన్నాడు. కథకు బలంగా మారిన పాత్రను తనదైన శైలిలో రాణించాడు. తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు. పాత్ర స్వభావం సీరియస్‌గా అనిపించినా తన నటనతో హాస్యాన్ని పండించాడు.

     కొత్తగా మురళీ శర్మ

    కొత్తగా మురళీ శర్మ

    ఇక మెజిషియన్‌గా పిల్లల కోసం ఉద్దేశించి రాసినట్టు కనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఆ పాత్రలో అతి కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఎప్పటిలానే మురళీ శర్మ తన మార్కు చూపించాడు. కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా కనిపించాడు.

     ఢిఫరెంట్‌గా రెజీనా

    ఢిఫరెంట్‌గా రెజీనా

    రెస్టారెంట్‌లో బేరర్ పాత్రలో రెజీనా కనిపించింది. డ్రగ్స్ బానిసైన యువతిగా, అలాగే మాఫియాతో సంబంధాలున్న వ్యక్తిగా పలు రకాల షేడ్స్ కనిపిస్తాయి. అయితే తన పాత్రకు న్యాయం చేసినట్టు కనిపించినా.. రెజినా కెరీర్‌కు ఈ పాత్ర ఉపయోగపడే అవకాశం లేదు.

     అదరగొట్టిన నిత్యా మీనన్

    అదరగొట్టిన నిత్యా మీనన్

    కృష్ణవేణిగా నిత్యా మీనన్ పాత్ర చిన్నదైనా అదరగొట్టింది. భావోద్వేగం నిండిన పాత్రలో ఆమె ఒదిగిపోయింది. మానసికంగా వేధనకు గురైన అమ్మాయిని అక్కున చేర్చుకొని వివాహం చేసుకోవడానికి సిద్ధమైన డాక్టర్‌గా ఓ బోల్డ్ పాత్రను చేసి మెప్పించింది.

    మెప్పించిన రవితేజ, నాని

    మెప్పించిన రవితేజ, నాని

    చేప పాత్రకు వాయిస్ ఓవర్ చెప్పి నాని తన డైలాగ్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఈ సినిమాకు నాని చెప్పిన డైలాగ్స్ అదనపు ఆకర్షణ. ఇక బోన్సాయ్ ట్రీ పాత్రకు వాయిస్ ఓవర్ చెప్పిన రవితేజ్ తనదైన శైలిలో ఆకట్టుకొన్నాడు. కొన్ని చోట్ల రవితేజ డైలాగ్స్ పటాసుల్లా పేలాయి.

     సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సూపర్

    సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సూపర్

    అ! సినిమాకు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ప్రధానమైన బలం. మార్క్ కే రాబిన్ అందించిన రీరికార్డింగ్ సినిమాకు ప్రాణం పోసింది. సన్నివేశాలను సజీవంగా ఉండేలా చేసింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. వెస్ట్రన్ లుక్, యాంబియేన్స్ కథకు ప్లస్ అయ్యాయి.

    నిర్మాతగా నాని

    నిర్మాతగా నాని

    ఇప్పటి వరకు నాని అసిస్టెంట్ డైరక్టర్ అని విన్నాం. తెరపైన నేచురల్ స్టార్‌గా చూశాం. తాజాగా మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా నాని మరో కోణంలో చూస్తున్నాం. అయితే సినిమా కమర్షియల్. అన్నివర్గాలను మెప్పించే విధంగా ఉంటేనే సినిమాకు పరమార్థం. ఈ విషయాన్ని నాని గ్రహించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

    దర్శకుడిగా ప్రశాంత్ వర్మ

    దర్శకుడిగా ప్రశాంత్ వర్మ

    రచయితగా, డైరెక్టర్‌గా ప్రశాంత్ వర్మ తొలిప్రయత్నం ఫర్వాలేదనిపించింది. కొత్త జోనర్‌తో ముందుకొచ్చిన ప్రశాంత్ స్క్రీన్ ప్లే, కథపై మరింత ద‌ృష్టిపెట్టి ఉంటే మెరుగైన ఫలితాన్ని
    సాధించడానికి అవకాశం ఉండేది. కథ, కథనాల పరంగా ప్రశాంత్ ట్రీట్‌మెంట్ బాగుంది. కొత్తదనం పేరుతో కొంత మంది ఆడియెన్స్‌కే పరిమితం కావ్వడం సరికాదేమో అనిపిస్తుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    నటీనటుల ఫెర్ఫార్మెన్స్
    సినిమాటోగ్రఫీ
    కథ, కథనాలు

    మైనస్ పాయింట్లు
    కొంతమంది ఆడియెన్స్‌కే పరిమితం కావడం
    కథలో క్లారిటీ లేకపోవడం, కన్‌ఫ్యూజన్ ఉండటం

     తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: కాజల్ అగర్వాల్, నిత్య మీనన్, రెజినా కసండ్రా, ఇషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ, రోహిణి, ప్రియదర్శి తదితరులు
    కథ, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
    మ్యూజిక్: మార్క్ కే రాబిన్
    సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
    ఎడిటింగ్: గౌతమ్ నెరుసు
    బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
    రిలీజ్ డేట్: 16 ఫిబ్రవరి 2018

    English summary
    Hero Nani become a producer for Awe! movie. Kajal Agarwal, Nitya Menon, Regina Cassandra are in the lead roles. This movie is set to release on August 16th. In this occassion, Telugu Filmibeat brings review exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X