Baaghi 4 Movie Review: బాఘీ 4 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్, హర్నాజ్ సంధూ, సోనమ్ బజ్వా, శ్రేయాస్ తల్పాడే, ఉపేంద్ర లిమయే, సౌరబ్ సచ్‌దేవా, నిఖత్ ఖాన్ తదితరులు
దర్శకత్వం: ఏ హర్ష
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత: సాజిద్ నడియాడ్‌వాలా
సినిమాటోగ్రఫి: స్వామీ జే గౌడ
ఎడిటింగ్: కిరణ్ గౌడ, నితిన్ పట్నాయక్
మ్యూజిక్: సంచిత్, అంకిత్ బల్హారా
బ్యానర్: నాడియాడ్‌వాలా గ్రాండ్సన్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్: 2025-09-05

రణ్‌వీర్ ప్రతాప్ సింగ్ అలియాస్ రోని (టైగర్ ష్రాఫ్) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 7 నెలలపాటు కోమాలో ఉంటాడు. కోమా నుంచి కోలుకొన్న తర్వాత తన ప్రేయసి అలీషా (హర్నాజ్ సంధూ) గురించి వెతకడం మొదలుపెడుతారు. అయితే అలీషా అనే పేరుతో ఏ అమ్మాయి లేదు. రోని కేవలం లేని అమ్మాయి గురించి ఉన్నట్టు భావిస్తూ భ్రమ పడుతున్నాడని తన సోదరుడు జితూ ( శ్రేయాస్ తల్పాడే)తోపాటు అందరూ తప్పు పడుతారు. తనకు లభించిన ఆధారాలతో రోని వెతకడం.. తను వెతుకుతున్న వ్యక్తులు హత్యకు గురై.. కేసులు తనపైకి రావడంతో అతడి గురించి పోలీసులు వెంటపడుతుంటారు. మరోవైపు మాఫియా డాన్ చాకో (సంజయ్ దత్) మనుషులు కూడా వెతుకుతుంటారు.

Baaghi 4 Hindi Movie Review

కస్టమ్స్ ఆఫీసర్‌ రోని యాక్సిడెంట్‌కు ఎలా గురయ్యాడు? కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అలీషా ఉందని వెతకడం నిజమేనా? లేక మానసిక రుగ్మత వల్ల ఏర్పడిన భ్రమనా? తన సోదరుడు తన పట్ల ఎందుకు అనుమానంగా ప్రవర్తించాడు? అలీషా కోసం వెతుకులాట ఎలా కొనసాగింది? జితూ ఎందుకు మర్డర్ అయ్యాడు? ఎవరీ చాకో? ఎందుకు రోనిని వెంటాడుతున్నాడు? చివరకు అలీషాను రోని పట్టుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే బాఘీ 4 సినిమా కథ.

తమిళంలో దర్శకుడు శశి రూపొందించిన ఐంతు ఐంతు ఐంతూ సినిమా ఆధారంగా హిందీ నెటివిటికి మార్పులు, చేర్పులు చేసి ఏ హర్ష (కన్నడలో అంజనిపుత్ర, వేద, భీమా చిత్రాల దర్శకుడు) పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఈ సినిమాను చూసిన తర్వాత యానిమల్, కిల్, మార్కో చిత్రాల ప్రభావం ఎక్కువగా ఉందనిపిస్తుంది. అయితే సాజిద్ నడియాడ్‌వాలా అనుసరించిన స్క్రీన్ ప్లే, స్టోరీలో ట్విస్టులు కామన్ ఆడియెన్స్‌కు ఫుల్లుగా థ్రిల్స్‌ను పంచుతాయి. కాకపోతే ఈ సినిమా కథ సౌత్ ఆడియెన్స్‌కు తెలిసినట్టే ఉండటంతో కొత్తదనం కనిపించదు.

కానీ ఈ సినిమాకు పాటలు, ఫైట్స్, రొమాన్స్, టైగర్ ష్రాఫ్, హర్నాజ్ లవ్ ట్రాక్ మాత్రమే కాకుండా సంజయ్ దత్‌తో హర్నాజ్ ప్రేమ కథ ఎమోషనల్‌గా ఉంటుంది. సంజయ్ దత్‌తో హర్నాజ్ లవ్ ట్రాక్‌ను దర్శకుడు ట్రీట్ చేసిన విధానం బాగుంది. ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పటికీ.. రెగ్యులర్, రొటీన్ యాక్షన్ డ్రామా అనే ట్యాగ్‌ను మించి మాత్రం కథ ఉండదు. టైగర్ ష్రాఫ్ ఫెర్ఫార్మెన్స్, ఫైట్స్, సంజయ్ దత్ పోషించిన టిపికల్ విలనిజం కోసం మాత్రమే ఈ సినిమాను చూడొచ్చు.

నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రా అండ్ రస్టిక్‌గా టైగర్ ష్రాఫ్ గెటప్ ఈ సినిమాను మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మార్చింది. ఈ సినిమాలోని లవ్ సీన్లు, బ్రదర్ సెంటిమెంట్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో టైగర్ వీర విహారం చేశాడు. కొన్ని ఫైట్స్ గూస్‌బంప్స్ వచ్చేలా ఉంటాయి. కొత్త అమ్మాయి హర్నాజ్ సంధూ మాత్రం గ్లామర్ పరంగాను, యాక్షన్ పరంగాను చెలరేగిపోయింది. రొమాన్స్ సన్నివేశాల్లో రెచ్చిపోయారు. యాక్టింగ్ పరంగా దెబ్బేసింది. ఇక అతిధి పాత్రలో కనిపించిన సోనమ్ బజ్వా కూడా తానేమీ తక్కువ కాదని.. అందాల ఆరబోతతో అల్లాడించింది. ఇక సంజయ్ దత్‌ పాజిటివ్, నెగిటివ్ షేడ్స్ ఉన్న లవ్ కోటెడ్ టిపికల్ విలన్ పాత్ర. సౌరబ్ సచ్‌దేవా, ఉపేంద్ర లిమయే పాత్రలు కూడా సినిమాకు బలమైన సపోర్టుగా నిలిచాయి. ఇతర పాత్రల్లో నటించిన వారాంతా ఫర్వాలేదనిపిస్తారు.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఈ సినిమా స్టంట్స్ కోరియోగ్రఫి అదిరిపోయేలా ఉంటుంది. సిక్స్ ప్యాక్ బాడీతో కండలు తిరిగిన టైగర్‌ ష్రాఫ్‌తో చేయించిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. స్వామీ జే గౌడ్ సినిమాటోగ్రఫి మూవీని చాలా రిచ్‌గా మార్చింది. సంచిత్, అంకిత్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకు స్ట్రెంగ్త్‌గా మారాయి. సాజిద్ నడియాడ్‌వాలా అనుసరించిన నిర్మాణ విలువలు హై క్లాస్ ఉన్నాయి.

బాఘీ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. పూర్తిస్థాయి యాక్షన్ సాగే రివేంజ్ డ్రామా. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చుట్టూ తిరిగే మాస్ ఎంటర్‌టైనర్. కొత్తదనం కొరవడిన రెగ్యులర్, రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్. కాకపోతే కథను నడిపించిన తీరు.. స్క్రీన్ ప్లేను రాసుకొన్న విధానం వల్ల ఈ సినిమా ఫస్టాఫ్ అదిరిపోయేలా ఉంటుంది. సెకండాఫ్‌లో ట్విస్టులను సాగదీయడం వల్ల క్రైమాక్స్ ఊహించినట్టే ఉండటం కొంత బోర్‌గా ఉంటుంది. లవ్ అండ్ రివేంజ్ డ్రామా, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి బాఘీ 4 నచ్చడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఈ వారం థియేటర్‌లో చూడదగిన మాస్ సినిమాల జాబితాలో దీనిని చేర్చుకోవచ్చు.

More from Filmibeat

Read more about: tiger shroff sanjay dutt Baaghi 4
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X