Baahunali The Epic First Review: బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ రివ్యూ
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు నటించిన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం నమోదు చేసింది. ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. జక్కన్నకు గ్లోబల్ గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఈ రెండు పార్టులు మరోసారి ఒక్కటిగా మారి బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్‌తో రీ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాల వివరాల్లోకి వెళితే..
బాహుబలి సినిమాను సుమారుగా 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో భారీగా నిర్మించారు. ఈ సినిమా మొదటి భాగానికి మిశ్రమ స్పందన లభించింది. దాంతో ఈ సినిమా కేవలం 650 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. అయినా ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక రెండో భాగం అంటే బాహుబలి 2: ది కన్‌క్లూజన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమానే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు ఈ సినిమా పేరిట ఉంది.

ఇక బాహుబలి సినిమా రిలీజై 10 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా ప్రేక్షకుల ముందుకు మరోసారి ఈ మూవీని తీసుకురావాలని యూనిట్ ప్రయత్నించింది. దాంతో బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ చిత్రాల్లోని ఈ కీలక సన్నివేశాలు కలిపి బాహుబలి ది ఎపిక్ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా ప్రేక్షకులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించగానే.. పాపులర్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ బుక్ మై షో ఈ సినిమాను లిస్ట్ చేసింది. అయితే రామాయణం, రాజాసాబ్, స్పిరిట్ సినిమాల కంటే అత్యధిక మంది బాహుబలి ది ఎపిక్ సినిమానే చూడటానికి ఉత్సాహం చూపించారు. బాహుబలి ది ఎపిక్ సినిమాను సుమారుగా 30 మంది చూడటానికి ఆసక్తిని కనబరచడం విశేషంగా మారింది.
అయితే బాహుబలి ది ఎపిక్ సినిమా విషయానికి వస్తే.. ఈ రెండు భాగాలను కలిపిన తర్వాత ఈ సినిమా నిడివి రికార్డు స్థాయిలో ఉన్నట్టు స్పష్టమైంది. అయితే భారతీయ సినిమాలో అత్యధికంగా రన్ టైమ్ ఉన్న చిత్రాల్లో ఈ మూవీ ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా స్పెషల్ కట్ రన్ టైమ్ 3.5 గంటల ఉందని బుక్ మై షో కన్ఫర్మ్ చేసింది. ఈ నిడివినే సెన్సార్ బోర్డుకు పంపే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అయితే ఇప్పటికే ఈ సినిమా రెండుసార్లు సెన్సార్ పూర్తి చేసుకొన్నందున ఈ మూడో వెర్షన్‌కు సెన్సార్ బోర్డు రివ్యూ నామమాత్రమే అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నది.
ఆర్కా మీడియా బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన ఈ సంచలన చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమాను అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ముస్తాబు చేస్తున్నారు. ఈ వెర్షన్ కూడా సంచలన రీతిలో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందనే అంచనాలను ట్రేడ్ వర్గాలు పెట్టుకొన్నాయి. బాహుబలి ది ఎపిక్ అప్ డేట్స్, ఎక్స్‌క్లూజివ్ వార్తల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











