Baak Movie Review తమన్నా ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సుందర్ సీ మెప్పించాడా? బాక్ సినిమా సమీక్ష
నటీనటులు: సుందర్ సీ, తమన్నా భాటియా, రాశీ ఖన్నా, కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, కేఎస్ రవికుమార్, యతిన్ కార్యేకర్, రాజేంద్రన్, జయప్రకాశ్, సంతోష్ ప్రతాప్ తదితరులు
కథ, రచన, స్క్రీన్ ప్లే, దర్వకత్వం: సుందర్ సీ
నిర్మాత: కుష్బూ
మ్యూజిక్: హిప్ హప్ తమిజా
ఎడిటింగ్: ఫెన్నీ అలీవర్
సినిమాటోగ్రఫి: ఈ కృష్ణస్వామి
బ్యానర్: అవ్నీ సినిమ్యాక్స్, బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
రిలీజ్ డేట్: 2024-05-02
అస్సోంలో బాక్ అనే దుష్టశక్తి మహాశక్తిగా మారాలనే ప్రయత్నంలో ఉంటుంది. అయితే అందుకు ముగ్గురిని చంపి వారి ఆత్మలోకి ప్రవేశించడానికి పూనుకొంటుంది. ఈ క్రమంలో శివ శంకర్ అనే లాయర్ (సుందర్ సీ) తన సోదరి శివానీ (తమన్నా భాటియా)బాక్ నుంచి తన ఇద్దరి పిల్లల్ని రక్షించాలని శివానీ తాపత్రయపడుతుంది. ఈ ప్రయత్నంలో శివానీ, ఆమె భర్తను బాక్ బలి తీసుకొంటుంది. తన సోదరి మరణానికి అసలు కారణమేమిటనే కోణంలో శివ శంకర్ తనదైన శైలిలో రీసెర్చ్ చేస్తుంటాడు.
బాక్ తన లక్ష్యాన్ని చేరుకొన్నదా? శివానీ కుటుంబాన్ని బాక్ ఎందుకు టార్గెట్ చేసింది? శివానీ, ఆమె భర్త మరణం తర్వాత ఏం జరిగింది? తాపీ మెస్త్రీ (వెన్నెల కిషోర్), కార్పెంటర్ (శ్రీనివాస్ రెడ్డి) శివానీ కూతురును ఎందుకు కిడ్నాప్ చేయాలనుకొంటారు? శివానీ పిల్లల కోసం శివ శంకర్ ఏం చేశాడు? ఈ కథలో డాక్టర్ మాయ (రాశీ ఖన్నా) పాత్ర ఏమిటి? దుష్టశక్తి బాక్‌ను ఎలా అంతం చేశారు అనే ప్రశ్నలకు సమాధానం బాక్ (అరణ్మనై 4) సినిమా కథ.

సుందర్ సీ రాసుకొన్న కథలో పాయింట్ బాగున్నది. కానీ తాను ఎంచుకొన్న స్క్రీన్ ప్లే చాలా గందరగోళంగా ఉంటుంది. దాంతో కథలో ఏం జరుగుతున్నదనే విషయం సాధారణ ప్రేక్షకులకు అర్ధం కావడానికి కష్టంగా ఉంటుంది. అయితే కథ ఏం జరుగబోతుందో అనే విషయం గురించి క్లియర్‌గా చెప్పేయడం కొంత ఆ గందరగోళాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అయితే ఫస్టాప్ అంతా సాగదీసి.. అస్సష్టమైన సన్నివేశాలతో ఏదో సాగుతుందిలే అనే విషయం కనిపిస్తుంది.
ఇక సెకండాఫ్‌లోకి ప్రవేశించిన తర్వాత సుందర్ సీ అనుసరించిన స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంది. మూవీ రెండో భాగంలో అసలు కథ మొత్తం చెప్పడం ద్వారా ఫస్టాఫ్‌లో కలిగిన సందేహాలకు కొంత సమాధానం దొరికేలా కనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు డిజైన్ సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయి. చివరి 15 నిమిషాలు అప్పటి వరకు ఉన్న అసంతృప్తి అంతా పోయేలా చేస్తుంది.

శివానీ పాత్రలో తమన్నా భాటియా తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేసింది. తన ఇమేజ్‌కు భిన్నంగా ఉండే క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. ఇద్దరు పిల్లల తల్లిగా, ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్తను ఇష్టంగా ప్రేమించే భార్యగా పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. రాశీ ఖన్నా పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయింది. ఉన్నంత సేపు కథకు బలంగా నిలిచే పాత్రలో కనిపించింది. ఇక సుందర్ సీ సినిమా కథను నడిపించే పాత్రలో మెప్పించారు. కోవై సరళ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ పాత్రలు నవ్వించే ప్రయత్నం చేశాయి.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్ బాగుంది. పలు సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో నిలబెట్టారు. కృష్ణస్వామి సినిమాటోగ్రఫి.. అలాగే సెకండాఫ్‌లో గ్రాఫిక్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే.. ఫస్టాప్ రేసీగా ఉండేదనిపిస్తుంది. సమ్మర్‌లో చిన్న పిల్లలు ఎంజాయ్ చేసే అవకాశం ఉన్న సినిమా. ఘోస్ట్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి కొన్ని ఎలిమెంట్సో ఉన్నాయి. తమన్నా, రాశీ ఖన్నా కోసం ట్రై చేయవచ్చు.


Click it and Unblock the Notifications











