For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘బంగారి బాలరాజు’ మూవీ రివ్యూ

|

కులం, మతం, పరువు ప్రతిష్టల పేరుతో ప్రేమికులను విడదీయడం రోమియో జూలియట్, సలీం అనార్కలి కాలం నుంచి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా 'పరువు హత్యలు' అనే అంశం చర్చనీయాంశం అయింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అలాంటి కాన్సెప్టుతో తాజాగా విడుదలైన 'బంగారి బాలరాజు' గురించి అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అసలు ఈ సినిమాలో ఏముంది? ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టకుంది? అనేది రివ్యూలో చూద్దాం.

కథలోకి వెళితే

కథలోకి వెళితే

బాలరాజు (రాఘవ్) సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంటాడు. ఓసారి హోళి సందర్భంగా ఫ్రెండ్స్‌తో సరదాగా కబడ్డీ ఆడుతుంటే... మొహమంతా ఏర్పడకుండా రంగులతో ఉన్న ఒక అమ్మాయి వచ్చి ముద్దు పెడుతుంది. ఆ సమయంలో ఆమె కళ్లను చూసి ప్రేమలో పడ్డ బాలరాజు ఆ అమ్మాయి ఎవరు? అని వెతుకుతుండగా... అదే ఊర్లో ఉండే ఫ్యాక్షనిస్టు జగ్గారెడ్డి కూతురు బంగారి(కరోణ్య కత్రిన్) బాలరాజు కనిపించినప్పుడల్లా ఏడిపిస్తూ ఉంటుంది. ఆమె చేసే పనులను ముందు టార్చర్‌గా భావించిన బాలరాజు... చివరకు బంగారి తను ప్రేమించిన అమ్మాయి అని తెలిసి ఆనంద పడేలోపే విషయం జగ్గారెడ్డికి తెలిసిపోతుంది. పరువు కోసం హత్యలు చేసే జగ్గారెడ్డి వారిని చంపడానికి బయల్దేరుతాడు. మరి బంగారి, బాలరాజు తమ ప్రేమను ఎలా నిలబెట్టుకున్నారు అనేది తర్వాతి కథ.

హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్

హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్

ఈ సినిమా ద్వారా రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. తొలి చిత్రమే అయినా పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదనిపించారు. అయితే నటన పరంగా ఇద్దరూ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. రాఘవ్ డైలాగ్ మాడ్యులేషన్ బావుంది. అయితే హావభావాల పరంగా అతడు మరింత పరిణితి చెందాల్సి ఉంది. కరోణ్య కత్రిన్ అందంగా, చలాకీగా కనిపిస్తూ ఆకట్టుకుంది.

ఇతర నటీనటులు

ఇతర నటీనటులు

ఇతర నటీనటుల విషయానికొస్తే.... హీరో తల్లి పాత్రలో మీనా కుమారి ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్ పాత్రలో కిరాక్ ఆర్పీ, జబర్దాస్త్ బాబి మంచి కామెడీ టైమింగుతో మెప్పించారు. జగ్గారెడ్డి పాత్ర ఓకే అనిపిస్తుంది. దూకుడు శ్రవణ్ పోలిస్ పాత్రలో కనిపించేది కొద్దిసేపే అయినా మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు.

సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం

సంగీతం, పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనే విధంగా ఉంది. ఇతర సాంకేతిక విభాగాల పని తీరు ఫర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగిన విధంగా ఉన్నాయి.

కథ, స్క్రీన్ ప్లే

కథ, స్క్రీన్ ప్లే

స్టోరీ కొత్తగా అనిపించిక పోయినా ఈ మధ్యకాలంలో సమాజంలో తరచూ జరుగుతున్న పరువు హత్యలను గుర్తు చేస్తూ సందేశాత్మంగా ఉంది. స్క్రీన్ ప్లేలో మరింత వినోదం జోడిస్తే బావుండేది.

ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

హీరో తల్లిగా మీనా కుమారి పాత్ర

సందేశాత్మకంగా పరువు హత్యల నేపథ్యం

అక్కడక్కడ వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు

మైనస్ పాయింట్స్

లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు

విశ్లేషణ

విశ్లేషణ

ప్రేమికుల మధ్య కులం, మతం, ఆస్తులు, అంతస్తుల విషయషంలో తేడాలు ఉన్నపుడు వారి ప్రేమకు పెద్దలు అడ్డు తగలడం మామూలే. అయితే ఈ పరిణామాలు ప్రేమికుల ప్రాణాలు తీసే వరకు వెళ్లడం సహించరాని నేరం. కేవలం పరువు ప్రతిష్ట కోసం కన్న బిడ్డలను సైతం కడతేర్చే వారికి కనువిప్పు కలిగేలా సినిమాను సందేశాత్మకంగా మలిచిన తీరు అభినందించాల్సిందే. అయితే స్కిప్టు, మేకింగ్ విషయంలో దర్శకుడు మరింత శ్రద్ధ పెడితే సినిమా ఓ రేంజికి వెళ్లేది. అక్కడక్కడ కొన్ని లాజిక్ లేని సీన్లు మినహా ఒక మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం బావుంది.

చివరగా...

చివరగా...

పరువు హత్యల నేపథ్యంలో సాగే ప్రేమకథ ‘బంగారి బాలరాజు'. ఒక మంచి విషయాన్ని సమాజానికి చెప్పడానికి చేసిన ప్రయత్నం బావుంది.

తారాగణం, సాంకేతిక నిపుణులు

తారాగణం, సాంకేతిక నిపుణులు

నటీనటులు: రాఘవ్, కరాణ్య కత్రీన్, మీనాకుమారి, దూకుడు శ్రవణ్, ఎన్.వి. చౌదరి, సారిక రామచంద్రరావు, కిరాక్ ఆర్.పి.

బ్యానర్: నంది క్రియేషన్స్

నిర్మాతలు: కేఎండీ రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి

సినిమాటెగ్రఫీ: జి.ఎల్. బాబు

సంగీతం: న్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోటేంద్ర దుద్వాల

రేటింగ్: 3/5

English summary
Baangari Balaraju review. The film is based on a true incident that occurred in Kurnool, Andhra Pradesh and the movie script is written and directed by Kotendra Dudyala and produced by K Md Rafi and Reddam Raghavendra Reddy under Nandini Creations Banner. Cinematography has been handled by GL Babu and the music has been scored by Chinni Krishna.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more