twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓన్లీ ఏక్ బార్..... (కత్రినా ‘బార్ బార్ దేఖో’ మూవీ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    3.0/5

    ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'బార్ బార్ దేఖో' కొంత కాలంగా మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో కాలా చస్మా సాంగ్ రిలీజైన తర్వాత ఈ సినిమాపై ప్రచారం మరింత ఊపందుకుంది.

    సినిమాలో ఒక్కో పాటు రిలీజ్ అవుతూ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. దీనికి తోడు హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ నటిస్తుండటం.... ట్రైలర్లో ఆకట్టుకునే విధంగా ఉండటం, బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్న మూవీ కావడంతో అందరిలోనూ ఆ సక్తి నెలకొంది.

    టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సాధారణంగా టైమ్ ట్రావెల్ స్టోరీలు అంటే ప్రతికార నేపథ్యంలోనే, లేక చారిత్ర నేపథ్యంలో ఉంటాయని మనం ఇప్పటి వరకు చూసాం. తెలుగులో వచ్చిన ఆదిత్య 369, 24 లాంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం.

    అయితే 'బార్ బార్ దేఖో' మూవీ కాన్సెప్టు మాత్రం కాస్త భిన్నంగా ఉంది. ప్రేమ, కెరీర్ లాంటి అంశాలను జోడించి టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. 'లైఫ్‌ ఆఫ్‌ పై' చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన నిత్య మెహ్రా ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

    సినిమా కథాంశం వివరాల్లోకి వెళితే...

    సినిమా కథాంశం వివరాల్లోకి వెళితే...

    జై (సిద్ధార్థ్‌ మల్హోత్రా) గణితంలో జీనియస్. తన నచ్చిన ఈ సబ్జెక్టులో ప్రొఫెసర్ అవ్వాలనేది అతని లక్ష్యం. లక్ష్యాన్ని చేరుకోవడం కోసం చాలా కష్టపడతాడు. జై ప్రియురాలు దియా(కత్రినా కైఫ్‌). ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే పెళ్లి చేసుకుంటే తన లక్ష్యాన్ని చేరుకోలేనేమో అనే సందేహం కలుగుతుంది జైకి. పెళ్లి ముఖ్యమా? లక్ష్యం ముఖ్యమా? అనే సందిగ్ధంలో ఉన్న అతడికి అనుకోకుండా భవిష్యత్తులోకి వెళ్లే అవకాశం వస్తుంది. ఈ శక్తి వచ్చిన తర్వాత జై జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. పెళ్లి, కెరీర్ వీటిలో దేనికి జై దేవి వైపు వెళ్లాడు అనేది ఆసక్తికరంగా చూపించారు.

     ఎవరెవరు ఎలా చేసారు?

    ఎవరెవరు ఎలా చేసారు?

    పెర్ఫార్మెన్స్ పరంగా కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా అదరగొట్టారు. కత్రినా కైఫ్ గ్లామర్ ఈ సినిమాకు హైలెట్. బికినీలో ఆమె గతంలో కంటే మరింత గ్లామరస్ గా కనిపించింది. యువకుడిగా.. మధ్య వయస్కుడిగా భిన్న కోణాల్లో సిద్ధార్థ్‌ చక్కటి అభినయం కనబర్చాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

    దర్శకురాలి పని తీరు...

    దర్శకురాలి పని తీరు...

    ఈ సినిమా కోసం ఎంచుకున్న కాన్సెప్టు కొత్తగా ఉంది. ఎలాంటి బోర్ ఫీలవ్వకుండా టైమ్ ట్రావెల్ కథకు ప్రేమకథను జోడించి మంచి టైమ్ పాస్ ఎంటర్టెనర్ గా మలిచారు. దర్శకురాలికిది తొలి చిత్రమే అయినా అనుభవం ఉన్న వారిలా సినిమాను తెరకెక్కించడంతో సఫలం అయ్యారు.

    సినిమాలో ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు

    సినిమాలో ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు

    సినిమాలో ప్లాస్ పాయింట్లు, మైనస్ పాయింట్ల విషయానికొస్తే......కత్రానా, సిద్ధార్థ్ మల్హోత్రా పెర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. తర్వాత సంగీతం కూడా ఈ సినిమాకు మేజర్ హైలెట్. సినిమాటోగ్రపీ బావుంది. అయితే సెకండాఫ్ మరీ స్లోగా ఉండటం, లాజిక్ లేని సీన్లతో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. అయితే చాలా చోట్ల స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేక పోవడం, రిపీటెడ్ సీన్లు ఉండటం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది.

    సినిమా గురించి ఫైనల్‌గా

    సినిమా గురించి ఫైనల్‌గా

    బార్ బార్ దేఖో అనేంత గొప్ప సినిమా ఏమీ కాదు. కాన్సెప్టు యూనిక్ గా ఉన్నా టేకింగ్ పరంగా కాస్త వీక్ అనిపిస్తుంది. ఓన్లీ ఏక్ బార్ చూడటానికైతే ఓకే.....

    English summary
    "Baar Baar Dekho" is about getting a chance of changing the mistakes in life without making them. But really, I can't think of one thing I'd like to see changed in this film. Except maybe Sarika's prosthetics when she plays dead. Someone overdid the mother's wrinkles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X