twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమర్షియల్‌ బాబా!

    By Staff
    |

    Baba
    -జలపతి
    చిత్రం: బాబా
    నటీనటులు: రజనీకాంత్‌, మనీషా కొయిరాలా, సంఘవి, గౌండమణి, అమ్రిష్‌ పురి, అశీష్‌ విద్యార్థి
    సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, నిర్మాత: రజనీకాంత్‌
    దర్శకత్వం: సురేష్‌ కృష్ణ

    రజనీకాంత్‌ అంటే స్టైల్‌ కింగ్‌. రకరకాల గిమ్మిక్కులు, స్టైల్స్‌ తో మాస్‌ ను మైమరింపించడం ఆయన ప్రత్యేకత. ఈ బాబా చిత్రంలోనూ పక్కా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, అలరించే స్టైల్స్‌ ఉన్నాయి. ఆధ్యాత్మిక భావనను కమర్షియల్‌ గా చెప్పడమే ఈ చిత్రం ప్రధానొద్దేశం. పూర్తిస్థాయిలో అలరించే విధంగా రచయిత రజనీకాంత్‌, దర్శకుడు సురేష్‌ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించారు. పంచ్‌ డైలాగ్‌ లు, రజనీకాంత్‌ చిత్రవిచిత్ర ఫైటింగ్‌ లు, గ్రాఫిక్స్‌ మాయాజాలం, రాజకీయ డైలాగ్‌ లు..ఇవే ఈ సినిమా ఆసాంతం. అయితే, సినిమాను సాధ్యమైనంత వరకు దర్శకుడు రక్తి కట్టించేందుకు ప్రయత్నించాడు.

    ఆధ్యాత్మిక భావనను కమర్షియల్‌ గా చెప్పాలన్న ప్రయత్నంలో చాలా సార్లు కన్ఫ్యూజన్‌ ఏర్పడి...చిత్రం గతి తప్పిపోతుందని అనిపించినా..మళ్ళీ సడెన్‌ గా రజనీ దాన్ని నిరోధించి...సినిమాను రక్తికట్టించాడు. ఈ చిత్రం ఇది ఒక విధంగా రజనీకాంత్‌ ఆటోబయోగ్రఫీ. రజనీ రాజకీయాల్లోకి వస్తాడా రాడా..అని అందరికి ఉన్న కన్ఫ్యూజన్‌ ను తొలగించేందుకే ఈ చిత్రం తీశాడేమోనని క్లైమక్స్‌ ను బట్టి అర్థం అవుతుంది.

    సంవత్సరాల నుంచి హిమాలయాల్లో బతుకుతున్న మహాఅవతార్‌ బాబా శిష్యుడే మన హీరో బాబా. మందు, మాంసం, మగువ వంటి ఐఛ్చిక కోరికలపై ఆశ చావక బాబా అసంతృప్తితో ఉంటాడు. అందుకని మహా అవతార్‌ బాబా మరో జన్మనిచ్చి అతను ఈ కోరికలన్ని తీర్చుకోమని అంటాడు. మళ్ళీ పుట్టిన ఈ బాబా(రజనీకాంత్‌) నాస్తికుడిగా పెరుగుతాడు. దైవం, గివ్యం జాన్తా నహీ అనేది పాలసీ పెట్టుకొని ...అన్యాయాన్ని ఎదిరిస్తుంటాడు. బాబా లేట్‌ గా వచ్చినా లేటేస్ట్‌ గా వచ్చి అందర్నీ చితకబాదుతాడు. న్యాయం పక్షాన నిలిచే బాబా మనీషా ప్రేమలో పడుతాడు.

    కానీ ఆ ప్రేమ ఫలించదు. మరో వైపు బాబాకు మంత్రోపదేశం కలుగుతుంది. ఆ మంత్రం జపిస్తే..ఏది కావాలంటే అది దక్కుతుంది. ఏడు సార్లు మాత్రమే మంత్రం జపించే అవకాశమున్న ఈ మంత్రం నిజమో..కాదో పరీక్షించేందుకే బాబా ఐదు సార్లు వాడుకుంటాడు. ఈ బాబాను పక్కకి తప్పించేందుకు దుష్టశక్తి అయిన ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటాడు. యాగాలు చేయించి బాబాను చంపించాలని అనుకుంటాడు.(ఇది జయలలితకు సింబాలిజం అన్నమాట. జయలలిత ఈ మధ్య తన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పూజలు చేయించింది.) కానీ చివరికి బాబాదే విజయం అనుకొండి. చివరికి బాబా తిరిగి హిమాలయాలకు వెళుతాడా? లేక ప్రజలతోనే ఉంటాడా? అంటే..ఇది ఆరంభం మాత్రమే అని టచ్‌..మళ్ళీ జనాలని కన్ఫ్యూజన్‌ లో పడేస్తాడు. సో..రజనీ రాజకీయ ప్రవేశానికి ఇది ఆరంభం మాత్రమే అని మనం అనుకోవాలి.

    రాజకీయాలు, ఆధ్యాత్మికం, మసాలా కలపి రజనీకాంత్‌ ఈ కథను రూపొందించాడు. 'లేట్‌ గా వచ్చినా లేట్‌ వస్తాడు ఈ బాబా', 'ఆలోచించే మాట్లాడుతాను..మాట్లాడాక ఆలోచించను', 'మీరు సరిగ్గా పాలిస్తే...నా అవసరం లేదు..నా విషయంలో మీరు తలదూర్చకండి..మీ దారికి నేను రాను.' లాంటి డైలాగ్స్‌ కోకొల్లలు ఈ చిత్రంలో. రజనీకాంత్‌ నటన గురించి కొత్తగా చెప్పదేముంది. అయితే, ఈ సినిమాలో అతని మేకప్‌ సరిగా లేదు. గెడ్డం..ఒకసారి చిన్నగా, మరోసారి పెద్దగా కనుపడుతుంటుంది. మనీషా ఆంటీ పాత్ర చాలా స్వల్పం. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం ఈ చిత్రానికి పెద్ద మైనస్‌ పాయింట్‌. ఛోటా.కె.నాయుడు ఫోటోగ్రఫీ, గ్రాఫిక్స్‌ ఈ చిత్రాన్ని బాగా ఎలివేట్‌ చేశాయి. దర్శకుడు సురేష్‌ కృష్ణ 'మహాశక్తి' రామనారయణను తలపించాడు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X